Begin typing your search above and press return to search.

పాన్ ఇండియా ట్రెండ్.. అంత మాట అనేశాడేంటి?

సినీ ఇండస్ట్రీలో కొన్నాళ్లుగా పాన్ ఇండియా ట్రెండ్ నడుస్తున్న విషయం తెలిసిందే

By:  Tupaki Desk   |   10 Jun 2024 10:02 AM GMT
పాన్ ఇండియా ట్రెండ్.. అంత మాట అనేశాడేంటి?
X

సినీ ఇండస్ట్రీలో కొన్నాళ్లుగా పాన్ ఇండియా ట్రెండ్ నడుస్తున్న విషయం తెలిసిందే. దర్శక నిర్మాతలు.. తమ సినిమాలను పాన్ ఇండియా లెవెల్ లో తెరకెక్కిస్తున్నారు. నేషనల్ వైడ్ గా మూవీ లవర్స్ ను దృష్టిలో పెట్టుకుని రూపొందిస్తున్నారు. అలా ఓ రేంజ్ లో ఫ్యాన్ బేస్ సంపాదించుకుంటున్నారు హీరో హీరోయిన్లు. మేకర్స్ కూడా తమ సినిమాలతో బ్లాక్ బస్టర్ హిట్లు సాధించి బాక్సాఫీస్ వద్ద భారీగా లాభాలు అందుకుంటున్నారు.

టాలీవుడ్ లో కూడా ఇప్పుడు అనేక మంది దర్శకులు పాన్ ఇండియా వైపు అడుగులు వేస్తున్నారు. ఇంకొందరు మాత్రం కేవలం తెలుగులో సినిమాలు చేస్తూ మంచి హిట్లు కొడుతున్నారు. అదే కోవకు చెందిన యాక్టర్ కమ్ డైరెక్టర్ రవిబాబు.. ఇప్పుడు పాన్ ఇండియా ట్రెండ్ పై సంచలన వ్యాఖ్యలు చేశారు. పాన్ ఇండియా సినిమాలను ఎందుకు ట్రై చేయడం లేదని ఓ ఇంటర్వ్వూలో జర్నలిస్ట్ అడగ్గా.. రవిబాబు ఆన్సర్ ఇప్పుడు వైరల్ అవుతోంది.

పాన్ ఇండియా కాన్సెప్ట్ ఇప్పుడు దుర్వినియోగం చెందుతుందని ఆరోపించారు రవిబాబు."మాయాబజార్, లవకుశ సినిమాలు దేశవ్యాప్తంగా మంచి హిట్ అయ్యాయి. పాన్ ఇండియా అంటే ఏంటి? కంటెంట్ దేశంలోని ప్రేక్షకులను ఆకట్టుకోవడమే కదా. అందుకే ఓటీటీలో స్ట్రీమ్ అయ్యే ప్రతి సినిమా కూడా పాన్ ఇండియా ప్రాజెక్టే.. పాన్ వరల్డ్ చిత్రమే. ఎందుకంటే ప్రపంచవ్యాప్తంగా ఓటీటీల్లో సినిమాలు చూస్తారు కదా" అని రవిబాబు తెలిపారు.

ఏదేమైనా తన దృష్టిలో పాన్ ఇండియా కాన్సెప్ట్ చాలా దుర్వినియోగమైన కాన్సెప్ట్ గా భావిస్తున్నట్లు తెలిపారు. ఆ విషయం తనకు అర్థం కావడం లేదని చెప్పారు. అయితే రవిబాబు కథ అందిస్తూ నిర్మించిన అప్ కమింగ్ క్రైమ్ థ్రిల్లర్ రష్ మూవీ జూన్ 13వ తేదీన ఈటీవీ విన్ ఓటీటీలో స్ట్రీమింగ్ కానుంది. సతీష్ పోలోజు ఈ సినిమాకు దర్శకత్వం వహించారు. ఇప్పటికే మేకర్స్ రిలీజ్ చేసిన ట్రైలర్ ఆసక్తికరంగా ఉందని నెటిజన్లు రివ్యూలు ఇచ్చారు.

దివంగత నటుడు చలపతిరావు కుమారుడిగా ఇండస్ట్రీలోకి వచ్చిన రవిబాబు తన యాక్టింగ్ తో మంచి మార్కులు కొట్టేశారు. తండ్రిలానే విలన్ పాత్రల్లో మెప్పించే రవిబాబు.. వైవిధ్యభరిత కాన్సెప్టులతో సినిమాలు తీస్తుంటారు. నటుడిగా కూడా చాలా సెలెక్టివ్ గా ఉంటారు. దర్శకుడిగా, నిర్మాతగా, రచయితగా అనేక చిత్రాలు తీసి స్పెషల్ మార్క్ సొంతం చేసుకున్నారు. మరి రష్ మూవీతో రవిబాబు ఎలాంటి హిట్ అందుకుంటారో వేచి చూడాలి.