Begin typing your search above and press return to search.

మాస్ రాజా అందుకుంటాడా లేదా!

2021 లో క్రాక్ తో మాస్ హిట్ అందుకున్న మాస్ రాజా ఆ తర్వాత ఖిలాడి, రామారావు ఆన్ డ్యూటీ రెండు సినిమాలతో డిజాస్టర్ అందుకున్నాడు.

By:  Tupaki Desk   |   31 Dec 2024 4:06 AM GMT
మాస్ రాజా అందుకుంటాడా లేదా!
X

మాస్ మహారాజ్ రవితేజ ఒక హిట్టు కొట్టాడు అంటే ఆ క్రేజ్ సూపర్ గా ఉంటుంది. కానీ ఆ హిట్ తర్వాత మరో హిట్టుకి చాలా టైం పడుతుంది. 2021 లో క్రాక్ తో మాస్ హిట్ అందుకున్న మాస్ రాజా ఆ తర్వాత ఖిలాడి, రామారావు ఆన్ డ్యూటీ రెండు సినిమాలతో డిజాస్టర్ అందుకున్నాడు. ఆ తర్వాత ధమాకా సినిమాతో సూపర్ హిట్ కొట్టాడు. ఆ వెంటనే మెగాస్టార్ చిరంజీవితో కలిసి వాల్తేరు వీరయ్యతో కూడా సూపర్ సక్సెస్ అందుకున్నాడు. 2023 సంక్రాంతికి వచ్చిన వాల్తేరు సూపర్ హిట్ కాగా ఆ తర్వాత రవితేజ వరుస సినిమాలు చేసిన వర్క్ అవుట్ కాలేదు.

2023 లోనే రావణాసుర, టైగర్ నాగేశ్వర రావు సినిమాలు చేసిన రవితేజ భారీ అంచనాలతో ఆ సినిమాలు వచ్చినా రెండు ఫ్లాప్ అయ్యాయి. ఇక ఈ ఇయర్ ఈగల్, మిస్టర్ బచ్చన్ రెండు సినిమాలతో ప్రేక్షకుల ముందుకు వచ్చాడు. ఈ రెండు సినిమాలు కూడా రవితేజని నిరాశపరిచాయి. ధమాకా తో సోలో హిట్ కొట్టాక చెప్పాలంటే నాలుగు వరుస సినిమాలు ఫ్లాప్ అయ్యాయి. ఇది రవితేజ మార్కెట్ మీద ఎంతోకొంత ఎఫెక్ట్ పడేలా చేస్తుందని చెప్పొచ్చు.

రవితేజ ప్రస్తుతం ఒక అర్జెంట్ హిట్టు కొట్టాల్సిన పరిస్థితి వచ్చింది. మాస్ రాజా ప్రస్తుతం మాస్ జాతర అంటూ ఒక సినిమా చేస్తున్నాడు. దానితో పాటుగా కోహినూర్ అనే మరో సినిమా వస్తుంది. ఈ రెండు సినిమాలతో అయినా రవితేజ మార్క్ మాస్ హిట్ అందుకుంటాడా లేదా అన్నది చూడాలి. రవితేజ మాత్రం హిట్లు ఫ్లాపులు అనే లెక్కలేమి లేకుండా వరుస సినిమాలు చేసుకుంటూ వెళ్తున్నాడు.

ఐతే తన మాస్ స్టామినా తెలిసినా కొద్దిగా కథల విషయంలో జాగ్రత్త పడాల్సిన అవసరం అయితే ఉంది. ఐతే కొన్నిసార్లు కథ బాగున్నా కరెక్ట్ గా డీల్ చేయలేక ఫ్లాప్ అవుతున్న సినిమాలు ఉన్నాయి. ఏది ఏమైనా రవితేజ హిట్టు కోసం అతని కన్నా మాస్ రాజా ఫ్యాన్స్ ఈగర్ గా ఎదురుచూస్తున్నారు. మరి ఆ హిట్ రాబోతున్న రెండు సినిమాలతో అందుకుంటాడా లేదా అన్నది చూడాలి. వరుస ఫ్లాపులు రవితేజని కూడా ఆలోచనలో పడేసినట్టు తెలుస్తుంది. ఐతే ఈసారి మాత్రం హిట్ టార్గెట్ తో వస్తున్న మాస్ మహారాజ్ ష్యూర్ షాట్ హిట్ కొడుతున్నాం అంతే అన్నట్టుగా ఫుల్ జోష్ మీద ఉన్నాడు.