Begin typing your search above and press return to search.

మళ్లీ పవర్ చూపించేందుకు సిద్ధమా..?

అంతకుముందు రైటర్ గా ఉన్న బాబీ పవర్ సినిమా కథ చెప్పి రవితేజని డైరెక్ట్ చేశాడు.

By:  Tupaki Desk   |   1 Jun 2024 4:30 PM GMT
మళ్లీ పవర్ చూపించేందుకు సిద్ధమా..?
X

టాలెంట్ ఉంటే చాలు ఛాన్స్ ఇవ్వడానికి ఏమాత్రం వెనకాడని వారిలో మాస్ మహరాజ్ రవితేజ ఒకరు. ఎందుకంటే ఆయనలోని టాలెంట్ ని ఎంతోమంది గుర్తించి అవకాశాలు ఇచ్చారు కాబట్టే రవితేజ ఇప్పుడు మాస్ రాజా గా క్రేజ్ తెచ్చుకున్నాడు. అందుకే కొత్త వారైనా సరే అతనిలో ప్రతిభ ఉందని అనిపిస్తే సినిమా చేస్తాడు. అలా రవితేజ ఇంట్రడ్యూస్ చేసిన టాలెంటెడ్ డైరెక్టర్స్ చాలామంది ఉన్నారు. వారిలో పవర్ డైరెక్టర్ కె.ఎస్ బాబీ కూడా ఉన్నాడు. అంతకుముందు రైటర్ గా ఉన్న బాబీ పవర్ సినిమా కథ చెప్పి రవితేజని డైరెక్ట్ చేశాడు.

రవితేజ కెరీర్ కి.. బాబీ ఫస్ట్ అటెంప్ట్ కి పర్ఫెక్ట్ సెట్ కుదిరి సినిమా సూపర్ హిట్ అయ్యింది. ఐతే పవర్ తర్వాత కూడా మళ్లీ ఈ కాంబో కలిసి పనిచేయాలని అనుకున్నా కుదరలేదు. వాల్తేరు వీరయ్య సినిమా టైం లో ముందు అసలు రవితేజ రోల్ లేదట. కానీ బాబీ సినిమా షూటింగ్ మధ్యలో రవితేజ పాత్ర యాడ్ చేసి చిరుకి చెప్పి అలా మాస్ రాజాని ప్రాజెక్ట్ లోకి తీసుకున్నాడు. అసలు వాల్తేరు వీరయ్య సినిమాలో రవితేజ లేకపోతే ఆ సినిమా ఈ రేంజ్ ఫలితాన్ని అందుకోవడం కష్టమని చెప్పాలి.

వాల్తేరు వీరయ్య సినిమా తర్వాత బాబీ బాలకృష్ణతో సినిమా చేస్తున్నాడు. ఆ సినిమా ముగింపు దశకు చేరుకుంది. ఇక ఈ సినిమా తర్వాత బాబీ మరోసారి రవితేజని డైరెక్ట్ చేస్తాడని చెప్పుకుంటున్నారు. పవర్, వాల్తేరు వీరయ్య తర్వాత హ్యాట్రిక్ సినిమాకు బాబీ రవితేజ కలిసి పనిచేయనున్నారట. ఇప్పటికే రవితేజని కలిసి బాబీ కథ ఓకే చేయించుకున్నాడని అంటున్నారు.

రవితేజ ప్రస్తుతం హరీష్ శంకర్ తో మిస్టర్ బచ్చన్ సినిమా చేస్తున్నాడు. ఈ సినిమా తర్వాత మైత్రి మూవీ మేకర్స్ తో ఒక సినిమా ఉంది. ఆ సినిమాతో పాటుగా బాబీ సినిమా చేస్తాడని టాక్. బాబీతో మరోసారి రవితేజ మాస్ పవర్ ఏంటో చూపించడానికి సిద్ధమయ్యాడు. మరి ఈ పవర్ ప్యాక్డ్ కాంబో ఈసారి ఎలాంటి సినిమాతో వస్తారన్నది చూడాలి. సినిమా పూర్తి కాగానే వెంటనే హీరోని లాక్ చేయకపోతే డైరెక్టర్స్ కూడా ఏళ్లకు ఏళ్లు వెయిట్ చేయాల్సిన పరిస్థితి కనిపిస్తుంది. అందుకే హీరోలను ముందే ఓకే చేసుకుని సినిమాలు లైన్ చేస్తున్నారు. ఇప్పటికీ కొంతమంది దర్శకులు హిట్ కొట్టినా సరే హీరోలు బిజీ అవ్వడం వల్ల ఖాళీగా ఉన్నారు. ఈ విషయంలో బాబీ క్లవర్ నెస్ అదుర్స్ అంటున్నారు.