Begin typing your search above and press return to search.

థ్యాంక్యూ గురు.. మాస్ రాజాపై హనుమాన్ హీరో కామెంట్..!

ప్రశాంత్ వర్మ, తేజా సజ్జా కలిసి చేసిన మూవీ హనుమాన్ అనుకున్నట్టుగానే హిట్ టాక్ సొంతం చేసుకుంది

By:  Tupaki Desk   |   12 Jan 2024 4:34 PM GMT
థ్యాంక్యూ గురు.. మాస్ రాజాపై హనుమాన్ హీరో కామెంట్..!
X

ప్రశాంత్ వర్మ, తేజా సజ్జా కలిసి చేసిన మూవీ హనుమాన్ అనుకున్నట్టుగానే హిట్ టాక్ సొంతం చేసుకుంది. ఫస్ట్ ఇండియన్ సూపర్ హీరో మూవీగా ప్రశాంత్ వర్మ హనుమాన్ సినిమాను చాలా బాగా ప్రమోట్ చేస్తూ వచ్చారు. కంటెంట్ మీద ఉన్న నమ్మకంతో స్టార్ సినిమాల మధ్య రిస్క్ అని తెలిసినా సరే సంక్రాంతి ఫైట్ లో నిలిచారు. సంక్రాంతికి యూనానిమస్ హిట్ టాక్ తెచ్చుకున్న సినిమాగా హనుమాన్ సూపర్ క్రేజ్ తెచ్చుకుంది. అయితే ఈ సినిమాలో మాస్ మహరాజ్ రవితేజ కూడా భాగమయ్యారు.

సినిమాలో కోతికి రవితేజ వాయిస్ ఓవర్ ఇచ్చారు. రవితేజ వాయిస్ ఓవర్ హనుమాన్ ఆడియన్స్ ని థ్రిల్ చేస్తుంది. ప్రశాంత్ వర్మ డైరెక్షన్ లో వచ్చిన మొదటి సినిమా అ! లో కూడా మొక్కకి వాయిస్ ఓవర్ ఇచ్చారు రవితేజ. ఇప్పుడు మళ్లీ హనుమాన్ సినిమాలో కోతికి వాయిస్ ఓవర్ ఇచ్చారు. రవితేజ వాయిస్ ఓవర్ కూడా హనుమాన్ హిట్ లో భాగమైంది. అయితే సినిమా హిట్ అయిన సందర్భంగా హనుమాన్ హీరో తేజా మాస్ రాజాకి థ్యాంక్స్ చెప్పాడు.

సంక్రాంతి సందర్భంగా రిలీజైన హనుమాన్ సినిమాకు హిట్ టాక్ రావడంతో సినిమా యూనిట్ అందరికీ కృతజ్ఞతలు తెలిపారు రవితేజ. మీ హార్డ్ వర్క్, పనితనానికి తగిన ఫలితం వచ్చిందని. ఇలాంటి సక్సెస్ లు మీ కెరీర్లో ఎన్నో అందుకోవాలని రవితేజ ఎక్స్ లో మెసేజ్ చేశారు. అయితే దానికి రెస్పాన్స్ అవుతూ థాంక్యూ గురువు గారు.. మీ వాయిస్ మా సినిమాకు మరింత ప్రత్యేకత ఉండేలా చేసింది. అందుకు మీకు థాంక్యూ చెబితే సరిపోదు అంటూ తేజా సజ్జా రాసుకొచ్చాడు.

ప్రశాంత్ వర్మ ప్రతిభ గురించి తెలిసు కాబట్టే హనుమాన్ సినిమా ని ఎవరు లైట్ తీసుకోలేదు. అయితే స్టార్ సినిమాల మధ్య రిస్క్ అని ముందు అనుకున్నా అతను కాన్ఫిడెంట్ గా రిలీజ్ చేయడం చూసి అందరు సర్ ప్రైజ్ అయ్యారు. ఇక తన నమ్మకాన్ని నిలబెట్టుకుంటూ హనుమాన్ సినిమాను ఆడియన్స్ చేత సూపర్ అనిపించేలా చేశాడు ప్రశాంత్ వర్మ. ఈ సినిమాలో తేజ సజ్జా నటనకు కూడా మంచి మార్కులు పడ్డాయి. నిరంజన్ రెడ్డి నిర్మించిన హనుమాన్ సినిమాలో వి.ఎఫ్.ఎక్స్ వర్క్ కూడా బాగా వర్క్ అవుట్ అయ్యింది.