ఎన్టీఆర్ హైట్.. రవిబాబు అలా అన్నాడా.. నిజమెంత?
తాజాగా టాలీవుడ్ దర్శకుడు రవిబాబు ఇంటర్వ్యూలో చేసిన కామెంట్స్ సోషల్ మీడియాలో పెద్ద దుమారాన్ని రేపాయి.
By: Tupaki Desk | 13 Feb 2025 12:27 PM GMTసోషల్ మీడియా గాసిప్స్ ఎక్కడి నుంచి ఎక్కడికి వెళ్తాయో చెప్పడం కష్టం. నిజం, అబద్దం మధ్య గల గీత చాలా సార్లు కనిపించదు. తాజాగా టాలీవుడ్ దర్శకుడు రవిబాబు చాలా పాత ఇంటర్వ్యూలో చేసిన కామెంట్స్ సోషల్ మీడియాలో పెద్ద దుమారాన్ని రేపాయి. యాంటీ ఫ్యాన్స్ రవిబాబు మాటలను కట్ చేసి, Jr. ఎన్టీఆర్ హైట్ పై వ్యాఖ్యలు చేసినట్టుగా చూపిస్తూ ట్రోలింగ్ మొదలుపెట్టారు. అయితే నిజం వేరే కోణంలో ఉందని ఎన్టీఆర్ ఫ్యాన్స్ తేల్చేశారు.
ఇంటర్వ్యూలో రవిబాబు మాట్లాడుతూ, “అతనికి తెలుగు రాదు.. ఎక్కడి నుంచో రావాలి.. నా భుజం వరకే ఉంటాడు” అంటూ వ్యాఖ్యానించాడు. యాంటీ ఫ్యాన్స్ ఈ మాటలను కట్ చేసి, సింహాద్రి సినిమాలో ఎన్టీఆర్ సీన్లను కలిపి, రవిబాబు ఎన్టీఆర్ హైట్ గురించి కామెంట్ చేశాడని ప్రచారం చేశారు. ఈ ఎడిటెడ్ వీడియో కాస్తా సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది.
అయితే అసలు వీడియోను ఎన్టీఆర్ అభిమానులు బయటకు తీసుకొచ్చారు.
నిజానికి రవిబాబు ఆ వ్యాఖ్యలు బాలీవుడ్ నటుడు అశుతోష్ రాణా గురించి చేసినవి. ఒక సినిమా క్యాస్టింగ్ గురించి చెబుతూ, “ ఎక్కువ రెమ్యునరేషన్ ఇవ్వండి.. అతను తెలుగులో మాట్లాడలేడు.. నా భుజం వరకే ఉంటాడు” అని అశుతోష్ రాణాను ఉద్దేశించి చెప్పిన మాటలను యాంటీ ఫ్యాన్స్ వక్రీకరించి ట్రోల్ చేశారు. ఈ వైరల్ ఎడిటింగ్ ఎపిసోడ్ ద్వారా సోషల్ మీడియాలో ఫేక్ న్యూస్‌లు ఎలా పుట్టుకొస్తాయో మరోసారి స్పష్టమైంది.
ఎన్టీఆర్ అభిమానులు అసలు వీడియోని షేర్ చేస్తూ, “మొదట నిజం తెలుసుకోండి.. తరువాత ట్రోల్ చేయండి” అంటూ యాంటీ ఫ్యాన్స్‌కు కౌంటర్ ఇచ్చారు. కొంతమంది సినీ ప్రియులు కూడా, ఎడిటెడ్ వీడియోలపై నమ్మకం పెట్టుకోకుండా, వాస్తవం తెలుసుకోవాలంటూ సోషల్ మీడియాలో అవగాహన పెంచుతున్నారు.
ఇలాంటి సంఘటనలు సోషల్ మీడియాలో నిత్యం జరుగుతూనే ఉంటాయి. చిన్న విషయాలను వక్రీకరించి పెద్ద వివాదాలుగా మార్చడం ఒక ట్రెండ్‌గా మారింది. ఫ్యాన్ వార్‌లు మరింత హద్దులు దాటి వ్యక్తిగత విమర్శల దారిలోకి వెళ్తున్నాయి. అయితే, ఈ సంఘటనలో ఎన్టీఆర్ అభిమానులు వెంటనే స్పందించి అసలు సత్యాన్ని బయటపెట్టడం విశేషం. ఈ ఎపిసోడ్ ఒక్కటే కాదు, భవిష్యత్తులో కూడా ఇలాంటి ఫేక్ వీడియోలు వస్తూనే ఉంటాయి. కాబట్టి సోషల్ మీడియాలో ఏది చూసినా, నిజమా కాదా అని రెండు సార్లు ఆలోచించాలి. ఎడిటింగ్ టెక్నాలజీ పెరిగిన ఈ యుగంలో నిజానిజాలను వేరు చేసే పద్ధతి మనకు ఉండాలి. ఈ రవిబాబు-ఎన్టీఆర్ వివాదం మరోసారి ఒక స్పష్టమైన సందేశం ఇచ్చిందని చెప్పవచ్చు.