Begin typing your search above and press return to search.

మాస్‌రాజా 75 మరీ ఇంత స్పీడా..?

ఇప్పటికే రవితేజ 75వ సినిమా సామజవరగమన చిత్ర రచయిత అయిన భాను తో చేయబోతున్నట్లుగా అధికారిక ప్రకటన వచ్చింది.

By:  Tupaki Desk   |   10 Jun 2024 5:13 AM GMT
మాస్‌రాజా 75 మరీ ఇంత స్పీడా..?
X

మాస్ మహారాజా రవితేజ మునుపటి ఉత్సాహం ను చూపిస్తున్నాడు. సినిమాల ఎంపిక విషయంలో జోరు కనబర్చుతున్నాడు. హీరోగా కెరీర్‌ ఆరంభంలో ఏడాదికి మూడు నాలుగు సినిమాలు చేసిన రవితేజ ఆ మధ్య చాలా స్లో అయ్యాడు. మళ్లీ ఇప్పుడు స్పీడ్ పెంచాడు. ఒక వైపు మిస్టర్ బచ్చన్‌ లైన్ లో ఉండగానే మరో రెండు సినిమాలకు లైన్ క్లియర్ చేశాడు.

హరీష్ శంకర్‌ దర్శకత్వంలో రూపొందుతున్న మిస్టర్ బచ్చన్ సినిమా షూటింగ్‌ ముగింపు దశకు చేరుకున్న నేపథ్యంలో తన మైల్‌ స్టోన్ మూవీ అయిన 75వ సినిమాను మొదలు పెట్టేందుకు సిద్ధం అయ్యాడు. ఇప్పటికే రవితేజ 75వ సినిమా సామజవరగమన చిత్ర రచయిత అయిన భాను తో చేయబోతున్నట్లుగా అధికారిక ప్రకటన వచ్చింది.

ఫుల్‌ లెంగ్త్‌ కామెడీ ఎంటర్‌టైనర్ గా ఈ సినిమా ఉంటుందని సమాచారం అందుతోంది. స్క్రిప్ట్‌ వర్క్ పూర్తి చేసి ప్రస్తుతం ప్రీ ప్రొడక్షన్ వర్క్ లో ఉన్న దర్శకుడు భాను వచ్చే వారంలో హైదరాబాద్‌ లో ప్రత్యేకంగా వేసిన సెట్స్ లో ఈ సినిమాను ప్రారంభించేందుకు ఏర్పాట్లు చేస్తున్నాడు.

రవితేజ ఇప్పటికే డేట్లు ఇవ్వడంతో అందుకు అనుగుణంగా షూటింగ్‌ ను ప్లాన్‌ చేశారట. సితార ఎంటర్‌టైన్మెంట్స్ బ్యానర్‌ లో ఈ సినిమా రూపొందుతుంది. శ్రీకర స్టూడియోస్ మరియు ఫార్చూన్ ఫోర్ బ్యానర్స్ ఈ సినిమా నిర్మాణం లో భాగస్వామ్యులుగా ఉండబోతున్నారు.

ఈ మధ్య కాలంలో ఫ్యాన్స్ మిస్ అవుతున్న రవితేజ మార్క్‌ ఎంటర్‌టైన్‌మెంట్‌ ను భాను అందించబోతున్నాడు అంటూ మేకర్స్ బలంగా చెబుతున్నారు. అన్ని వర్గాల ప్రేక్షకులకు వినోదాన్ని అందించే విధంగా ఈ సినిమా ఉంటుందని, 2025 సంక్రాంతికి సినిమాను తీసుకు రాబోతున్నట్లు సమాచారం అందుతోంది.

ఇటీవలే ప్రకటించారు, వచ్చే వారం నుంచి షూటింగ్‌ అంటున్నారు, వచ్చే సంక్రాంతికి రిలీజ్ అంటున్నారు. ఇవన్నీ చూస్తూ ఉంటే చాలా ఆశ్చర్యంగా ఉందని, మరీ ఇంత స్పీడా అంటూ ఫ్యాన్స్‌ నోరు వెళ్లబెతున్నారు. ఈ సినిమాలో రవితేజకు జోడీగా ధమాకా తర్వాత మరోసారి శ్రీలీల హీరోయిన్‌ గా నటించనుండటం విశేషం.