Begin typing your search above and press return to search.

మాస్‌ రాజా కోసం ఇద్దరు 'అనార్కలి'లు?

మాస్ మహారాజా రవితేజ ప్రస్తుతం మాస్‌ జాతర సినిమాలో నటిస్తున్నాడు. ఇప్పటికే ఆ సినిమా షూటింగ్‌ పూర్తి చేసుకుని విడుదల కావాల్సి ఉంది

By:  Tupaki Desk   |   7 March 2025 4:30 PM
మాస్‌ రాజా కోసం ఇద్దరు అనార్కలిలు?
X

మాస్ మహారాజా రవితేజ ప్రస్తుతం మాస్‌ జాతర సినిమాలో నటిస్తున్నాడు. ఇప్పటికే ఆ సినిమా షూటింగ్‌ పూర్తి చేసుకుని విడుదల కావాల్సి ఉంది. 2025 సంక్రాంతికి విడుదల చేయాలనుకున్న మాస్‌ జాతర సినిమా కొన్ని కారణాల వల్ల వాయిదా పడింది. సంక్రాంతి టార్గెట్‌ మిస్ చేసుకున్న రవితేజ సమ్మర్‌లో ప్రేక్షకుల ముందుకు రాబోతున్నాడు. మాస్ జాతర సినిమాకు సంబంధించిన చివరి దశ షూటింగ్‌ జరుగుతోంది. భారీ అంచనాల నడుమ రూపొందుతున్న సినిమాపై రవితేజ అభిమానులు చాలా ఆశలు పెట్టుకున్నారు. మరో వైపు రవితేజ కొత్త సినిమా దాదాపుగా కన్ఫర్మ్‌ అయింది.

కిషోర్‌ తిరుమల దర్శకత్వంలో రవితేజ హీరోగా ఒక సినిమాకు రంగం సిద్ధం అయింది. ఇప్పటికే స్క్రిప్ట్‌ వర్క్‌ దాదాపుగా పూర్తి చేసుకున్న ఈ సినిమా కోసం దర్శకుడు అనార్కలి అనే టైటిల్‌ను పరిశీలిస్తున్నాడట. సినిమా ప్రారంభం రోజే టైటిల్‌ను అధికారికంగా ప్రకటించే విధంగా ఏర్పాట్లు చేస్తున్నారు. ఈ సినిమాలో రవితేజకు జోడీగా ఇద్దరు ముద్దుగుమ్మలను ఎంపిక చేసినట్లు సమాచారం అందుతోంది. వచ్చే నెల నుంచి రెగ్యులర్‌ షూటింగ్‌ ప్రారంభం కాబోతున్న ఈ సినిమాలో రవితేజతో మమితా బైజు, కయాదు లోహర్‌లు నటించబోతున్నారు. తెలుగులో వీరు నటించిన సినిమాలు లేకున్నా డబ్బింగ్‌ సినిమాలతో ఇక్కడ వీరిద్దరికి మంచి క్రేజ్‌ ఉంది.

మమితా బైజు తెలుగులో ప్రేమలు డబ్బింగ్‌ సినిమాతో మంచి గుర్తింపు దక్కించుకుంది. ఆ సమయంలోనే తెలుగులో నటించే అవకాశాలు వచ్చినప్పటికీ మమతి వెంటనే ఓకే చెప్పలేదు. ఎట్టకేలకు రవితేజకు జోడీగా నటించేందుకు ఓకే చెప్పింది. రవితేజ వంటి మాస్‌ స్టార్‌ సినిమాతో టాలీవుడ్‌లో ఎంట్రీ ఇవ్వడం ద్వారా కచ్చితంగా మంచి ఫలితం ఉంటుందని ఆమె భావిస్తు ఉంటుందనే అభిప్రాయం వ్యక్తం అవుతుంది. మరో వైపు కయాదు లోహర్‌ సైతం తెలుగులో స్టార్‌ హీరోలతో నటించే అవకాశాల కోసం ఎదురు చూస్తుంది. గతంలో ఈమె ఒక తెలుగు సినిమాలో నటించినా అది పెద్దగా ఫలితం రాబట్టలేదు. అందుకే ఇది ఆమెకు తెలుగులో రీ ఎంట్రీతో సమానం.

కిషోర్‌ తిరుమల కమర్షియల్‌ సినిమాలకు పెట్టింది పేరు. యూత్‌ ఆడియన్స్‌కు కనెక్ట్‌ అయ్యే విధంగా మంచి ప్రేమ కథ చిత్రాలతో పాటు, ఎంటర్‌టైన్‌మెంట్‌ సినిమాలు తీయగల దర్శకుడు అని ఇప్పటికే పేరు దక్కించుకున్నాడు. అందుకే కిషోర్ తిరుమల దర్శకత్వంలో రవితేజ సినిమా అనే ప్రకటన అందరిలోనూ ఆసక్తిని రేకెత్తిస్తోంది. అన్ని అనుకున్నట్లుగా జరిగితే సినిమా షూటింగ్‌ ఇదే ఏడాదిలో పూర్తి చేసి, సినిమాను ఇదే ఏడాదిలో విడుదల చేయాలని మేకర్స్‌ ప్లాన్‌ చేస్తున్నారు. రవితేజ సైతం బల్క్‌ డేట్లు ఇచ్చేందుకు రెడీగా ఉన్నారని ఇండస్ట్రీ వర్గాల ద్వారా సమాచారం అందుతోంది.