Begin typing your search above and press return to search.

దేవరకొండ - మాస్ రాజా.. ట్రాక్ తప్పుతోందా?

టాలీవుడ్ లో చాలా మంది స్టార్ హీరోలు ఏదో ఒక బ్యాగ్రౌండ్ తో ఇండస్ట్రీలోకి అడుగుపెట్టి పెద్ద స్థాయికి ఎదిగారు.

By:  Tupaki Desk   |   24 Aug 2024 4:34 AM GMT
దేవరకొండ - మాస్ రాజా.. ట్రాక్ తప్పుతోందా?
X

టాలీవుడ్ లో చాలా మంది స్టార్ హీరోలు ఏదో ఒక బ్యాగ్రౌండ్ తో ఇండస్ట్రీలోకి అడుగుపెట్టి పెద్ద స్థాయికి ఎదిగారు. అయితే కొంత మంది మాత్రం తమ సొంత టాలెంట్, ఇమేజ్ తో స్టార్ హీరోలుగా గుర్తింపు తెచ్చుకున్నారు. అలాంటి వారిలో మెగాస్టార్ చిరంజీవి తర్వాత ఈ జెనరేషన్ లో చూసుకుంటే నాచురల్ స్టార్ నాని, మాస్ మహారాజ్ రవితేజ, రౌడీ స్టార్ విజయ్ దేవరకొండ కనిపిస్తారు.

అయితే నాచురల్ స్టార్ నాని సెలక్టివ్ గా మంచి కథాబలం ఉన్న సినిమాలు చేస్తూ వరుస సక్సెస్ లతో తన మార్కెట్ పెంచుకున్నాడు. ప్రస్తుతం టైర్ 2 హీరోలలో అత్యధిక మార్కెట్ ఉన్న నటుడిగా నాని ఉన్నాడు. అలాగే రౌడీ స్టార్ విజయ్ దేవరకొండ క్యారెక్టర్ ఆర్టిస్ట్ గా కెరియర్ స్టార్ట్ చేశాడు. పెళ్లి చూపులు, అర్జున్ రెడ్డి, గీతాగోవిందం సినిమాల సక్సెస్ తో ఒక్కసారిగా స్టార్ హీరోగా బ్రాండ్ క్రియేట్ చేసుకున్నాడు. ఆ తరువాత టాక్సీవాలాతో మరో సక్సెస్ అందుకున్నాడు.

అక్కడి నుంచి విజయ్ దేవరకొండ కెరియర్ లో సినిమాల ఫెయిల్యూర్ పరంపర స్టార్ట్ అయ్యింది. మధ్యలో ఖుషి ఏవరేజ్ టాక్ తెచ్చుకుంది. ది ఫ్యామిలీ స్టార్ కూడా డిజాస్టర్ అయ్యింది. విజయ్ కి ఇప్పుడు కచ్చితంగా ఒక కమర్షియల్ సక్సెస్ పడాల్సిందే అనే మాట ఇండస్ట్రీలో వినిపిస్తోంది. నిజానికి అతనికి ఏకంగా 50 కోట్ల మార్కెట్ ఉంది. కానీ వరుస ఫెయిల్యూర్స్ కారంగా మార్కెట్, బ్రాండ్ ఇమేజ్ తగ్గుతూ వస్తోంది. కచ్చితంగా రాబోయే VD12తో విజయ్ దేవరకొండ బ్లాక్ బస్టర్ కొట్టాల్సిందే అనే మాట వినిపిస్తోంది. నెక్స్ట్ విజయ్ గౌతమ్ తిన్ననూరితో అలాగే రాహుల్ సంకృత్యాన్ లతో సినిమాలు చేస్తున్నాడు.

అలాగే సుదీర్ఘ కాలం ఇండస్ట్రీలో అసిస్టెంట్ డైరెక్టర్ గా, క్యారెక్టర్ ఆర్టిస్ట్ గా ఉంటూ తరువాత హీరోగా మారిన నటుడు రవితేజ. పూరి జగన్నాథ్ దర్శకత్వంలో వచ్చిన ఇట్లు శ్రావణి సుబ్రహ్మణ్యం, ఇడియట్, అమ్మా నాన్న ఓ తమిళమ్మాయి సినిమాలు రవితేజని స్టార్ గా నిలబెట్టాయి. రాజమౌళి విక్రమార్కుడు రవితేజ ఇమేజ్ ని అమాంతం పెంచేసింది. తరువాత కూడా రవితేజ సక్సెస్ లు అందుకున్నాడు. అయితే గత కొంతకాలంగా చూసుకుంటే రవితేజ ఖాతాలో సరైన సక్సెస్ ట్రాక్ తప్పినట్లు అనిపిస్తుంది.

2017 నుంచి ఇప్పటి వరకు రవితేజ నుంచి 14 సినిమాలు వస్తే అందులో కేవలం 3 మాత్రమే సూపర్ హిట్ అయ్యాయి. అందులో రాజా ది గ్రేట్, ధమాకా బిగ్ హిట్స్ గా నిలిచాయి. మిగిలిన సినిమాలు ఆశించిన స్థాయిలో సక్సెస్ కాలేదు. గత ఏడాది నుంచి ఇప్పటి వరకు నాలుగు సినిమాలతో రవితేజ సోలోగా వస్తే అన్ని డిజాస్టర్ గా మారాయి. నెక్స్ట్ రాబోయే సినిమాతో రవితేజ కచ్చితంగా బ్లాక్ బస్టర్ కొట్టాల్సిందే అనే మాట వినిపిస్తోంది. నెక్స్ట్ భాను బోగవరపు దర్శకత్వంలో ఒక సినిమా చేస్తున్న విషయం తెలిసిందే. రవితేజ వరుస డిజాస్టర్స్ తో ఫ్యాన్స్ కూడా హర్ట్ అవుతున్నారు. ఎలాంటి బ్యాగ్రౌండ్ లేకుండా ఇండస్ట్రీలో స్టార్ హీరోలుగా ఎదిగిన రవితేజ, విజయ్ దేవరకొండ కెరియర్ ని ఎలా నిలబెట్టుకుంటారనేది ఇప్పుడు ఆసక్తికరంగా మారింది.