Begin typing your search above and press return to search.

భ‌యంతోనే సెల్పీ ఇవ్వ‌లేద‌న్న న‌టి!

సెల్పీల కోసం వ‌చ్చిన వారికి సెల్పీలు ఇవ్వ‌కుండా వెళ్లిపోవ‌డం ఏంటి? అని మండిప‌డ్డారు. తాజాగా ఈ ఘ‌ట‌నపై ర‌వీనా టాండ‌న్ స్పందించింది.

By:  Tupaki Desk   |   14 Sep 2024 5:52 AM GMT
భ‌యంతోనే  సెల్పీ ఇవ్వ‌లేద‌న్న న‌టి!
X

ఇటీవ‌ల లండ‌న్ వెళ్లిన బాలీవుడ్ న‌టి ర‌వీనా టాండ‌న్ కి వింత అనుభ‌వం ఎదురైంది. లండ‌న్ లో ఒంట‌రిగా రోడ్డు మీద నిల‌బ‌డిన స‌మ‌యంలో ఆమె అభిమానులు సెల్పీ దిగేందుకు ఆమె వ‌ద్ద‌కు వ‌చ్చారు. వాళ్లంతా ఎంతో ప్రేమాభిమానంతో ఆమె వ‌ద్ద‌కు వ‌చ్చారు. కానీ ర‌వీనా టాండ‌న్ మాత్రం ఎలాంటి సెల్పీలు ఇవ్వ‌కుండా అక్క‌డ నుంచి వేగంగా ముందుకు వెళ్లిపోయారు. వాళ్లను చూసి ఏదో ఆందోళ‌న‌కు గుర‌వుతున్న‌ట్లు క‌నిపించింది.

దీంతో ర‌వీనా టాండ‌న్ పై సోష‌ల్ మీడియా వేదిక‌గా కొన్ని విమ‌ర్శ‌లు వ్య‌క్త‌మ‌య్యాయి. సెల్పీల కోసం వ‌చ్చిన వారికి సెల్పీలు ఇవ్వ‌కుండా వెళ్లిపోవ‌డం ఏంటి? అని మండిప‌డ్డారు. తాజాగా ఈ ఘ‌ట‌నపై ర‌వీనా టాండ‌న్ స్పందించింది. `ఇటీవల జరుగుతున్న నేరాలను చూసి భ‌య‌ప‌డ్డాను. వాళ్లంతా అప్పుడు ఎందుకు వ‌చ్చారో? నాకు అర్దం కాలేదు. అలా రావ‌డం నాకు భ‌య‌మేసింది.

వాళ్ల‌ని అడిగి తెలుసుకోవాల‌న్నా భ‌య‌మేసింది. ఆ సమయంలో నేను ఒంటరిగా ఉన్నాను. దేశం కాని దేశం..ఒంట‌రిగా రోడ్డు మీద ఉండటంతో సెక్యురిటీని పిలిచి వెళ్లిపోయాను. కానీ వారంతా నా మీద అభిమానంతో సెల్పీల కోసం వ‌చ్చార‌ని త‌ర్వాత గ్ర‌హించాను. అందుకు ఎంతో ఫీల్ అవుతున్నారు. ఈ సంద‌ర్భంగా వాళ్లంద‌ర్నీ క్ష‌మించ‌మ‌ని కోరుతున్నాను. మ‌ళ్లీ భ‌విష్య‌త్ లో క‌లిస్తే త‌ప్ప‌కుండా అంతా క‌లిసి ఫోటోలు దిగుదాం` అని వివ‌ర‌ణ ఇచ్చారు.

దీంతో సోష‌ల్ మీడియా అభిమానులు కాస్త శాంతిస్తున్నారు. ప్ర‌స్తుతం ఈ వ్యాఖ్య‌లు నెట్టింట వైర‌ల్ గా మారాయి. ర‌వీనా స్పందించి మంచి ప‌ని చేసింది. లేదంటే ఆమె జీవితంలో ఇదో మ‌చ్చ‌లా ఉండిపోయేది. అభిఆమ‌నుల విష‌యంలో తారలు ఎంతో జాగ్ర‌త్త‌గా వ్య‌వ‌రించాలి. ఎందుకంటే అభిమానం అన్న‌ది ఎంతో సున్నిత‌మైన అంశం. అందుకే స్టార్ హీరోలు సైతం ఫ్యాన్స్ విష‌యంలో ఆచితూచి వ్య‌వ‌హ‌రిస్తుంటారు.