Begin typing your search above and press return to search.

ఈగల్ క్రేజీ అప్డేట్.. గెట్ రెడీ

వీటన్నంటినీ ఖండిస్తూ ఈగల్ మేకర్స్ తాజాగా అదిరిపోయే అప్డేట్ ఇచ్చారు. మూవీ ట్రైలర్ రిలీజ్ డేట్ ను ప్రకటించారు

By:  Tupaki Desk   |   18 Dec 2023 1:39 PM GMT
ఈగల్ క్రేజీ అప్డేట్.. గెట్ రెడీ
X

బాక్సాఫీస్ వద్ద మాస్ మహా రాజా రవితేజ వరుస సినిమాలతో సందడి చేస్తున్నారు. ఈ ఏడాది మొదట్లో చిరంజీవి వాల్తేరు వీరయ్యలో గెస్ట్ రోల్ లో అలరించిన రవితేజ ఆ తర్వాత టైగర్ నాగేశ్వరరావు, రావణాసుర మూవీలో ప్రేక్షకుల ముందుకు వచ్చారు. కానీ అవి నిరాశపరిచాయి. ప్రస్తుతం ఆయన ఈగల్ సినిమాలో నటిస్తున్న విషయం తెలిసిందే.


ప్రస్తుతం ఈగల్ మూవీ షూటింగ్ పూర్తై పోస్ట్ ప్రొడక్షన్ పనులు జరుగుతున్నాయి. ఇప్పటికే విడుదలైన ఈ సినిమా టీజర్, పోస్టర్లు సినిమాపై అంచనాలు పెంచేశాయి. అయితే ఈ మూవీ ట్రైలర్ ను డిసెంబర్ 22న ప్రపంచవ్యాప్తంగా రిలీజ్ కాబోతున్న సలార్ మూవీని ప్రదర్శించే థియేటర్లలో వేయాలని నిర్మాతలు ప్లాన్ చేస్తున్నారని వార్తలు వస్తున్నాయి.

వీటన్నంటినీ ఖండిస్తూ ఈగల్ మేకర్స్ తాజాగా అదిరిపోయే అప్డేట్ ఇచ్చారు. మూవీ ట్రైలర్ రిలీజ్ డేట్ ను ప్రకటించారు. డిసెంబరు 20వ తేదీ సాయంత్రం 4.05 గంటలకు ట్రైలర్ ను విడుదల చేయనున్నట్లు తెలిపారు. అతడి ఊచకోతను ఎదుర్కోవడానికి సిద్ధంగా ఉండమని క్యాప్షన్ ఇచ్చారు. సంక్రాంతి కానుకగా జనవరి 13వ తేదీన రిలీజ్ చేయబోతున్నట్లు మరోసారి క్లారిటీ ఇచ్చారు.

డిఫరెంట్ కాన్సెప్ట్ తో సస్పెన్స్ థ్రిల్లర్ గా తెరకెక్కుతున్న ఈ సినిమాలో రవితేజ సరసన అనుపమ పరమేశ్వరన్, కావ్య తాపర్ హీరోయిన్లుగా నటిస్తున్నారు. నవదీప్, అవసరాల శ్రీనివాస్, వినయ్ రాయ్, సునీల్ కీలక పాత్రలు పోషిస్తున్నారు. పీపుల్స్ మీడియా ఫ్యాక్టరీ బ్యానర్ పై టీజీ విశ్వప్రసాద్, వివేక్ కూచిబోట్ల సంయుక్తంగా నిర్మిస్తున్నారు.

ప్రస్తుతం రవితేజ సాలిడ్ హిట్ కోసం ఎదురుచూస్తున్నారు. వరుస ప్లాపులతో సతమతమవుతున్న ఈ హీరో మార్కెట్ చాలా దారుణంగా పడిపోవటమే అందుకు కారణం. ఓటీటీలు సైతం ఈయన సినిమాలు ఎక్కువ రేటుకు తీసుకోవడానికి ముందుకు రావటంలేదట. దీంతో మైత్రీ మూవీ మేకర్స్ వంటి కొంతమంది పెద్ద నిర్మాతలు కూడా రవితేజను పక్కన పెట్టేశారట. మరో రెండు సినిమాలకు సంబంధించి రెమ్యునరేషన్ విషయంలో రవితేజతో నిర్మాతలు చర్చలు జరుపుతున్నట్లు సమాచారం. ఈ నేపథ్యంలో రవితేజకు ఈగల్ గట్టి కమ్ బ్యాక్ ఇవ్వాలని ఫ్యాన్స్ కోరుకుంటున్నారు.