Begin typing your search above and press return to search.

క‌న్న‌డ ఇండ‌స్ట్రీని ప‌ట్టించుకోని ర‌ష్మిక‌కు గుణ‌పాఠం

బెంగళూరు ఇంటర్నేషనల్ ఫిల్మ్ ఫెస్టివల్‌కు హాజరయ్యేందుకు నిరాకరించినందుకు నటి రష్మిక మందన్నపై కాంగ్రెస్ ఎమ్మెల్యే రవి గణిగ మండిపడ్డారు

By:  Tupaki Desk   |   3 March 2025 4:36 PM IST
క‌న్న‌డ ఇండ‌స్ట్రీని ప‌ట్టించుకోని ర‌ష్మిక‌కు గుణ‌పాఠం
X

బెంగళూరు ఇంటర్నేషనల్ ఫిల్మ్ ఫెస్టివల్‌కు హాజరయ్యేందుకు నిరాకరించినందుకు నటి రష్మిక మందన్నపై కాంగ్రెస్ ఎమ్మెల్యే రవి గణిగ మండిపడ్డారు. కెరీర్ ప్రారంభించిన పరిశ్రమను ర‌ష్మిక‌ పట్టించుకోలేదని ఆయ‌న‌ ఆరోపించారు. ర‌ష్మిక‌ కన్నడ చిత్ర పరిశ్రమ మూలాలను విస్మరించిందని ఆరోపించారు. ఈ కార్యక్రమానికి పలుమార్లు ఆహ్వానాలు అందినా కానీ ర‌ష్మిక‌ నిరాకరించారని అన్నారు.

తాను కెరీర్ ప్రారంభించిన పరిశ్రమను పక్కనపెట్టినందుకు తనకు గుణపాఠం చెప్పకూడదా? అని ఎమ్మెల్యే గ‌ణిగ ప్రశ్నించారు. రష్మిక 2016 కన్నడ చిత్రం `కిరిక్ పార్టీ`తో రక్షిత్ శెట్టి సరసన సినీ రంగ ప్రవేశం చేసింది. ఆ త‌ర్వాత పూర్తిగా తెలుగు, త‌మిళం, హిందీ సినిమాల‌తో బిజీ అయింది. క‌న్న‌డ ఇండ‌స్ట్రీ అవ‌కాశం ఇచ్చినా, ఇప్పుడు ఫిలింఫెస్టివ‌ల్ కి ఎందుకు హాజ‌రు కావ‌డం లేదు? అని ఎమ్మెల్యే ప్ర‌శ్నించారు.

ముఖ్యంగా శాండ‌ల్వుడ్ అవ‌కాశం క‌ల్పించినా కానీ, కర్ణాటకను, కన్నడ భాషను ర‌ష్మిక‌ విస్మరించారని, అగౌరవపరిచారని ఆరోపించారు. ఫిలింఫెస్టివ‌ల్‌కు రష్మిక మందన్నను చాలాసార్లు ఆహ్వానించారు. అయితే కర్ణాటకను సందర్శించడానికి సమయం లేదని చెప్పి తిరస్కరించింది. నాకు హైదరాబాద్‌లో ఇల్లు ఉంది.. కర్ణాటక ఎక్కడ ఉందో నాకు తెలియదు.. నాకు సమయం లేదు. నేను రాలేను! అని స‌మాధాన‌మిచ్చింద‌ని తెలిపారు. మా శాసనసభ్యురాలు ప‌దిసార్లు త‌న‌ని క‌లిసి ఆహ్వానించినా కానీ, ఇదే మాట అన్నార‌ని విమ‌ర్శించారు. అయితే అత‌డి వ్యాఖ్యను ఖండిస్తూ, మాజీ కేంద్ర మంత్రి రాజీవ్ చంద్రశేఖర్ `ఆగంబరిత కర్నాటక ఎమ్మెల్యే` అని కామెంట్ చేసారు. నటీమణులు సహా ప్రతి పౌరుడికి `హక్కులు` రాసి పెట్టి ఉన్నాయని అన్నారు.