పెద్ద సూపర్‌స్టార్లను వెనక్కి నెట్టాడు!
2025 బాలీవుడ్ విడుదలలలో ఈ చిత్రం స్కై ఫోర్స్ , దేవా తర్వాత మూడవ అతిపెద్ద ఓపెనర్‌గా నిలిచింది.
By: Tupaki Desk | 8 Feb 2025 10:30 PMఇటీవల విడుదలైన 'బ్యాడాస్ రవి కుమార్' బాక్సాఫీస్ అంచనాలను మించి ఓపెనింగులు సాధించిందని బాలీవుడ్ మీడియా కథనాలు వెలువరించింది. హిమేష్ రేషమ్మియాకు కెరీర్ బెస్ట్ ఓపెనింగ్స్ ని అందించిందని, ఈ చిత్రం కేవలం రెండు రోజుల్లో 7 కోట్ల వసూళ్ల మార్కును తాకిందని ట్రేడ్ చెబుతోంది. అంతే కాదు అక్షయ్ కుమార్ , అజయ్ దేవ్‌గన్ వంటి పెద్ద స్టార్‌ల ఓపెనింగ్ కలెక్షన్లను కూడా హిమేష్ రేషమ్మియా అధిగమించడం చర్చగా మారింది. 2025 బాలీవుడ్ విడుదలలలో ఈ చిత్రం స్కై ఫోర్స్ , దేవా తర్వాత మూడవ అతిపెద్ద ఓపెనర్‌గా నిలిచింది.
ఇది రొటీన్ మాస్ మసాలా యాక్షన్ చిత్రం అయినా కానీ... ఆరేళ్ల గ్యాప్ తర్వాత హిమేష్ తిరిగి వస్తున్నా కానీ, బాక్సాఫీస్ వద్ద ఊహించని వసూళ్లను సాధిస్తోంది. తొలి రోజు ఇండియన్ బాక్సాఫీస్ వద్ద 3.52 కోట్ల నికర వసూళ్లను సాధించిన ఈ చిత్రం అక్షయ్ కుమార్ సర్ఫిరా (2.50 కోట్లు), మిషన్ రాణిగంజ్ (2.80 కోట్లు), అజయ్ దేవ్‌గన్ 'ఔరాన్ మే కహా దమ్ థా' (1.70 కోట్లు), నామ్ (22 లక్షలు) సినిమాల తొలి రోజు వసూళ్లను కూడా అధిగమించిందని హిందీ మీడియా పేర్కొంది. హిమేష్ రేషమ్మియా కెరీర్ బెస్ట్ ఓపెనింగులను సాధించిందని ట్రేడ్ చెబుతోంది.
రెండో రోజు మార్నింగ్ థియేటర్ ఆక్యుపెన్సీ తక్కువగా ఉన్నా కానీ, ఇప్పటికే మంచి వసూళ్లను సాధించింది. ఈ చిత్రం దాదాపు రూ. 20 కోట్ల బడ్జెట్‌తో నిర్మించగా ఇప్పటికే రూ. 7 కోట్లకు పైగా వసూలు చేసింది. బాడాస్ రవి కుమార్ బాక్స్ ఆఫీస్ వద్ద రూ. 3 కోట్లతో ప్రారంభమైంది. ప్రస్తుత ట్రెండ్స్ ప్రకారం.. ఈ చిత్రం రెండవ రోజున రూ. 4 కోట్లు వసూలు చేసే అవకాశం ఉందని పింక్ విల్లా వెల్లడించింది. హిమేష్ చిత్రానికి మాస్ లో హైప్ కలిసొచ్చిందని అంచనా వేస్తున్నారు. ఇది స్పూఫ్ యాక్షన్ చిత్రం కేటగిరీలో బెస్ట్ వసూళ్లను సాధించింది. మొదటి వారంలో తన బలమైన పట్టును కొనసాగిస్తే, అది ఇప్పటివరకు హిమేష్ కెరీర్ లో అతిపెద్ద వసూళ్లు సాధించిన చిత్రం అవుతుంది.
బడాస్ రవి కుమార్ ఒక లాభదాయకమైన వెంచర్ అని కూడా విశ్లేషిస్తున్నారు. రూ. 20 కోట్ల నియంత్రిత బడ్జెట్‌తో నిర్మించిన బడాస్ రవి కుమార్ ఇప్పటికే బడ్జెట్ కోణంలో విజయవంతమైన చిత్రం. టికెట్ అమ్మకాలు, డిజిటల్ ప్లాట్‌ఫారమ్‌లు, సంగీతం హక్కులు, శాటిలైట్ రైట్స్ వగైరా మార్గాల ద్వారా భారీ ఆదాయాన్ని ఆర్జించింది. 80ల నాటి మాస్ చిత్రంగా ప్రచారమైనా కానీ, ఈ రెట్రో యాక్షన్ కామెడీ చిత్రం 2025లో మొదటి పెద్ద హిట్ చిత్రంగా నిలవనుంది. బడాస్ రవి కుమార్ 2014లో వచ్చిన అతని చిత్రం 'ది ఎక్స్‌పోస్'కి స్పిన్ ఆఫ్. ఇందులో ప్రభుదేవా, కీర్తి కుల్హారి, సౌరభ్ సచ్‌దేవా, సంజయ్ మిశ్రా, జానీ లివర్ ఇతర కీలక పాత్రలు పోషించారు.