Begin typing your search above and press return to search.

ఆయన చిన్న హెల్ప్ చేస్తే చాలు.. మూవీ సూపర్ హిట్టే!

టాలీవుడ్ యంగ్ టాలెంటెడ్ డైరెక్టర్ ప్రశాంత్ వర్మ సినిమాటిక్ యూనివర్స్ లోని ఫస్ట్ ఇండియన్ సూపర్ హీరో మూవీ హనుమాన్ ఇటీవలే విడుదలైన విషయం తెలిసిందే.

By:  Tupaki Desk   |   15 Jan 2024 12:30 PM GMT
ఆయన చిన్న హెల్ప్ చేస్తే చాలు.. మూవీ సూపర్ హిట్టే!
X

టాలీవుడ్ యంగ్ టాలెంటెడ్ డైరెక్టర్ ప్రశాంత్ వర్మ సినిమాటిక్ యూనివర్స్ లోని ఫస్ట్ ఇండియన్ సూపర్ హీరో మూవీ హనుమాన్ ఇటీవలే విడుదలైన విషయం తెలిసిందే. సంక్రాంతి కానుకగా రిలీజైన ఈ మూవీతో డైరెక్టర్ ప్రశాంత్ వర్మ, హీరో తేజ తొలిసారి పాన్ ఇండియా మార్కెట్లోకి అడుగుపెట్టి సూపర్ హిట్ కొట్టేశారు. తక్కువ బడ్జెట్ తోనే ప్రశాంత్ వర్మ సృష్టించిన అద్భుతానికి సినీ ప్రియులు బ్రహ్మరథం పడుతున్నారు.


ఇక ఈ మూవీలో కోటి అనే కోతి పాత్రకు టాలీవుడ్ మాస్ మహారాజా రవితేజ వాయిస్ ఓవర్ ఇచ్చారు. ఈ క్యారెక్టర్ ఫన్నీగా ఉండి హీరోకు అండ‌గా నిల‌బ‌డే కీల‌క పాత్ర అని చెప్పొచ్చు. అయితే ర‌వితేజ వాయిస్ ఓవ‌ర్ ఈ సినిమాకు స్పెష‌ల్ అట్రాక్ష‌న్‌ గా నిలిచిందని చెబుతున్నారు సినీ విశ్లేషకులు. పిల్లలు కోటి పాత్రకు ఫిదా అవుతున్నారని అంటున్నారు.

అయితే రవితేజ ఇలా వాయిస్ ఓవర్ ఇవ్వడం కొత్తేం కాదు. గతంలో సునీల్ హీరోగా రాజమౌళి తెరకెక్కించిన మర్యాద రామన్న సినిమాలో సైకిల్ కు వాయిస్ ఓవర్ ఇచ్చారు. ఆ క్యారెక్టర్ ఎప్పటికీ గుర్తుండిపోతుంది. ఆ తర్వాత తమిళ హీరో శివ కార్తికేయన్ నటించిన మహావీరుడు మూవీకి కూడా వాయిస్ ఓవర్ ఇచ్చారు. Awe సినిమాలో ఓ మొక్కకు తన గాత్రాన్ని అందించారు రవితేజ.

ఇప్పటి వరకు రవితేజ వాయిస్ ఓవర్ ఇచ్చిన ఆ సినిమాలన్నీ హిట్ అయ్యాయి. ఇక హనుమాన్ అయితే బ్లాక్ బస్టర్ హిట్ సాధించింది. సంక్రాంతి విజేతగా నిలిచింది. తెలుగు రాష్ట్రాల్లోనే కాకుండా.. నార్త్ తోపాటు ఓవర్సీస్ లోనూ ఈ సినిమా దూసుకుపోతోంది. దీంతో రవితేజ వాయిస్ ఓవర్.. సినిమాలకు ఓ లక్కీ మస్కట్ గా మారిందని అని సినీ వర్గాల్లో టాక్ నడుస్తోంది. మాస్ మహారాజా చిన్న హెల్ప్ చేస్తే చాలు.. సినిమ ా హిట్ అవ్వడం పక్కా అని అంటున్నాారు.

మరోవైపు, రవితేజ లేటెస్ట్ గా నటించిన ఈగల్ మూవీ.. వాస్తవానికి సంక్రాంతికే విడుదల కావాల్సి ఉంది. కానీ చివరి నిమిషాల్లో మూవీ రిలీజ్ ను వాయిదా వేశారు మేకర్స్. వచ్చే నెలలో విడుదల చేయనున్నట్లు ప్రకటించారు. ప్రస్తుతం ఆయన హరీశ్ శంకర్ దర్శకత్వంలో మిస్టర్ బచ్చన్ సినిమా చేస్తున్నారు. బాలీవుడ్ సూపర్ హిట్ మూవీ రైడ్ కు రీమేక్ గా తెరకెక్కుతోంది.