Begin typing your search above and press return to search.

బాక్సాఫీస్ దెబ్బకు హీరో కూడా తిరిగిచ్చేశాడు

రూ.4 కోట్లు వెనక్కి ఇచ్చారట రవితేజ! అయితే పీపుల్ మీడియా ఫ్యాక్టరీ సంస్థ.. రవితేజకు రూ.4 కోట్ల రెమ్యునరేషన్ పెండింగ్ బ్యాలెన్స్ ఇవ్వాల్సి ఉందట.

By:  Tupaki Desk   |   5 Sep 2024 5:03 AM GMT
బాక్సాఫీస్ దెబ్బకు హీరో కూడా తిరిగిచ్చేశాడు
X

టాలీవుడ్ మాస్ మహారాజా రవితేజ రీసెంట్ గా మిస్టర్ బచ్చన్ మూవీతో ప్రేక్షకుల ముందుకు వచ్చిన విషయం తెలిసిందే. స్టార్ డైరెక్టర్ హరీష్ శంకర్ దర్శకత్వం వహించిన ఆ సినిమా.. ఇండిపెండెన్స్ కానుకగా ఆగస్టు 15వ తేదీన గ్రాండ్ గా విడుదల అయింది. రవితేజ, హరీష్ శంకర్ కాంబోలో గతంలో వచ్చిన షాక్, మిరపకాయ్ చిత్రాలు సినీ ప్రియులను బాగా మెప్పించడంతో.. అంతా మిస్టర్ బచ్చన్ పై భారీ అంచనాలు పెట్టేసుకున్నారు.

దానికి తోడు.. రిలీజ్ కు ముందు మేకర్స్ విడుదల చేసిన టీజర్, ట్రైలర్, సాంగ్స్ మంచి రెస్పాన్స్ అందుకున్నాయి. సినిమాపై క్యూరియాసిటీని పెంచాయి. కానీ మూవీ రిలీజ్ అయిన ఫస్ట్ షోకే నెగిటివ్ టాక్ వచ్చేసింది. బాక్సాఫీస్ వద్ద సినిమా చతికిలపడింది. అనుకున్న స్థాయిలో వసూళ్లు సాధించలేకపోయింది. దీంతో మూవీని నిర్మించిన సంస్థలతోపాటు డిస్ట్రిబ్యూటర్లకు భారీగా నష్టాలు వచ్చినట్లు తెలుస్తోంది.

అందుకే రీసెంట్ గా హరీష్ శంకర్.. కీలక నిర్ణయం తీసుకున్నట్లు వార్తలు వచ్చిన విషయం తెలిసిందే. మిస్టర్ బచ్చన్ వల్ల నష్టాలు రావడంతో తన రెమ్యునరేషన్ లోని రూ.6 కోట్లను హరీష్.. నిర్మాతకు వెనక్కి ఇస్తున్నట్లు వినికిడి. ఇప్పుడు రూ.2 కోట్లు.. తన నెక్స్ట్ సినిమా రెమ్యునరేషన్ లోని రూ.4 కోట్లను వాపస్ చేయనున్నట్లు సమాచారం. తాజాగా రవితేజ.. కూడా హరీష్ బాటలోనే నడిచినట్లు టాక్ వినిపిస్తోంది.

రూ.4 కోట్లు వెనక్కి ఇచ్చారట రవితేజ! అయితే పీపుల్ మీడియా ఫ్యాక్టరీ సంస్థ.. రవితేజకు రూ.4 కోట్ల రెమ్యునరేషన్ పెండింగ్ బ్యాలెన్స్ ఇవ్వాల్సి ఉందట. మిస్టర్ బచ్చన్ డిజాస్టర్ గా మారడంతో మిగిలిన బ్యాలెన్స్ చెల్లించవద్దని రవితేజ.. విశ్వప్రసాద్ కు సూచించినట్లు సమాచారం. ఇప్పుడు డైరెక్టర్, హీరో.. తీసుకున్న నిర్ణయాల వల్ల కొంతలో కొంత నష్టాలు క్లియర్ అవ్వనున్నట్లు తెలుస్తోంది. బయ్యర్లకు వచ్చిన లాస్ కూడా భర్తీ కావొచ్చట.

బాలీవుడ్ సూపర్ హిట్ మూవీ రైడ్ కు రీమేక్‍ గా మిస్టర్ బచ్చన్ మూవీని హరీశ్ శంకర్ తెరకెక్కించారు. పలు మార్పులు చేసి, కమర్షియల్ అంశాలు జోడించి మరీ తీసుకొచ్చినా.. ప్రేక్షకులను మెప్పించలేకపోయింది. నెగిటివ్ టాక్ రావడంతో మేకర్స్.. 13 నిమిషాల రన్ టైమ్ ను తగ్గించినా లాభం లేకుండా పోయింది. ఇప్పుడు ఓటీటీ రిలీజ్ కు సిద్ధమవుతోంది మిస్టర్ బచ్చన్. త్వరలో ప్రముఖ ఓటీటీ నెట్ ఫ్లిక్స్ లో స్ట్రీమింగ్ అవ్వనుంది.