Begin typing your search above and press return to search.

రవితేజ- శ్రీలీల.. ఈసారి కాస్త కొత్తగా..

టాలీవుడ్ మాస్ మహారాజా రవితేజ.. ఈ ఏడాదిలో ఇప్పటికే ఈగల్ సినిమాతో ప్రేక్షకుల ముందుకు వచ్చిన విషయం తెలిసిందే

By:  Tupaki Desk   |   18 Jun 2024 12:30 AM GMT
రవితేజ- శ్రీలీల.. ఈసారి కాస్త కొత్తగా..
X

టాలీవుడ్ మాస్ మహారాజా రవితేజ.. ఈ ఏడాదిలో ఇప్పటికే ఈగల్ సినిమాతో ప్రేక్షకుల ముందుకు వచ్చిన విషయం తెలిసిందే. యాక్షన్ థ్రిల్లర్ గా కార్తీక్ ఘట్టమనేని తెరకెక్కించిన ఈ మూవీ.. మోస్తరు వసూళ్లను రాబట్టింది. కానీ సినిమాలో రవితేజ గెటప్ తో పాటు యాక్షన్ సీక్వెన్స్స్, ఆయన యాక్టింగ్ హైలైట్ గా నిలిచాయి. ఆ తర్వాత రెండు ఓటీటీ ప్లాట్‍ఫామ్స్ ల్లో మూవీ స్ట్రీమింగ్ అవ్వడం విశేషం

ప్రస్తుతం రవితేజ.. ప్రముఖ దర్శకుడు హరీష్ శంకర్ డైరెక్షన్ లో మిస్టర్ బచ్చన్ మూవీ చేస్తున్న సంగతి కూడా తెలిసిందే. కొన్ని రోజులుగా శరవేగంగా షూటింగ్ జరుపుకుంటున్న ఈ మూవీని పీపుల్ మీడియా ఫ్యాక్టరీ బ్యానర్ పై టీజీ విశ్వప్రసాద్ గ్రాండ్ గా నిర్మిస్తున్నారు. బాలీవుడ్ సూపర్ హిట్ మూవీ రైడ్ కు రీమేక్ గా తెరకెక్కుతున్న ఈ చిత్రంలో రవితేజ అమితాబ్ ఫ్యాన్ గా కనిపించనున్నారు. త్వరలో రిలీజ్ డేట్ ను అనౌన్స్ చేయనున్నారు.

అయితే రీసెంట్ గా రవితేజ.. తన ల్యాండ్ మార్క్ 75వ మూవీని ప్రకటించారు. గత ఏడాది వచ్చి సూపర్ హిట్ అయిన సామజవరగమన మూవీ రచయిత భాను భోగవరపు ఈ సినిమాను తెరకెక్కించనున్నారు. ఇటీవల పూజ కార్యక్రమాలు కూడా జరిగాయి. యంగ్ బ్యూటీ శ్రీలీలను హీరోయిన్ గా ఫిక్స్ చేశారు మేకర్స్. పూజ కార్యక్రమాల రోజు ఆరంజ్ కలర్ శారీ లో మెరిసిపోయింది అమ్మడు.

ఇప్పుడు ఈ మూవీ పీరియాడిక్ జోనర్ లో రూపొందనుందని జోరుగా ప్రచారం సాగుతోంది. అరకు అటవీ బ్యాక్ డ్రాప్ లో సినిమా తెరకెక్కుతుందని సమాచారం. ప్రస్తుతం ప్రీ ప్రొడక్షన్ దశలో ఉన్న ఈ సినిమాను త్వరలోనే సెట్స్ పైకి తీసుకెళ్లనున్నట్లు తెలుస్తోంది. ఇప్పటికే పీరియాడిక్ జోనర్ లో పలు సినిమాలు చేసిన రవితేజ.. మరో మూవీ చేస్తారని వార్తలు రావడంతో ఆసక్తి నెలకొంది.

మరోవైపు, రవితేజ, శ్రీలీల కలిసి ధమాకా మూవీలో నటించి అదరగొట్టారు. హిట్ పెయిర్ గా పేరు సంపాదించుకున్నారు. ఇప్పుడు మళ్లీ కలిసి నటిస్తుండడంతో అంచనాలు క్రియేట్ అవుతున్నాయి. సితార ఎంటర్టైన్మెంట్స్ బ్యానర్ పై యంగ్ డైరెక్టర్ నాగ వంశీ ఈ మూవీని నిర్మిస్తున్నారు. వచ్చే ఏడాది సంక్రాంతికి ఈ చిత్రం రిలీజ్ అయ్యేందుకు సిద్ధమవుతోంది. త్వరలోనే మరిన్ని వివరాలు ప్రకటించనున్నారు మేకర్స్.