Begin typing your search above and press return to search.

టీమ్​ఇండియా వరల్డ్ కప్​ మ్యాచ్​లో​ టైగర్ రాజా

క్రికెట్ అభిమానులంతా ఎప్పుడెప్పుడా అని ఎదురుచూసిన వన్డే వరల్డ్‌ కప్‌ రీసెంట్​గా ప్రారంభమైన సంగతి తెలిసిందే.

By:  Tupaki Desk   |   8 Oct 2023 12:39 PM GMT
టీమ్​ఇండియా వరల్డ్ కప్​ మ్యాచ్​లో​ టైగర్ రాజా
X

క్రికెట్ అభిమానులంతా ఎప్పుడెప్పుడా అని ఎదురుచూసిన వన్డే వరల్డ్‌ కప్‌ రీసెంట్​గా ప్రారంభమైన సంగతి తెలిసిందే. అలాగే ఈ ఆదివారం వరల్డ్ కప్‌లో భాగంగా టీమ్​ఇండియా తమ మొదటి మ్యాచ్​ను.. చెన్నైలోని చెపాక్ మైదానం వేదికగా ఆస్ట్రేలియాతో ఆడుతోంది. అయితే ఈ మ్యాచ్‌ను తెలుగు ప్రేక్షకులకు మరింత ఇంట్రెస్టింగ్‌గా చేశారు మ్యాచ్ నిర్వాహకులు.

అదేంటంటే.. ఈ మ్యాచ్‌ తెలుగు క్రికెట్ లైవ్ షోలో టైగర్ నాగేశ్వరరావు ప్రమోషన్స్​లో భాగాంగా టాలీవుడ్ మాస్ మహారాజా రవితేజ పాల్గొంటారని వార్తలు వచ్చిన సంగతి తెలిసిందే. అయితే అనుకున్నట్టే మాస్​ మహారాజా లైవ్​ షోలో పాల్గొని సందడి చేశారు. తన ఎనర్జీతో ఊపు తెప్పించారు. వ్యాఖ్యాతలతో కలిసి కామెంటరీ చేశారు. క్రికెట్ అభిమానులతోనూ ముచ్చటించనున్నాడు. దీనికి సంబంధించిన వీడియోలు, ఫొటోలు బయటకు వచ్చాయి.

ఈ మ్యాచ్​లో సెంచరీలు నమోదు అవుతాయని ఆశించారు. క్రికెటర్స్​ సిరాజ్ -​ కోహ్లీ ఇంటే ఇష్టమని చెప్పారు. కోహ్లీలో ఉండే అగ్రెషన్​, యాటిట్యూడ్​, లుక్​ తనకెంతో ఇష్టమని పేర్కొన్నారు. అతడిలో మంచి కాన్ఫిడెన్స్​ కనిపిస్తుందని చెప్పుకొచ్చారు. ప్రస్తుతం జరుగుతున్న మ్యాచ్​లో మిచెల్ మార్ష్​ క్యాచ్​ను కోహ్లీ పట్టుకున్న స్టైల్​ కూడా బాగా నచ్చిందని అన్నారు.

ఇకపోతే మరి కొన్ని గంటల్లో ప్రసారం కానున్న తెలుగు బిగ్​ బాస్​ 7 వీకెండ్​ షోలోనూ రవితేజ సందడి చేయనున్నారు. ఇప్పటికే దానికి సంబంధించిన ప్రోమోలు, ఫొటోలు బయటకు వచ్చాయి. కాగా, దసరా కానుకగా అక్టోబర్ 20న టైగర్ నాగేశ్వరరావు చిత్రంతో రవితేజ ప్రేక్షకుల ముందుకు రాబోతున్నాjg. దేశంలోనే అతిపెద్ద గజదొంగగా పేరుగాంచిన స్టువర్టుపురం టైగర్ నాగేశ్వరరావు జీవితం ఆధారంగా ఈ సినిమా తెరకెక్కింది. ఈ చిత్రానికి వంశీ దర్శకత్వం వహించారు. అభిషేక్ అగర్వాల్ ఆర్ట్స్ బ్యానర్‌పై అభిషేక్ అగర్వాల్ నిర్మించారు.

జీషూ సేన్ గుప్తా, రేణూ దేశాయ్, అనుపమ్ ఖేర్ తదితరులు సినిమాలో ఇతర ప్రధాన పాత్రలు పోషించారు. ఈ చిత్రంతోనే రవితేజ బాలీవుడ్ అరంగేట్రం చేయనండటం మరో విశేషం. ఇప్పటికే ఈ సినిమా నుంచి రిలీజైన అయిన పోస్టర్స్, టీజర్, ట్రైలర్, సాంగ్స్ ప్రేక్షకులను విశేషంగా ఆకట్టుకున్నాయి.