Begin typing your search above and press return to search.

మాస్ రాజా కోసం క్లాస్ మాస్ క‌లిపి కొట్టేలా!

అలా ర‌వితేజ క్లాస్ ఆడియ‌న్స్ కి చాలా కాలంగా దూరంగానే ఉన్నాడు.

By:  Tupaki Desk   |   2 March 2025 5:24 AM GMT
మాస్ రాజా కోసం క్లాస్ మాస్ క‌లిపి కొట్టేలా!
X

మాస్ రాజా ర‌వితేజ సినిమాలు ఊరమాస్ గా ఉంటాయి కాబ‌ట్టే ఆయ‌నికి మాస్ రాజా అనేట్యాగ్ ద‌క్కింది. ర‌వితేజ ఎంచుకునే క‌థ‌లు, పాత్ర‌లు, అందులో అత‌గాడి ప్ర‌వేశం ఇలాఅన్ని పిచ్చి మాస్ గా ఉండ‌టంతో? ర‌వితేజ ప్రేక్ష‌కుల్లో మాస్ హీరోగా అవ‌త‌రించాడు. రేర్ గా కొన్ని క్లాస్ చిత్రాలు చేసినా అవి జ‌నాల‌కు ఎక్క‌లేదు. అలా ర‌వితేజ క్లాస్ ఆడియ‌న్స్ కి చాలా కాలంగా దూరంగానే ఉన్నాడు. దీంతో కాస్త పంథా మార్చి క్లాస్ స్టోరీల్లో మాస్ ని జొప్పించి కొన్నిప్ర‌య‌త్నాలు చేసాడు.

అవి బాగానే రాణించాయి. ర‌వితేజ మొత్తం కెరీర్ గ్రాఫ్ ప‌రిశీలిస్తే ఆయ‌న‌తో ప‌నిచేసిన ద‌ర్శ‌కులంతా మాస్ కంటెంట్ తో హైలైట్ అయిన వారే క‌నిపిస్తారు. వాళ్ల‌లో కొంద‌రు స‌క్సెస్ అయి ద‌ర్శ‌కులుగా బిజీగా ఉండ‌గా, కొంత మంది ఒక‌టి రెండు సినిమాల‌తో ఇండ‌స్ట్రీకి దూర‌మ‌య్యారు. అయితే తాజాగా చాలా కాలం త‌ర్వాత ర‌వితేజ మ‌రో క్లాసిక్ డైరెక్ట‌ర్ కిషోర్ తిరుమ‌ల ని తెర‌పైకి తెస్తున్నాడు. కిషోర్ తిరుమ‌ల మూడేళ్ల‌గా సినిమాలు చేయ‌లేదు.

గత సినిమాలు ఆశించిన ఫ‌లితాలు సాధించ‌క‌పోవ‌డంతో దూరంగా ఉండాల్సి వ‌చ్చింది. ఈ నేప‌థ్యంలో కిషోర్ ..ర‌వితేజ‌ని లైన్ లో పెడుతున్నాడు. ఇద్ద‌రి మ‌ధ్య స్టోరీ డిస్క‌ష‌న్స్ జ‌రుగుతున్న‌ట్లు స‌మాచారం. ప్రాజెక్ట్ ఒకే అయితే అధికారిక ప్ర‌క‌ట‌న వ‌చ్చే అవ‌కాశం ఉంది. అయితే కిషోర్ పూర్తిగా ర‌వితేజ ఇమేజ్ కి దూరంగా ఉన్న డైరెక్ట‌ర్. కిషోర్ క్లాసిక్ చిత్రాల ద‌ర్శ‌కుడన్న సంగ‌తి తెలిసిందే. `నేను శైల‌జ‌`, `ఉన్న‌ది ఒక‌టే జింద‌గీ`, `చిత్ర‌ల‌హ‌రి` లాంటి బ్యూటీఫుల్ ల‌వ్ స్టోరీల‌తో త‌న‌కంటూ ప్ర‌త్యేక‌మైన ఇమేజ్ ని క్రియేట్ చేసుకున్నాడు.

మ‌ధ్య‌లో `రెడ్` అనే డిఫ‌రెంట్ యాక్ష‌న్ థ్రిల్లర్ చేసాడు. ఇది పెద్ద‌గా ఆడ‌లేదు కానీ విమ‌ర్శ‌కుల ప్ర‌శంస‌లందుకున్న‌చిత్రంగా మిగిలింది. అటుపై `ఆడాళ్లు మీకు జోహార్లు` అంటూ ఫ్యామిలీ ఆడియ‌న్స్ కి ట‌చ్ లోకి వ‌చ్చాడు. ఇదీ అనుకున్నంత‌గా స‌క్స‌స్ అవ్వ‌లేదు. అటుపై కిషోర్ క‌నిపించ‌లేదు. మ‌ళ్లీ ఇంత కాలానికి అత‌డి పేరు తెర‌పైకి వ‌స్తుంది. మ‌రి మాస్ రాజాతో సినిమా అంటే కేవ‌లం క్లాస్ గా తీస్తే స‌రిపోదు. క్లాస్ మాస్ క‌లిపి కొడితేనే బాక్సాఫీస్ వ‌ద్ద ప‌న‌వుతుంది. ఆ ర‌క‌మైన అటెంప్ట్ కిషోర్ కిదే తొలిసారి అవ్వొచ్చు.