Begin typing your search above and press return to search.

వీడియో : ఎన్టీఆర్‌ కి 'సలార్‌' కంపోజర్‌ సర్‌ప్రైజ్‌

యంగ్ టైగర్‌ ఎన్టీఆర్‌ ఫ్యాన్స్ తో పాటు పాన్ ఇండియా సినీ ప్రేమికులు, ఇండస్ట్రీకి చెందిన అన్ని వర్గాల వారు ఎంతో ఆసక్తిగా ఎదురు చూస్తున్న 'దేవర' సినిమా విడుదలకు సిద్ధం అయింది

By:  Tupaki Desk   |   12 Sep 2024 6:38 AM GMT
వీడియో : ఎన్టీఆర్‌ కి సలార్‌ కంపోజర్‌ సర్‌ప్రైజ్‌
X

యంగ్ టైగర్‌ ఎన్టీఆర్‌ ఫ్యాన్స్ తో పాటు పాన్ ఇండియా సినీ ప్రేమికులు, ఇండస్ట్రీకి చెందిన అన్ని వర్గాల వారు ఎంతో ఆసక్తిగా ఎదురు చూస్తున్న 'దేవర' సినిమా విడుదలకు సిద్ధం అయింది. ఈనెల 27న ప్రపంచ వ్యాప్తంగా భారీ ఎత్తున విడుదల కాబోతున్న 'దేవర' సినిమా ప్రమోషన్స్ లో భాగంగా ఇటీవల ముంబైలో పర్యటించిన ఎన్టీఆర్‌ అంతకు ముందు కుటుంబ సభ్యులతో కలిసి దైవ దర్శనం కోసం కర్ణాటక వెళ్లిన విషయం తెల్సిందే. ఆ సమయంలో పలువురు కన్నడ స్టార్స్ ను ఎన్టీఆర్‌ కలిశాడు. ముఖ్యంగా రిషబ్ శెట్టితో ఎన్టీఆర్ ఎక్కువ సమయం కలిసి ఉండటం సోషల్‌ మీడియాలో కనిపించింది.

కర్ణాటక వెళ్లిన సమయంలో దర్శకుడు ప్రశాంత్‌ నీల్ ఇంకా రిషబ్‌ శెట్టితో కలిసి ఎన్టీఆర్‌ 'సలార్‌' సంగీత దర్శకుడు రవి బస్రూర్ స్టూడియో ను సందర్శించాడు. ఆ సమయంలో ఎన్టీఆర్ కు రవి టీం సాదర స్వాగతం పలికింది. ఎన్టీఆర్‌, ప్రశాంత్ నీల్ కాంబోలో రూపొందబోతున్న సినిమాకు రవి బస్రూర్ సంగీతాన్ని అందించబోతున్నాడు. అందులో భాగంగా తాజాగా ఆయన స్టూడియోను ఎన్టీఆర్‌ సందర్శించడంతో పాటు, టీం మెంబర్స్ తో కొద్ది సమయం ముచ్చటించి, తన సినిమాకు ఎలాంటి సంగీతాన్ని ఇవ్వబోతున్నారు అనే విషయాల గురించి చర్చించారని సమాచారం అందుతోంది.

ఎన్టీఆర్‌ తన స్టూడియోకు రావడం పట్ల సంతోషం వ్యక్తం చేసిన సంగీత దర్శకుడు రవి బస్రూర్‌ సర్‌ప్రైజింగ్ గా ఒక నిమిషం నిడివితో వీడియోను విడుదల చేశాడు. అందులో బ్యాక్ గ్రౌండ్‌ స్కోర్ తో పాటు, లిరిక్స్ ఉన్నాయి. వీడు నడిచే దారి... అంటూ ఎన్టీఆర్‌ పై ప్రత్యేకంగా రాసిన పాటకు రవి టీం ట్యూన్‌ చేసి స్టూడియోను చూసేందుకు ఎన్టీఆర్‌ వచ్చినప్పటి విజువల్స్ ను వేయడం జరిగింది. ప్రస్తుతం సోషల్‌ మీడియాలో ఈ వీడియో తెగ వైరల్‌ అవుతోంది. రవి బస్రూర్ చేసిన ఈ నిమిషం పాట చాలా పవర్‌ ఫుల్‌ గా ఆకట్టుకునే విధంగా ఉందంటూ ఫ్యాన్స్ తెగ కామెంట్స్ చేస్తున్నారు.

ప్రస్తుతం ఎన్టీఆర్‌ 'దేవర' సినిమా పబ్లిసిటీ పనుల్లో బిజీగా ఉన్నాడు. ఈ సినిమా తర్వాత వార్‌ 2 షూటింగ్‌ ను ముగించబోతున్నాడు. వచ్చే ఏడాదిలో ప్రశాంత్‌ నీల్ దర్శకత్వంలో సినిమా ను మొదలు పెట్టబోతున్నాడు. సలార్‌ 2 సినిమా తర్వాత ఎన్టీఆర్‌ తో ప్రశాంత్‌ నీల్‌ సినిమా చేయబోతున్నాడు. దేవర సినిమా ఫలితం పై ఎన్టీఆర్‌ తో పాటు ప్రేక్షకులు అంతా ఆసక్తిగా ఎదురు చూస్తున్నారు. రికార్డ్‌ స్థాయి వసూళ్లను దక్కించుకోవడం ఖాయం అని, దేవర మేకర్స్ చాలా నమ్మకంగా ఉన్నారు. ఎన్టీఆర్‌ కి జోడీగా జాన్వీ కపూర్‌ హీరోయిన్‌ గా దేవర సినిమాలో కనిపించబోతుంది. బాలీవుడ్ స్టార్‌ సైఫ్‌ అలీ ఖాన్‌ ఈ సినిమాలో కీలక పాత్రలో నటించాడు. దేవర పార్ట్‌ 2 వచ్చే ఏడాది చివర్లో మొదలు పెట్టే అవకాశాలు ఉన్నాయి.