Begin typing your search above and press return to search.

రవితేజ రెమ్యునరేషన్ రూ.10 మాత్రమే..

టాలీవుడ్ లో ప్రతి ఏడాది ప్రేక్షకులని తన సినిమాలతో పలకరిస్తున్న ఏకైక హీరో రవితేజ కావడం విశేషం. హిట్, ఫ్లాప్ లతో సంబంధం లేకుండా స్టార్ యాక్టర్ గా తన ప్రస్థానాన్ని మాస్ మహారాజ్ కొనసాగిస్తున్నారు.

By:  Tupaki Desk   |   28 Dec 2023 3:42 AM GMT
రవితేజ రెమ్యునరేషన్ రూ.10 మాత్రమే..
X

మాస్ మహారాజ్ గా ప్రస్తుతం టాలీవుడ్ లో అందరి ప్రశంసలు సొంతం చేసుకుంటూ ఏడాదికి రెండు నుంచి మూడు సినిమాలు చేస్తూ దూసుకుపోతోన్న స్టార్ ఎవరంటే రవితేజ అని వెంటనే చెప్పేస్తారు. టాలీవుడ్ లో ప్రతి ఏడాది ప్రేక్షకులని తన సినిమాలతో పలకరిస్తున్న ఏకైక హీరో రవితేజ కావడం విశేషం. హిట్, ఫ్లాప్ లతో సంబంధం లేకుండా స్టార్ యాక్టర్ గా తన ప్రస్థానాన్ని మాస్ మహారాజ్ కొనసాగిస్తున్నారు.

అయితే ఈ ఇమేజ్ రవితేజకి రాత్రికి రాత్రే రాలేదని అందరికి తెలుసు. యాక్టర్ కావాలని ఇండస్ట్రీలోకి అడుగుపెట్టిన రవితేజ ఆరంభంలో అసిస్టెంట్ డైరెక్టర్ గా వర్క్ చేస్తూ చిన్న చిన్న పాత్రలు చేసేవాడు. హీరో ఫ్రెండ్ రోల్స్ లో కనిపిస్తూ తరువాత నెగిటివ్ షేడ్స్ పాత్రలతో క్యారెక్టర్ ఆర్టిస్ట్ గా ఎదిగాడు. అయితే రవితేజలో హీరో మెటీరియల్ ఉందని ముందుగా గుర్తించింది మాత్రం కృష్ణవంశీ.

అతను తెరకెక్కించిన సిందూరం సినిమాలో సెకండ్ హీరో క్యారెక్టర్ ని ఇచ్చారు. ఆ సినిమా సూపర్ హిట్ అయ్యింది. నటుడిగా రవితేజకి కూడా మంచి పేరొచ్చింది. ఆ తరువాత శ్రీనువైట్ల డెబ్యూ మూవీ నీ కోసంతో సోలో హీరోగా సక్సెస్ అందుకున్నాడు. ఆ సినిమా తర్వాత కూడా మరల హీరోగా నెక్స్ట్ మూవీ రావడానికి రెండేళ్ళు పట్టింది.

పూరి జగన్నాథ్ ఇట్లు శ్రావణి సుబ్రహ్మణ్యం సినిమాతో రవితేజ బ్లాక్ బస్టర్ హిట్ అందుకున్నాడు. తరువాత పూరి దర్శకత్వంలో వరుసగా మరో రెండు హిట్స్ సొంతం చేసుకొని కమర్షియల్ హీరోగా మారిపోయాడు. అక్కడి నుంచి ప్రస్తుతం ఈగల్ వరకు రవితేజ వెనక్కి తిరిగి చూసుకునే ఛాన్స్ రాలేదు.

అతను నటుడిగా అల్లరి ప్రియుడు సినిమాలో చేశాడు. ఆ సినిమా కోసం రోజుకి పది రూపాయిలు రెమ్యునరేషన్ గా తీసుకున్నాడు. అదే రవితేజ ఇప్పుడు సినిమాకి 30 కోట్లు అందుకునే స్థాయికి చేరుకున్నాడు. ఎలాంటి బ్యాగ్రౌండ్ లేకుండా ఇండస్ట్రీలోకి వచ్చిన ఈ స్థాయి సక్సెస్ అందుకోవడం నిజంగా గొప్ప విషయం. అందరుకే ఇండస్ట్రీలో చిరంజీవి తర్వాత రవితేజ ఎంతో మందికి ఆదర్శంగా నిలిచాడు.