Begin typing your search above and press return to search.

మరో ఫ్లాప్‌ బొమ్మకి రీ రిలీజ్‌లో బ్లాక్‌ బస్టర్‌..!

ఈమధ్య కాలంలో రీ రిలీజ్ అనే పదం ఎక్కువగా వింటూ ఉన్నాం. కేవలం టాలీవుడ్‌లోనే కాకుండా బాలీవుడ్‌.. హాలీవుడ్‌లోనూ సూపర్‌ హిట్‌ సినిమాలను రీ రిలీజ్‌ చేస్తున్నారు.

By:  Tupaki Desk   |   27 Jan 2025 8:08 AM GMT
మరో ఫ్లాప్‌ బొమ్మకి రీ రిలీజ్‌లో బ్లాక్‌ బస్టర్‌..!
X

ఈమధ్య కాలంలో రీ రిలీజ్ అనే పదం ఎక్కువగా వింటూ ఉన్నాం. కేవలం టాలీవుడ్‌లోనే కాకుండా బాలీవుడ్‌.. హాలీవుడ్‌లోనూ సూపర్‌ హిట్‌ సినిమాలను రీ రిలీజ్‌ చేస్తున్నారు. టాలీవుడ్‌లో ఇతర ఇండస్ట్రీల కంటే ఎక్కువ రీ రిలీజ్‌లు చూస్తూ ఉన్నాం. గత ఏడాదిలో రికార్డ్‌ స్థాయిలో సినిమాలు రీ రిలీజ్ అయ్యాయి. హీరోల పుట్టిన రోజులకు, సినిమాల ప్రత్యేక రోజులకు, ఇతర సందర్భాల్లోనూ సినిమాలను రీ రిలీజ్ చేయడం కామన్‌ విషయంగా మారింది. మహేష్ బాబు సినిమాలు చాలానే ఇప్పటి వరకు రీ రిలీజ్ అయ్యాయి. నిన్న రవితేజ పుట్టిన రోజు సందర్భంగా ఆయన నటించిన 'నేనింతే' సినిమాను లిమిటెడ్‌ స్క్రీన్స్‌లో రీ రిలీజ్ చేయడం జరిగింది.

డాషింగ్‌ డైరెక్టర్‌ పూరి జగన్నాధ్‌ దర్శకత్వంలో రవితేజ హీరోగా సియా హీరోయిన్‌గా రూపొందిన 'నేనింతే' సినిమాను సినిమా ఇండస్ట్రీలో ఉండే కష్టాల నేపథ్యంలో రూపొందించారు. సినిమా ఇండస్ట్రీలో కొత్తగా వచ్చే వారు ఎంతగా ఇబ్బంది పడుతారు, సినిమా ఇండస్ట్రీలో ఎలాంటి పరిస్థితులు ఉంటాయి, నిర్మాతలు ఎలా ఇబ్బందులు పడుతారు, స్టార్‌ హీరోల అతి ఏ స్థాయిలో ఉంటుంది, ప్రముఖ దర్శకుల గురించి, వారి వద్ద ఉండే అసిస్టెంట్స్ గురించి రకరకాల విషయాల గురించి దర్శకుడు పూరి జగన్నాద్‌ చాలా చక్కగా చూపించారు. అయితే సినిమాకి ప్రేక్షకుల నుంచి ఆశించిన స్థాయిలో స్పందన రాలేదు. సినిమా కమర్షియల్‌గా నిరాశ పరచింది.

నేనింతే సినిమా ఫ్లాప్‌ అయినా ఇండస్ట్రీలో ఉన్న వారికి, రవితేజ అభిమానులకు ఎప్పుడూ చాలా స్పెషల్‌గానే ఉంటుంది అనడంలో సందేహం లేదు. అందుకే నిన్న రవితేజ పుట్టిన రోజు సందర్భంగా రీ రిలీజ్ చేశారు. రీ రిలీజ్‌ను అభిమానులతో పాటు రెగ్యులర్‌ ఫ్యాన్స్ చాలా ఎంజాయ్‌ చేశారు. ముఖ్యంగా కృష్ణనగరే మామ.. పాటకి ప్రేక్షకుల నుంచి మంచి స్పందన దక్కింది. 2008లో వచ్చిన నేనింతే సినిమా బాక్సాఫీస్‌ వద్ద ఫ్లాప్‌గా నిలిచినా రీ రిలీజ్‌లో మాత్రం బ్లాక్ బస్టర్‌ సినిమా స్థాయి రెస్పాన్స్‌ దక్కించుకుంది. ఆ మధ్య రామ్‌ చరణ్ హీరోగా వచ్చిన బొమ్మరిల్లు సినిమాకు సైతం ఇదే తరహా ఫలితం వచ్చిన విషయం తెల్సిందే.

విడుదల అయిన సమయంలో ఉన్న పరిస్థితులు, ఇతర కారణాల వల్ల నిరాశ పరిచిన సినిమాలు రీ రిలీజ్ అయ్యి మంచి విజయాన్ని సొంతం చేసుకుంటున్నాయి. అందుకే చాలా మంది హీరోల ఫ్లాప్ సినిమాలు మళ్లీ విడుదలకు సిద్ధం అవుతున్నాయి. కొన్ని సినిమాలు బాగున్నా ఏవో కారణాల వల్ల ఫ్లాప్ అవుతాయి. ఆ తర్వాత కాలంలో వాటికి టీవీల్లో ఓటీటీల్లో మంచి స్పందన వచ్చింది. వాటన్నింటిని ఇప్పుడు రీ రిలీజ్ చేసే అవకాశాలు కనిపిస్తున్నాయి. మొత్తానికి ఫ్లాప్‌ సినిమాలకు రీ రిలీజ్‌లో హిట్ పడితే కచ్చితంగా ఆ హీరోలకు సంతృప్తి దక్కుతుంది. నేనింతే సినిమా రీ రిలీజ్‌కి మంచి స్పందన వచ్చిన నేపథ్యంలో రవితేజ నటించిన నా ఆటోగ్రాఫ్‌ స్వీట్‌ మెమోరీస్‌ ను రీ రిలీజ్ చేయాలనే డిమాండ్ మొదలైంది.