హీరోయిన్స్ పాత్ర అలా ఉంటే నచ్చదు: రవితేజ కామెంట్స్ వైరల్
ఈ సందర్భంగా గతంలో “రావణాసుర” మూవీ ప్రమోషన్స్ లో రవితేజ అన్న మాటలని సోషల్ మీడియాలో వైరల్ చేస్తున్నారు.
By: Tupaki Desk | 18 Aug 2024 7:38 AM GMTమాస్ మహారాజ్ రవితేజ గత కొన్నేళ్ల నుంచి ఆశించిన స్థాయిలో సక్సెస్ లు అందుకోవడం లేదు. ఏడాదికి 2-3 సినిమాలు రీరిలీజ్ చేస్తున్న ఏవీ కూడా మెప్పించడం లేదు. కనీసం ఫ్యాన్స్ కూడా రవితేజ నుంచి వస్తోన్న సినిమాల విషయంలో సంతృప్తికరంగా లేరనే మాట వినిపిస్తోంది. రవితేజ డేట్స్ ఇస్తున్నారని దర్శకులు పూర్తిస్థాయిలో కథలపై దృష్టి పెట్టకుండా ఆయన ఇమేజ్ ని నాశనం చేస్తున్నారనే అభిప్రాయం ఫ్యాన్స్ లో ఉంది. కచ్చితంగా మాస్ మహారాజ్ కూడా కథలని ఎంపిక చేసుకునే సమయంలో ఒకటికి రెండు సార్లు చూసుకోవాలని ఫ్యాన్స్ రిక్వెస్ట్ చేస్తున్నారు.
తాజాగా రవితేజ నుంచి “మిస్టర్ బచ్చన్” మూవీ ప్రేక్షకుల ముందుకొచ్చింది. హరీష్ శంకర్ దర్శకత్వంలో తెరకెక్కిన ఈ సినిమాకి డివైడ్ టాక్ వచ్చింది. ఈ మూవీతో భాగ్యశ్రీ బోర్సే హీరోయిన్ గా టాలీవుడ్ లోకి అడుగుపెట్టింది. ఈ సినిమా సాంగ్స్ లో భాగ్యశ్రీని హరీష్ శంకర్ చాలా అందంగా చూపించాడు. అయితే మూవీలో ఆమె క్యారెక్టర్ కి పెద్దగా ప్రాధాన్యత లేదనే మాట వినిపిస్తోంది. ఏదో హీరో లవ్ చేయడానికి ఒక హీరోయిన్ ఉండాలి కాబట్టి పెట్టారు అన్నట్లు ఉంది తప్ప క్యారెక్టర్ కి స్కోప్ లేదని సినీ విశ్లేషకులు కూడా అంటున్నారు.
ఈ సందర్భంగా గతంలో “రావణాసుర” మూవీ ప్రమోషన్స్ లో రవితేజ అన్న మాటలని సోషల్ మీడియాలో వైరల్ చేస్తున్నారు. నా సినిమాలలో హీరోయిన్ క్యారెక్టర్స్ ఏదో అలా వచ్చి వెళ్ళిపోయే విధంగా ఉండవు. అలా ఉండటం నాకు అస్సలు నచ్చదు. కేవలం సాంగ్స్ కోసం హీరోయిన్ అనే ఫార్మాట్ ని నేను వ్యతిరేకిస్తాను. అమ్మాయి క్యారెక్టర్ స్ట్రాంగ్ అయ్యి ఉంటేనే సినిమా బాగుంటుంది అనే అభిప్రాయం నాది అంటూ చెప్పుకొచ్చారు.
రవితేజ అంత స్ట్రాంగ్ గా చెప్పిన కూడా గత కొంతకాలం నుంచి ఆయన సినిమాలలో హీరోయిన్ క్యారెక్టర్స్ కేవలం పాటలకి పరిమితం అయ్యే విధంగానే ఉన్నాయి. “ధమాకా”లో శ్రీలీల, “టైగర్ నాగేశ్వరరావు”లో నుపూర్ సనన్ క్యారెక్టర్ కి ప్రాధాన్యత ఉన్నా పెర్ఫార్మెన్స్ కి స్కోప్ లేదు. అలాగే “ఈగల్” చిత్రంలో కావ్య థాపర్ క్యారెక్టర్ కూడా హీరో ఆలోచన మార్చుకోవడానికి ఒక ఫ్యాక్టర్ గా ఉంటుంది తప్ప పెద్దగా స్క్రీన్ స్పేస్ లేదు.
తాజాగా వచ్చిన “మిస్టర్ బచ్చన్” సినిమాలో కూడా భాగ్యశ్రీ బోర్సే క్యారెక్టర్ కి కూడా పెర్ఫార్మెన్స్ కి ఎలాంటి స్కోప్ లేదనే టాక్ నడుస్తోంది. హీరోయిన్స్ క్యారెక్టర్స్ విషయంలో తనకి ఎలాంటి జడ్జిమెంట్ ఉందో గత కొన్నేళ్ళ నుంచి ఆయన సినిమాల రిజల్ట్ కూడా అలాగే ఉందనే మాట సోషల్ మీడియాలో వినిపిస్తోంది. ఈ విషయంలో రవితేజ ఒకసారి ఆలోచించి కథల ఎంపిక మార్చుకోవాలని ఫ్యాన్స్ కోరుతున్నారు.