డైరెక్టర్ ఏ.ఎస్. రవికుమార్ చౌదరి ఏరా అన్నది ఆ హీరోనేనా?
రవి కుమార్ చౌదరి తాను హీరోగా పరిచయం చేసిన హీరోగాపై సంచలన వ్యాఖ్యలు చేయడం హాట్ టాపిక్‌గా మారింది.
By: Tupaki Desk | 31 Aug 2023 4:42 PM GMTప్రతి శుక్రవారం జాతకాలు మారిపోయే ఇండస్ట్రీ ఇది. రాత్రికి రాత్రే ఇక్కడ స్టార్లు అయిన వాళ్లు ఉన్నారు. ఓవర్ నైట్‌లోనే స్టార్లుగా మారిన వాళ్లూ ఉన్నారు. ఈగోలు రాజ్యమేలే ఇండస్ట్రీలో ఎన్నోడూ మాట పొదుపుగానే వాడాలి. ఆచితూచి వ్యవహరించాలి. ఒక్కసారి ఈగో హర్ట్ అయిందా? ఎదుటి వారు ఓ రేంజ్‌లో బరస్ట్ అవుతుంటారు. సంచలనం సృష్టిస్తుంటారు. దర్శకుడు ఏ.ఎస్. రవికుమార్ చౌదరి తాజాగా ఓ ఇంటర్వ్యూలో చేసిన వ్యాఖ్యలు ఇప్పుడు ఇండస్ట్రీలో హాట్ టాపిక్‌గా మారాయి.
యజ్ఞం, పిల్లా నువ్వు లేని జీవితం వంటి హిట్ సినిమాలతో దర్శకుడిగా పేరు తెచ్చుకున్న ఆయన బాలయ్యతో చేసిన వీరభద్ర డిజాస్టర్‌గా నిలిచింది. ఆ తరువాత పెద్ద స్టార్లతో సినిమాలు చేయలేకపోయిన ఏ.ఎస్. రవికుమార్ చౌదరి మళ్లీ ఇన్నాళ్లకు రాజ్ తరణ్ హీరోగా 'తిరగబడరాసామీ' సినిమాని రూపొందించారు. త్వరలో ప్రేక్షకుల ముందుకు రాబోతోంది. ఈ నేపథ్యంలో టీజర్ రిలీజ్ సందర్భంగా హీరోయిన్ మన్నారా చోప్రాని మీడియా ముందే కిస్ చేసి వైరల్‌గా మారిన రవికుమార్ చౌదరి తాజాగా ఓ యూట్యూబ్ ఛానల్‌కు ఇచ్చిన ఇంటర్వ్యూలో తాను హీరోగా పరిచయం చేసిన స్టార్‌పై సంచలన వ్యాఖ్యలు చేశారు
సదరు యూట్యూబ్ ఛానల్‌లో సీనియర్ జర్నలిస్ట్ అడిగిన ప్రశ్నకు సమాధానంగా రవి కుమార్ చౌదరి తాను హీరోగా పరిచయం చేసిన హీరోగాపై సంచలన వ్యాఖ్యలు చేయడం హాట్ టాపిక్‌గా మారింది. 'నిన్ను హీరోని చేసింది నేను. అలాంటిది నిన్ను కలవడానికి ఐదుగురిని దాటుకుని రావాలా? ..రవికుమార్ చౌదరి వచ్చాడంటే ..అహా కాసేపు వేయిట్ చేయమని చెప్పు అంటావా? ..అంత బలిసి పోయిందారా మీకు? ..చెట్టుకింద కూర్చుని కలిసి భోజనం చేశాం. నువ్వు నా బర్త్‌డేకొచ్చావ్.. నా పెళ్లికొచ్చావ్..నేను దగ్గినా..తుమ్మినా వచ్చావ్..అలాంటిది నేను నీదగ్గరికి రావాలంటే ఐదారుగురిని దాటి రావాలా?
అందుకే వరుస ఫ్లాపులొస్తున్నాయి. చూస్తున్నారు కదా? అంటూ ఫైర్ అయ్యారు. విలన్‌గా నటిస్తున్న సమయంలో వాడిని నేనే హీరోగా పరిచయం చేశాను. నెక్స్ట్ సినిమాకు నా రెమ్యునరేషన్ కంటే తక్కువ అతనికి. అలాంటిది ఆ బలుపులు ఎందుకొస్తాయో అర్థం కాదు. నాకు ఎదురుపడితే నేను ఇలాగే మాట్లాడతాను. నేను నచ్చితే నాతో ఉంటారు.. లేదంటే..ఎందుకూ పనికి రాకుండా పోతారు. ఆల్ రెడీ ఎందుకూ పనికి రాకుండా పోతున్నారులే. ముఖం మీద మేకప్ వేసుకున్నాక మేకలాంటి చేష్టలు అందరికి ఉంటాయి. ఎవరో ఒకరిద్దరికి తప్ప.
పవన్ కల్యాణ్, చిరు, బన్నీ, బాలయ్య తప్ప..మిగతా వాళ్లు హీరోలేంటండీ..' అంటూ టాలీవుడ్ హీరోలపై విరుచుకుపడ్డారు. అంతే కాకుండా నేను ఇలా మాట్లాడుతున్నానని నాకు అవకాశాలు రాకపోతే నేనే హీరోగా చేస్తా' అంటూ షాక్ ఇచ్చారు దర్శకుడు రవికుమార్ చౌదరి. ఆయన తాను పరిచయం చేసిన హీరోతో పాటు ఇండస్ట్రీలో ఉన్న మిగతా హీరోలపై చేసిన వ్యాఖ్యలు ఇండస్ట్రీలో సంచలనంగా మారాయి.