Begin typing your search above and press return to search.

పుష్ప 2పై అనుమానాలు.. మాట ఇచ్చిన నిర్మాత

టాలీవుడ్ ఆడియెన్స్ అత్యంత ఆతృతగా ఎదురుచూస్తున్న చిత్రలలో పుష్ప 2 కూడా టాప్.లిస్టులో ఉంది.

By:  Tupaki Desk   |   30 Aug 2024 9:52 AM GMT
పుష్ప 2పై అనుమానాలు.. మాట ఇచ్చిన నిర్మాత
X

టాలీవుడ్ ఆడియెన్స్ అత్యంత ఆతృతగా ఎదురుచూస్తున్న చిత్రలలో పుష్ప 2 కూడా టాప్.లిస్టులో ఉంది. మొన్న ఆగస్టు 15న ఈ సినిమా రావాలి. కానీ అనుకోని కారణాలతో సినిమా విడుదల డిసెంబర్ 6కి వాయిదా పడింది. సుకుమార్ అసలు ఏమాత్రం కాంప్రమైజ్ కాకుండా సినిమాను తెరపైకి తీసుకు వచ్చే ప్రయత్నం చేస్తున్నాడు. టైమ్ గురించి పట్టించుకోకుండా అవుట్ ఫుట్ బెస్ట్ గా ఉండాలని ఫిక్స్ అయ్యారు.

ఇక డిసెంబర్ 6కి అయినా విడుదలవుతుందా లేదా అనే విషయంలో కూడా అనేక రకాల గాసిప్స్ పుట్టుకొస్తున్నాయి. దర్శకుడు సుకుమార్ సాధారణంగా సినిమా పనుల్లో ఆలస్యం చేస్తారని, తను నిర్ణయించిన సమయానికి సినిమా పూర్తి చేయలేడని పలువురు అభిప్రాయపడ్డారు. ఈ సినిమాను 2025కి వాయిదా వేస్తారనే ప్రచారం కూడా సాగింది.

అయితే ఈ వార్తలపై మైత్రి మూవీ మేకర్స్ నిర్మాత రవిశంకర్ క్లారిటీ ఇచ్చారు. వారి సమర్పణలో రానున్న మత్తు వదలరా 2 సినిమా టీజర్ ను విడుదల చేశారు. ఇక ఈ సందర్భంగా నిర్వహించిన ప్రెస్ మీట్ లో ఆయన స్పందించి క్లారిటీ ఇచ్చారు. డిసెంబర్ 6న పుష్ప 2ని విడుదల చేయడం ఖాయమని ప్రకటించారు.

అంతేకాదు, ప్రేక్షకుల కోసం డిసెంబర్ 5న ప్రత్యేక ప్రీమియర్లు కూడా వేస్తున్నామని పేర్కొన్నారు. నిర్మాత రవి వెల్లడించిన వివరాల ప్రకారం, సెప్టెంబర్ 2నాటికి మొదటి భాగం ఎడిటింగ్ పూర్తవుతుందని, అక్టోబర్ 6లోపు రెండవ భాగం కూడా పూర్తవుతుందని తెలిపారు. నవంబర్ 20నాటికి మొత్తం కాపీ రెడీ అవుతుందని, నవంబర్ 25కి సెన్సార్ పూర్తి చేస్తామని చెప్పారు. ఇంకా రెండు పాటలు చిత్రీకరించాల్సి ఉందని, ఒక పాటను అక్టోబర్‌లో మరో పాటను నవంబర్‌లో విడుదల చేస్తామని కూడా ప్రకటించారు.

ప్రస్తుతం రామోజీ ఫిల్మ్ సిటీలో పుష్ప 2 క్లైమాక్స్ సన్నివేశాల షూటింగ్ జరుగుతోందట. దీంతో పాటు రెండు పాటల చిత్రీకరణ కూడా ఉందని సమాచారం. ఇక నిర్మాత ఇచ్చిన అప్డేట్ విన్న తర్వాత పుష్ప 2 అభిమానుల ఉత్సాహం మరింత పెరిగింది. ఇక సుకుమార్ దర్శకత్వం వహిస్తున్న ఈ సినిమాలో కథానాయకుడు అల్లు అర్జున్ పాత్రను మరింత పవర్‌ఫుల్‌గా చూపించనున్నారని సమాచారం.

మొదటి భాగం ‘పుష్ప’ కేవలం ప్రేక్షకులనే కాకుండా బాక్సాఫీస్ వద్ద కూడా సరికొత్త రికార్డులు సృష్టించింది. దీంతో, రెండవ భాగంపై అంచనాలు మరింతగా పెరిగాయి. ఇక వినాయక చవితి సందర్భంగా సినిమాకు సంబంధించిన ఎలాంటి అప్‌డేట్ ఇవ్వకపోవచ్చని భావిస్తున్నారు. అయితే, డిసెంబర్ 6న మాత్రం ‘పుష్ప 2’ థియేటర్లలో సందడి చేయడం ఖాయమని మైత్రి మూవీ మేకర్స్ ఒక క్లారిటీ అయితే ఇచ్చేసింది.