'పుష్ప 2' టికెట్ అందుబాటు ధరలోనే.. నిర్మాత క్లారిటీ..
ప్రపంచమంతట కలిపి 294 కోట్ల డే1 వసూళ్లతో రికార్డు సాధించిన పుష్ప రెండు రోజులకే 500 కోట్ల క్లబ్ లో అడుగుపెట్టిందని నిర్మాతలు ధృవీకరించారు.
By: Tupaki Desk | 8 Dec 2024 3:21 AM GMTఐకన్‌స్టార్ అల్లు అర్జున్- సుకుమార్ కాంబినేషన్ లో వచ్చిన 'పుష్ప 2 : ది రూల్' బాక్సాఫీస్ వద్ద రూల్ చేస్తున్న సంగతి తెలిసిందే. ఈ చిత్రానికి యలమంచిలి రవి శంకర్, ఎర్నేని నవీన్ నిర్మాతలు. మైత్రి మూవీ మేకర్స్ - సుకుమార్ రైటింగ్స్ సంయుక్తంగా నిర్మించాయి. ఈ ప్రతిష్టాత్మక చిత్రం 6 భాషలలో ప్రపంచవ్యాప్తంగా 12000లకు పైగా స్క్రీన్స్ లో విడుదలైంది. ప్రపంచమంతట కలిపి 294 కోట్ల డే1 వసూళ్లతో రికార్డు సాధించిన పుష్ప రెండు రోజులకే 500 కోట్ల క్లబ్ లో అడుగుపెట్టిందని నిర్మాతలు ధృవీకరించారు.
సక్సెస్ మీట్‌లో నిర్మాత రవి మాట్లాడుతూ...''ప్రీమియర్ షో చూడగానే ఇద్దరు సినిమా పిచ్చి ఉన్నవాళ్ళు సినిమా తీస్తే ఎలా ఉంటుందో చూస్తారు. రెండు రోజులకు 500 కోట్లకు పైగా కలెక్ట్ చేసినందుకు ఆనందంగా ఉంది. అలాగే తెలంగాణ, ఆంధ్ర ప్రదేశ్ ప్రభుత్వాలకు పేరుపేరునా మా ధన్యవాదాలు. టికెట్ ధరల విషయంలో అందరూ సహకరించారు. ఇకపై థియేటర్లో టికెట్ రేట్ అందుబాటులో ఉంటుంది. అందరూ కచ్చితంగా చూడాల్సిందిగా కోరుతున్నాము'' అని అన్నారు.
ముఖ్యంగా రవి శంకర్ మాట్లాడుతూ .. పెంచిన టికెట్ ధరల గురించి తప్పుడు ప్రచారం జరుగుతోందని అన్నారు. బెనిఫిట్ షోలకు 800 టికెట్ ధర ఉందని.. ఇప్పుడు టికెట్ మీ అందరికీ అందుబాటు ధరల్లోనే ఉందని కూడా అన్నారు. ప్రస్తుతం బుక్ మై షోలో తొలి వారం టికెట్ ధరలు మల్టీప్లెక్సులకు సుమారు 300 వరకూ ఉంది.