Begin typing your search above and press return to search.

మాస్ రాజ్ ఫుల్ మీల్స్ కిక్!

సినిమా నుంచి "మాస్ రాంపేజ్ గ్లింప్స్"ను జనవరి 26న విడుదల చేయనున్నట్టు చిత్ర యూనిట్ ప్రకటించింది. ఈ స్పెషల్ గ్లింప్స్‌తో రవితేజ బర్త్‌డే వేడుకలను గ్రాండ్‌గా ప్రారంభించనున్నారు.

By:  Tupaki Desk   |   24 Jan 2025 7:02 AM GMT
మాస్ రాజ్ ఫుల్ మీల్స్ కిక్!
X

ఎలాంటి సినిమా చేసినా ఫ్యాన్స్ కి కిక్కిచ్చే అంశాలు సమపాళ్లలో ఉండేలా చూసుకునే హీరోలలో రవితేజ ఒకరు. నెక్స్ట్ ఈ స్టార్ హీరో నుంచి రానున్న క్రేజీ ప్రాజెక్ట్ మాస్ జాతర. మనదే ఇదంతా.. అనే ట్యాగ్ లైన్ ఇడియట్ చంటిగాడిని గుర్తు చేస్తోంది. భాను భోగవరపు దర్శకత్వం వహిస్తున్న ఈ సినిమా పూర్తిగా మాస్ అండ్ ఫ్యామిలీ ఎంటర్‌టైనర్‌గా రూపొందుతోంది. ఇక సితార ఎంటర్‌టైన్‌మెంట్స్, ఫార్చూన్ ఫోర్ బ్యానర్స్‌ సంయుక్తంగా నిర్మిస్తున్నారు.

ఇక రవితేజ నటనలో ఉండే ఎనర్జీ, టైమింగ్ గురించి ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు. "మాస్ జాతర" చిత్రంలోని పాటలు, పోరాట సన్నివేశాలు ప్రేక్షకులకు థియేటర్లలో అసలైన పండగను అందించబోతున్నాయి. ఇక ఫ్యాన్స్ ఎప్పుడెప్పుడా అని ఎదురుచూస్తున్న "మాస్ జాతర" నుంచి తాజాగా బిగ్ అప్‌డేట్ వచ్చింది. రవన్న మాస్ దావత్ షురూ రా భయ్ అంటూ ఒక క్రేజీ పోస్టర్ కూడా విడుదల చేశారు.

సినిమా నుంచి "మాస్ రాంపేజ్ గ్లింప్స్"ను జనవరి 26న విడుదల చేయనున్నట్టు చిత్ర యూనిట్ ప్రకటించింది. ఈ స్పెషల్ గ్లింప్స్‌తో రవితేజ బర్త్‌డే వేడుకలను గ్రాండ్‌గా ప్రారంభించనున్నారు. ఫస్ట్ లుక్ తో ఇదివరకే మంచి హైప్ ఇచ్చిన మేకర్స్ ఇప్పుడు మరో మాస్ కిక్ ఇచ్చారని చెప్పవచ్చు. లేటెస్ట్ పోస్టర్ సోషల్ మీడియాలో ఓ రేంజ్‌లో ట్రెండ్ అవుతోంది. రవితేజ భోజనానికి ముందు కూర్చున్న విధానం డిఫరెంట్ గా ఉంది.

రౌడీలను చితకబాదిన అనంతరం మాస్ బిహేవియర్ తో భోజనం ముందు కూర్చున్నట్లు తెలుస్తోంది. మీసం మెలేస్తూ కోరగా చూస్తున్న అతని చూపు ఫుల్ మీల్స్ లా ఉందని ఫ్యాన్స్ కామెంట్స్ చేస్తున్నారు. రవితేజ తన ప్రత్యేకమైన హావభావాలతో కనిపించడం ఫ్యాన్స్‌కు పండుగలా అనిపిస్తోంది. ఇది కేవలం రవితేజ ఫ్యాన్స్‌నే కాదు, మాస్ ప్రేక్షకులందరికీ ఉత్సాహం కలిగిస్తోంది.

ఈ పోస్టర్ సినిమాపై కొంత హింట్ ఇస్తోంది. "మాస్ జాతర"లో రవితేజ పాత్ర ఓ షెఫ్‌గా ఉండే అవకాశాలు కనిపిస్తున్నాయి. ఇక అసలు విషయం గ్లింప్స్ విడుదల తర్వాత తెలుస్తుంది. గ్లింప్స్‌లో ఈ మిస్టరీకు కొంత క్లారిటీ వచ్చే అవకాశం ఉంది. సినిమాకు భీమ్స్ సిసిరోలియో సంగీతం అందిస్తున్నారు. ధమాకా అనంతరం వీరి కాంబినేషన్లో వస్తున్న మరో సినిమా కావడంతో మ్యూజిక్ పై మంచి అంచనాలు ఉన్నాయి. నవీన్ నూలి ఎడిటింగ్, విధు అయ్యన్న సినిమాటోగ్రఫీతో సినిమా విజువల్స్ మునుపటి కంటే గొప్పగా ఉంటాయని తెలుస్తోంది. ఈ చిత్రంలో శ్రీలీల మరోసారి రవితేజకు జోడీగా అలరించబోతోంది.

రవితేజ రాంపేజ్ మాస్ మహారాజా బర్త్‌డే సందర్భంగా ఈ గ్లింప్స్ మరింత హైప్ తీసుకురానుంది. జనవరి 26న రిలీజ్ కాబోతున్న ఈ స్పెషల్ గ్లింప్స్ ఫ్యాన్స్‌కు కిక్ ఇచ్చి, సినిమాపై మరింత క్రేజ్ పెంచనుంది. ఇక మే 9న విడుదల కానున్న "మాస్ జాతర" మాస్ ప్రేక్షకులకు పండుగలా అనిపించబోతుందని యూనిట్ గట్టి నమ్మకం వ్యక్తం చేస్తోంది.