అభిమానులకు సీనియర్ బ్యూటీ క్షమాపణలు!
బాలీవుడ్ స్టార్ కిడ్స్ నటించిన 'ది అర్చిస్ ' ఇటీవల రిలీజ్ అయి మంచి విజయం సాధించిన సంగతి తెలిసిందే
By: Tupaki Desk | 12 Dec 2023 2:45 AM GMTబాలీవుడ్ స్టార్ కిడ్స్ నటించిన 'ది అర్చిస్ ' ఇటీవల రిలీజ్ అయి మంచి విజయం సాధించిన సంగతి తెలిసిందే. విమర్శకులు ప్రశంసలు దక్కించుకున్న చిత్రంగా నిలిచింది. సోషల్ మీడియా వేదికగా బాలీవుడ్ సెలబ్రిటీలంతా ఆర్చిస్ టీమ్ ని ప్రశంసించారు. ఓటీటీ లో రిలీజ్ అయిన అర్చిస్ కి అన్ని భాషల నుంచి మంచి రెస్పాన్స్ వస్తోంది. దీంతో బాలీవుడ్ సెలబ్రిటీల స్టార్ కిడ్స్ పర్పెక్ట్ లాంచింగ్ అంటూ ప్రశంసలు దక్కుతున్నాయి.
సరిగ్గా ఇలాంటి సమయంలో బాలీవుడ్ సీనియర్ నటి రవీనా టాండన్ బాలేదంటూ వచ్చిన ఓ నెగిటివ్ కామెంట్ కి లైక్ కొట్టారు. దీంతో దానికి సంబంధించిన స్క్రీన్ షాట్ ని కొందరు అభిమానులు సోషల్ మీడియాలో షేర్ చేసారు. ఈ నేపథ్యంలో రవీనాపై ఒక్కసారిగా ప్రేక్షకాభిమానులు భగ్గుమన్నారు. బాగున్న సినిమాని బాగాలోదు అనడమే కాకుండా..లైక్ కొడతారా? మీకు ఇది తగునా అంటూ మండిపడుతున్నారు.
రవీనా టాండన్ కుమార్తె తెరంగేట్రాన్ని ప్రస్తావిస్తూ ట్రోల్ చేయడం మొదలు పెట్టారు. దీంతో రవీనా టాండన్ వెంటనే లైన్ లోకి వచ్చారు. నెగిటివ్ కామెంట్ కి లైక్ కొట్టినందకు గాను ఆమె క్షమాపణలు కోరారు. దీనిపై రవీనా టాండన్ వివరణ ఇచ్చే ప్రయత్నం చేసారు. నేను సోషల్ మీడియాలో స్క్రోలింగ్ చేస్తూ పొరపాటున లైక్ బటన్ నొక్కాను. నాకు తెలియకుండానే అది జరిగిపోయింది.
నేను ఆ పోస్ట్ ని లైక్ చేయడం వల్ల చాలా మందికి బాధ కలిగించిందని అర్దమైంది. వాళ్లకు అసౌకర్యం కల్పించినందుకు క్షమాపణలు కోరుతున్నా. ఈ సినిమా నేను చూశాను. చాలా బాగుంది' అని ఓ పోస్ట్ చేసారు. ప్రస్తుతం ఆ పోస్ట్ నెట్టింట వైరల్ గా మారింది. దీంతో సోషల్ మీడియా లో వేడి కాస్త చల్లారింది. అయినా రవీనా టాండన్ వివరణ పై కొంత మంది అభిమానులు అసంతృప్తిగానే ఉన్నట్లు కనిపిస్తుంది. సినిమా చూసిన రవీనా టాండన్ చూసిన తర్వాత తనకు నచ్చిందని ఎందుకు పోస్ట్ చేయలేదు? వివాదం వచ్చింది కాబట్టి పాజిటివ్ గా పోస్ట్ చేసారు? ఇది నిజంగా నమ్మాల్సిన నిజమేనా? అంటూ సందేహాలు వ్యక్తం చేస్తున్నారు.