హిట్ ప్లాప్ తో సంబందం లేకుండా మాస్ రాజాతో!
`ధమాకా` తర్వాత మళ్లీ మాస్ రాజా రవితేజ ప్లాప్ ల పరం పర కొనసాగుతోన్న సంగతి తెలిసిందే.
By: Tupaki Desk | 28 March 2025 8:29 AM`ధమాకా` తర్వాత మళ్లీ మాస్ రాజా రవితేజ ప్లాప్ ల పరం పర కొనసాగుతోన్న సంగతి తెలిసిందే. `ధమాకా`తో బౌన్స్ బ్యాక్ అయినా ఆ సక్సెస్ ని కంటున్యూ చేయలేక పోయాడు. టైగర్ నాగేశ్వరరావు, రావణాసుర, మిస్టర్ బచ్చన్, ఈగల్ అన్నీ ఒకే బాట పట్టిన చిత్రాలే. అయినా సరే మాస్ రాజా కొత్త అవకాశాలు అందుకోవడంలో ఏ మాత్రం దూకుడు తగ్గించడం లేదు. ప్రస్తుతం భాను భోగవరపు దర్శకత్వంలో `మాస్ జాతర`లో నటిస్తోన్న సంగతి తెలిసిందే.
ఇది పక్కా మాస్ ఎంటర్ టైనర్. రవితేజ మార్క్ ఎలివేషన్లు ఉన్న సినిమా. మరోసారి శ్రీలీల మాస్ రాజాకి జోడీగా నటించడం అన్నది అదనపు అస్సెట్. ప్రస్తుతం ఈ సినిమా ఆన్ సెట్స్లో ఉంది. ఈ సినిమా విజయం కూడా రాజాకి అత్యంత కీలకం. ఇప్పటికే మార్కెట్ పరంగా ప్రతికూల పరిస్థితులు ఎదుర వుతున్నాయి. అయినా సరే `మాస్ జాతర` రిలీజ్ కు ముందే మరో ఛాన్స్ అందుకున్నాడు.
ఏకంగా నిర్మాత రవితేజతో సినిమా చేస్తానని ప్రకటిచడం విశేషం. ఎవరా? నిర్మాత అంటే డ్యాష్ అండ్ డేరింగ్ ప్రొడ్యూసర్ నాగవంశీ. సితార ఎంటర్ టైన్ మెంట్స్ లో రవితేజ హీరోగా ఓ సినిమా చేస్తామని ప్రక టించారు. ఇదొక సోషియా ఫాంటసీ చిత్రమని అంటున్నారు. దీంతో రవితేజ కెరీర్ లో ఇదొక డిఫరెంట్ జానర్ సినిమా అని చెప్పాలి. ఇంత వరకూ రవితేజ సోషియో ఫాంటసీ థ్రిల్లర్ లు ట్రై చేయలేదు.
ఆయన శైలి మాస్ కథలే చేసారు తప్ప కొత్త ప్రయత్నాలు కెరీర్లో చాలా తక్కువగా ఉంటాయి. ఈ నేపథ్యంలో నాగవంశీ రవితేజ కొత్త ప్రయత్నానికి పూనుకోవడం విశేషం. ఇప్పుడున్న యువ నిర్మాతల్లో నాగవంశీ డిఫరెంట్. హీరో కంటే కంటెంట్ ని నమ్మి సినిమాలు తీయడంలో ఈయన స్పెషలిస్ట్ గా కనిపిస్తున్నాడు. దిల్ రాజు తర్వాత నాగవంశీ జడ్జిమెంట్లు ఎక్కకువగా ప్రూవ్ అవుతున్నాయి. ఈ నేపథ్యంలో రవితేజతో డేరింగ్ స్టెప్ వేస్తున్నారు.