బన్నీపై రవిప్రకాష్ మరో పోస్ట్.. ఈసారి ఏమన్నారంటే?
టాలీవుడ్ లో కొద్ది రోజులుగా సినీ ఇండస్ట్రీలో ఐటీ దాడులు జరుగుతున్న విషయం తెలిసిందే.
By: Tupaki Desk | 25 Jan 2025 4:15 AM GMTటాలీవుడ్ లో కొద్ది రోజులుగా సినీ ఇండస్ట్రీలో ఐటీ దాడులు జరుగుతున్న విషయం తెలిసిందే. అదే సమయంలో అల్లు అర్జున్, పుష్ప-2పై సీనియర్ జర్నలిస్ట్ రవి ప్రకాష్ షాకింగ్ కామెంట్స్ చేయడం.. హాట్ టాపిక్ గా మారింది. నిజానికి.. పుష్ప-2 విడుదల ముందు నుంచే ఆయన వివాదాస్పద పోస్టులు చేస్తూ వార్తల్లో నిలుస్తున్నారు.
డైరెక్టర్ సుకుమార్ ఇల్లు, నిర్మాణ సంస్థ మైత్రీ మూవీ మేకర్స్ ఆఫీస్ పై ఐటీ దాడులు జరగ్గా.. అప్పుడు రవి ప్రకాష్ సంచలన పోస్ట్ పెట్టారు. "అతిశయోక్తితో కూడిన పుష్ప కలెక్షన్లు అల్లు అర్జున్ ను గ్లోబల్ స్టార్ గా చేస్తాయని అనుకున్నారా? కానీ బదులుగా ఆ సినిమా వ్యక్తిగత దురదృష్టంగా మారినట్లు అనిపిస్తుంది" అంటూ వివాదస్పద వ్యాఖ్యలు చేశారు.
"క్రూరమైన నిర్లక్ష్యం కారణంగా మొదట తొక్కిసలాట జరిగింది. ఆ తర్వాత అంతే నిర్లక్ష్యంగా ప్రెస్ మీట్ పెట్టారు. తన సినిమా రీలోడెడ్ వెర్షన్ రిలీజ్ అవుతున్న సమయంలో బాధితుడిని పరామర్శించారు. హైప్ క్రియేట్ చేశారు. మూవీ కోసమే వెళ్లినట్లు ఉంది. పెంచిన వసూళ్ల నెంబర్స్ ఐటీఆర్ రూపంలో వెంటాడుతున్నట్లు ఉంది" అని ఆరోపించారు రవిప్రకాష్.
అందుకే పుష్ప 3 మూవీకి రెక్లెస్ రిటర్న్స్ అని పేరు పెట్టాలని రవి ప్రకాష్ ఎద్దేవా చేశారు. గ్లోబల్ స్టార్ డమ్ కోసం వెయిట్ చెయ్యొచ్చు కానీ ముందుగా డ్యామేజ్ కంట్రోల్ చేసుకోవాలని వ్యాఖ్యానించారు. దీంతో ఆయన పోస్ట్ వైరల్ గా.. నెటిజన్లు ఒక్కొక్కరు ఒక్కోలా స్పందించారు. ఇప్పుడు మరోసారి సోషల్ మీడియాలో రవి ప్రకాష్ పోస్ట్ పెట్టారు.
తనకు సంబంధించిన వార్తను రాసిన మీడియా సంస్థను ట్యాగ్ చేశారు. "అల్లు అర్జున్ తన ఆందోళనను ఆహలో 5% వాటాను దెబ్బతీసేందుకు చేసిన దాడిగా తప్పుగా భావించినట్లు ఉన్నారు. ఆహా స్ట్రీమింగ్ ప్లాట్ ఫామ్ కాదు.. ఇది ఒక ధనవంతుడైన తండ్రి తన బిడ్డకు సెలబ్రిటీగా నటించడానికి ఇచ్చిన బహుమతి. రూ.420 కోట్ల నష్టం జరిగింది. ఏటా రూ.100 కోట్ల నష్టం. నిజానికి ఆహా మునిగిపోవడం లేదు. ఇప్పటికే మునిగింది" అని ఆరోపించారు.
"టీవీ9 (ఇప్పటికే నేను భాగమే) ఆ ప్రాజెక్టులో రూ.90 కోట్ల పెట్టాల్సి వచ్చింది. పార్టనర్ డాడీ వల్లే అది. ఎవరి వాటాల కోసం నేనేం చింతించను. ఆహా పీఆర్ లతోనే నడుస్తుంది. మై హోమ్ హైదరబాద్ లోని ప్రతి భాగస్వామి నేర్చుకున్న అదే చేదు పాఠాన్ని అతను నేర్చుకోవాలి. మీ డబ్బు, కృషి.. వారి కుటుంబం జేబులో వేసుకోవడానికి ఉచితాలు. ఏదేమైనా అహంకారపూరిత నాటకీయతలను ఆపివేసి, వాస్తవాలపై దృష్టి పెట్టాల్సిన సమయం ఇది. కోల్పోయిన జీవితం ఎప్పటికీ తిరిగి రాదు" అంటూ సంచలన వ్యాఖ్యలు చేశారు.