Begin typing your search above and press return to search.

షూటింగ్ లో రవితేజకు గాయం.. ఏం జరిగిందంటే..

గతంలోనే ఒకసారి సినిమా షూటింగ్ సమయంలో గాయపడిన విషయం తెలిసిందే.

By:  Tupaki Desk   |   23 Aug 2024 12:38 PM GMT
షూటింగ్ లో రవితేజకు గాయం.. ఏం జరిగిందంటే..
X

మాస్ మహారాజా రవితేజ ఇటీవల మిస్టర్ బచ్చన్ సినిమాతో ప్రేక్షకుల ముందుకు వచ్చిన విషయం తెలిసిందే. ఇక గ్యాప్ లేకుండా వెంట వెంటనే సినిమాలు చేసే రవితేజ రీసెంట్ గా తన 75వ సినిమా షూటింగ్ తో మరింత బిజీ అయ్యాడు. అయితే ఇటీవల అతను గాయం కారణంగా సడన్ కు బ్రేక్ ఇవ్వాల్సి వచ్చింది. గతంలోనే ఒకసారి సినిమా షూటింగ్ సమయంలో గాయపడిన విషయం తెలిసిందే.

షూటింగ్‌లో ఆయన తన కుడి చేతికి కండరాలకు గాయం అయ్యింది. అయితే మొదట దాన్ని పెద్దగా పట్టించుకోలేదు. అలానే షూటింగ్‌లో పాల్గొన్నారు, దీనివల్ల గాయం మరింత తీవ్రతరం అయ్యింది. ఈ పరిణామాల నేపథ్యంలో నొప్పి పెరగడంతో రవితేజకు యశోదా హాస్పిటల్‌లో సర్జరీ నిర్వహించారు. ఆపరేషన్ విజయవంతంగా పూర్తయినట్లు తెలుస్తోంది.

ఇక ఆయన త్వరగా కోలుకునేందుకు వైద్యులు ఆరు వారాలపాటు పూర్తిగా విశ్రాంతి తీసుకోవాలని సూచించారు. ఈ సర్జరీ తర్వాత రవితేజ తగిన జాగ్రత్తలు పాటిస్తూ, బాగా కోలుకోవాలని అభిమానులు కోరుకుంటున్నారు. రవితేజ తాజా సినిమా #RT75 గురించి ఇప్పటికే భారీ అంచనాలు ఉన్నాయి. కండరాల గాయం కారణంగా షూటింగ్‌లో కొంత విరామం తీసుకున్నప్పటికీ, ఆయన త్వరలోనే పూర్తి ఆరోగ్యంతో తిరిగి షూటింగ్‌కి హాజరవుతారని చిత్ర బృందం ఆశాభావం వ్యక్తం చేస్తోంది.

రవితేజ 75 వ సినిమాకు భాను బోగవరపు దర్శకత్వం వహిస్తున్న విషయం తెలిసిందే.ఇంతకుముందు గల్లీ రౌడీ, సామజవరగమన సినిమాలకు భాను రైటర్ గా వర్క్ చేశాడు. ఇక రవితేజ అతనికి ఫస్ట్ టైమ్ డైరెక్టర్ గా అవకాశం ఇచ్చాడు. సితార ఎంటర్టైన్మెంట్స్ లో నాగవంశీ సాయి సౌజన్య ఈ సినిమాను నిర్మిస్తున్నారు. ఇక సినిమాకు సంబంధించిన షూటింగ్ పనులు కూడా ఇన్ని రోజులు గ్యాప్ లేకుండా కొనసాగాయి.

ఇప్పుడు సడన్ గా రవితేజ గాయం కారణంగా రెస్ట్ తీసుకోవడంతో కొంత గ్యాప్ అయితే పెరగనుంది. సినిమాలను వచ్చే సంక్రాంతికి విడుదల చేయాలని అనుకున్నారు. కానీ ఇప్పుడు అనుకున్న షెడ్యూల్స్ లో కొంత మార్పు వచ్చే అవకాశం అయితే ఉంది. మేకర్స్ మాత్రం రవితేజ లేకపోయినప్పటికీ హీరోతో అవసరంలేని సన్నివేశాలను ముందుగానే పూర్తి చేయాలని ఆలోచిస్తున్నారట. తప్పకుండా అనుకున్న సమయానికి సినిమాను విడుదల చేయాలి అని మేకర్స్ ఒక టార్గెట్ అయితే పెట్టుకున్నారు. మరి ఆ ప్లాన్ ఎంతవరకు వర్క్ అవుట్ అవుతుందో చూడాలి.