Begin typing your search above and press return to search.

మాస్ హీరోతో.. మ్యాడ్ స్క్వేర్ కు మించి..

టాలీవుడ్ స్టార్ హీరో, మాస్ మహారాజా రవితేజ రిజల్ట్ తో సంబంధం లేకుండా వరుస సినిమాలు చేస్తున్న విషయం తెలిసిందే.

By:  Tupaki Desk   |   1 April 2025 12:30 PM
మాస్ హీరోతో.. మ్యాడ్ స్క్వేర్ కు మించి..
X

టాలీవుడ్ స్టార్ హీరో, మాస్ మహారాజా రవితేజ రిజల్ట్ తో సంబంధం లేకుండా వరుస సినిమాలు చేస్తున్న విషయం తెలిసిందే. గత ఏడాది ఈగల్, మిస్టర్ బచ్చన్ మూవీలతో ప్రేక్షకుల ముందుకు వచ్చిన ఆయన.. ఇప్పుడు మాస్ జాతరతో తో బిజీగా ఉన్నారు. త్వరలోనే ఆ సినిమాతో థియేటర్లలో సందడి చేయనున్నారు.

అయితే మాస్ జాతర తర్వాత వరుస సినిమాలను లైన్లో పెడుతున్నారు రవితేజ. అందులో మ్యాడ్ స్క్వేర్ డైరెక్టర్ కళ్యాణ్ శంకర్ తో ఓ సినిమా ఉన్న విషయం తెలిసిందే. రీసెంట్ గా నాగవంశీ ఆ ప్రాజెక్టుకు సంబంధించి క్రేజీ అప్డేట్ ఇచ్చి మంచి బజ్ క్రియేట్ చేశారు. సూపర్ హీరో జోనర్ లో రవితేజ, కళ్యాణ్ శంకర్ మూవీ ఉంటుందని తెలిపారు. పూర్తిగా ఫిక్షన్ స్టోరీ ఉంటుందని చెప్పారు.

సూపర్ హీరోకు ఒక మంచి బ్యాక్ స్టోరీ ఉంటుందని, సినిమా కొత్తగా అనిపిస్తుందని తెలిపారు. ఇప్పుడు కళ్యాణ్ శంకర్.. మరిన్ని విషయాలు పంచుకున్నారు. తన హ్యాట్రిక్ మూవీ రవితేజ తో ప్లాన్ చేస్తున్నట్లు చెప్పారు. కచ్చితంగా అందరినీ సినిమా అలరిస్తుందని తెలిపారు. ఫుల్ కామెడీ ఉంటుందని, అందరికీ నచ్చుతుందని పేర్కొన్నారు.

"నెక్స్ట్ మూవీ రవితేజతో చేస్తున్నాను.. ఆరు ఏడేళ్ల క్రితం స్టోరీ రాసుకున్నా.. ఆ తర్వాత దాన్ని డెవలప్ చేసుకుంటూ వచ్చాను.. ఇప్పుడు పెర్ఫెక్ట్ గా రవితేజ గారి కోసం డిజైన్ చేశాను.. మ్యాడ్ స్క్వేర్ వైబ్ చూశారుగా.. రవితేజ గారిది అంతకు మించి ఉంటుంది.. పెద్ద వైబ్సే ఉంటాయి. మూవీ ఫుల్ ఎంటర్టైనర్.. ఎంటర్టైన్మెంట్ తో పాటు బిగ్గెస్ట్ పాయింట్ ఉంటుంది" అని తెలిపారు కళ్యాణ్ శంకర్

ఆ తర్వాత సినిమా ఎప్పుడు స్టార్ట్ అవుతుందో చెప్పారు కళ్యాణ్ శంకర్. ఇప్పుడు కొంచెం ప్రీ ప్రొడక్షన్ వర్క్ ఉందని, దానికి టైమ్ పడుతుందని తెలిపారు. ఆగస్టు, సెప్టెంబర్ లో మూవీ స్టార్ట్ అవుతుందని అన్నారు. రవితేజ గారు ఎగ్జైట్మెంట్ తో ఉన్నారని వెల్లడించారు. స్టోరీ విని చాలా హ్యాపీగా ఉన్నారని, ఆయనతో కూర్చుంటే ఫుల్ ఎనర్జీ ఇస్తారని అన్నారు.

అందరినీ అబ్బాయి.. అబ్బాయి.. అని పిలుస్తుంటారని, రవితేజ వాయిస్ ఉంటే మరింత ఎగ్జైట్మెంట్ వస్తుందని తెలిపారు కళ్యాణ్ శంకర్. ఇంకా బెటర్ గా చేయాలని ఎనర్జీ ఇస్తారని చెప్పారు. ఆయనతో చేసిన మూవీ కచ్చితంగా అందరికీ నచ్చుతుందని, ఎంటర్టైన్ అవుతారని అంచనాలు పెంచారు. ప్రస్తుతం కళ్యాణ్ శంకర్ కామెంట్స్ నెట్టింట వైరల్ గా మారాయి.