ఫోటోగ్రాఫర్ కి చెవిరింగులు కానుకిచ్చిన స్టార్ హీరోయిన్
సినిమా జర్నలిస్టులు, ఫోటోగ్రాఫర్లను పరిశ్రమలో 25వ శాఖ అని అభివర్ణించారు దర్శకరత్న డా.దాసరి నారాయణరావు.
By: Tupaki Desk | 6 March 2025 3:57 PM ISTసినిమా జర్నలిస్టులు, ఫోటోగ్రాఫర్లను పరిశ్రమలో 25వ శాఖ అని అభివర్ణించారు దర్శకరత్న డా.దాసరి నారాయణరావు. సినీ సెలబ్రిటీల జీవితాలలో జర్నలిస్టులు, ఫోటోగ్రాఫర్లు ఒక భాగం. స్టార్లతో సత్సంబంధాలు నడపడంలో వీరంతా ముందుంటారు. అలాగే జర్నలిస్టులు, ఫోటోగ్రాఫర్లకు ఏదైనా కష్టం వస్తే ఆదుకునేందుకు సెలబ్రిటీలు వెనకాడరు. కష్ట కాలంలో ధాతృ సాయం చేసి ఆదుకున్న చాలా సందర్భాలున్నాయి. ముఖ్యంగా టాలీవుడ్ స్టార్లలో ఇలాంటి మంచి కల్చర్ ని మనం రెగ్యులర్ గా చూస్తున్నాం.
బాలీవుడ్ లోను సెలబ్రిటీలు ఫోటోగ్రాఫర్లతో ఎంతో సన్నిహితంగా మెలుగుతారు. ఫోటోగ్రాఫర్లు లేదా జర్నలిస్టుల జీవితాలలో కష్ట సమయాల్లో ఆదుకునేందుకు తారలు ఎప్పుడూ వెనకాడరు. ఇక బర్త్ డేలు, ఇతర కుటుంబ వేడుకలకు అతిథులుగా హాజరై విరివిగా కానుకల్ని అందించిన సందర్భాలున్నాయి. ఫోటోగ్రాఫర్లతో కలిసి కేకులు కట్ చేయడం వారి జీవితంలో ముఖ్యమైన వేడుకలను కలిసి జరుపుకోవడం సహా బహుమతులు అందజేయడం వగైరా చూస్తుంటాం. ఇప్పుడు ప్రముఖ బాలీవుడ్ నటి రవీనా టాండన్ విమానాశ్రయంలో తన బంగారం చెవిపోగులను ఒక స్టిల్ ఫోటోగ్రాఫర్ కి కానుకగా ఇస్తున్న వీడియో అంతర్జాలంలో వైరల్ అవుతోంది.
సడెన్ గా రవీనా ఇలా చేయడం ఆశ్చర్యపరుస్తోంది. అయితే ఆపాత్ర దానంలో రవీనా టాండన్ ఎప్పుడూ ముందున్నారు. నూతన వధూవరులకు తన పెళ్లి గాజులను బహుమతిగా ఇచ్చినప్పుడు వార్తల్లో నిలిచారు. ఒక అందమైన చిరునవ్వుతో ఎదుటివారి హృదయాలను తేలికగా మార్చేసే రవీనాలోని ధాతృగుణం ఎల్లపుడూ చర్చనీయాంశమే. ఇప్పుడు చెవి రింగులను అకస్మాత్తుగా తీసి ఫోటోగ్రాఫర్ కి బహుమతిగా ఇచ్చింది.
కొందరు స్టార్లు సినీజర్నలిస్టులను దర్శకులను చేసారు. రచయితలుగా ఎంకరేజ్ చేసారు. కొందరిని నిర్మాతలుగాను మార్చారు. సెలబ్రిటీలకు జర్నలిస్టులతో ఉండే అనుంబంధం అలాంటిది. ఇరువురి నడుమా సత్సంబంధాలను ఇవన్నీ నిరూపిస్తున్నాయి. కేవలం రవీనా టాండన్ మాత్రమే కాదు.. సినీపరిశ్రమలో చాలా మంది గుప్తదానాలు చేస్తుంటారు. దానధర్మాలకు ప్రచారం కూడా అంతగా ఉండదు.
కెరీర్ మ్యాటర్ కి వస్తే రవీనా టాండన్ కేజీఎఫ్ 2లో నటించిన సంగతి తెలిసిందే. ఇటీవల ఘుడ్చాడిలో కనిపించారు. వెల్‌కమ్ టు ది జంగిల్ లోను రవీనా ఆసక్తికర పాత్రలో కనిపించనున్నారు.