Begin typing your search above and press return to search.

మాస్‌రాజా సెంటిమెంట్‌ బ్రేక్‌ అయ్యేనా?

మాస్ మహారాజా రవితేజ ధమాకా తర్వాత వరుసగా రావణాసుర మరియు టైగర్ నాగేశ్వరరావు సినిమాలతో నిరాశ పరిచాడు.

By:  Tupaki Desk   |   8 Feb 2024 5:37 AM GMT
మాస్‌రాజా సెంటిమెంట్‌ బ్రేక్‌ అయ్యేనా?
X

మాస్ మహారాజా రవితేజ ధమాకా తర్వాత వరుసగా రావణాసుర మరియు టైగర్ నాగేశ్వరరావు సినిమాలతో నిరాశ పరిచాడు. ధమాకా వంటి కమర్షియల్ మాస్ మసాలా సినిమాలను ప్రేక్షకులు రవితేజ నుంచి ఆశిస్తున్నారు అని ఇప్పటికే నిరూపితం అయ్యింది. అయినా కూడా రవితేజ మాత్రం విభిన్నమైన సినిమాలు చేసేందుకు ఆసక్తి చూపిస్తున్నాడు.

రవితేజ మాస్ ఎలిమెంట్స్ తో కమర్షియల్‌ టచ్ ఉన్న సినిమా చేస్తే కచ్చితంగా హిట్ అనే అభిప్రాయం ఉంది. కానీ అన్ని అదే తరహా సినిమాలు ఏం చేస్తాం అన్నట్లుగా రవితేజ అప్పుడప్పుడు విభిన్న చిత్రాలను ప్రయత్నిస్తున్నాడు. అలా ప్రయత్నించిన ప్రతి సారి కూడా ఆయన నిరాశ ఎదుర్కొన్నాడు.

ఇప్పుడు ఈగల్ సినిమాతో ప్రేక్షకుల ముందుకు వచ్చేందుకు రవితేజ రెడీ అయ్యాడు. ఈగల్ సినిమా టైలర్ టీజర్ చూస్తూ ఉంటే ఇది కూడా రవితేజ మార్క్ మాస్‌ కమర్షియల్‌ మూవీ కాదని, ఒక డిఫరెంట్‌ జోనర్‌ మూవీ అన్నట్లుగా అనిపిస్తోందని సినీ విశ్లేషకులు అభిప్రాయం వ్యక్తం చేస్తున్నారు.

డిఫరెంట్ జోనర్‌ సినిమాతో రవితేజ హిట్ అందుకోలేక పోయాడు. ఆ సెంటిమెంట్ ను ఈగల్ సినిమా బ్రేక్ చేసే అవకాశాలు ఉన్నాయి అన్నట్టుగా అభిమానులు చాలా నమ్మకం తో చెబుతున్నారు. మరి కొన్ని గంటల్లో విడుదల అవ్వబోతున్న ఈగల్ సినిమాకు సాధ్యమైనంత ఎక్కువ ప్రమోషన్‌ ను చేశారు.

సినిమాకు పెద్దగా పోటీ లేకపోవడంతో పాటు పాజిటివ్ బజ్‌ క్రియేట్‌ అయ్యింది. కనుక మినిమం టాక్‌ దక్కించుకున్నా కూడా ఈజీగా బ్రేక్ ఈవెన్‌ కలెక్షన్స్ రావడం కన్ఫర్మ్‌ అన్నట్లుగా ఇండస్ట్రీ వర్గాల వారు మరియు బాక్సాఫీస్ వర్గాల వారు అభిప్రాయం వ్యక్తం చేస్తున్నారు.