మాస్ మహారాజ్.. ఆ ఒక్కటి తప్పితే..
చివరిగా మాస్ మహారాజ్ నుంచి వచ్చిన 5 చిత్రాలలో ఒక్క ధమాకా మాత్రమే బ్లాక్ బస్టర్ హిట్ అయ్యింది.
By: Tupaki Desk | 28 April 2024 4:30 AM GMTమాస్ మహారాజ్ రవితేజకి టాలీవుడ్ లో ప్రత్యేకమైన బ్రాండ్ ఉంది. అతని నుంచి సినిమా వసుందంటే ప్రేక్షకులు వినోదంతో పాటు యాక్షన్ ఎలిమెంట్స్ ఎక్స్ పెక్ట్ చేస్తారు. అలాగే రవితేజ టాలీవుడ్ లో చాలా మంది కొత్త దర్శకులకి అవకాశాలు ఇస్తూ ఉంటాడు. ప్రస్తుతం టాలీవుడ్ లో కమర్షియల్ డైరెక్టర్స్ గా చాలా మంది రవితేజ సినిమాల ద్వారానే కెరియర్ స్టార్ట్ చేశారు.
ప్రస్తుతం టాలీవుడ్ లో అందరికంటే వేగంగా సినిమాలు చేస్తోన్న హీరో అంటే రవితేజ పేరే వినిపిస్తోంది. మాస్ రాజా నుంచి ఏడాదికి రెండు సినిమాలు కచ్చితంగా వస్తాయి. అయితే గత కొంతకాలంలో రవితేజకి ఆశించిన స్థాయిలో కమర్షియల్ సక్సెస్ లు దక్కడం లేదు. ఒక సినిమా హిట్ అయితే రెండు, మూడు సినిమాలు ఫ్లాప్ అవుతున్నాయి. చివరిగా మాస్ మహారాజ్ నుంచి వచ్చిన 5 చిత్రాలలో ఒక్క ధమాకా మాత్రమే బ్లాక్ బస్టర్ హిట్ అయ్యింది.
మిగిలిన నాలుగు సినిమాలు ఫ్లాప్ అయ్యాయి. రవితేజ సినిమాలకి ప్రస్తుతం మార్కెట్ లో 30 నుంచి 35 కోట్ల వరకు బిజినెస్ ఉంది. అయితే అతని సినిమాలు ఆ స్థాయిలో కలెక్షన్స్ సాధించడం లేదు. ఐదు సినిమాలలో హైయెస్ట్ కలెక్షన్స్ ధమాకా సాధించింది. ఈ సినిమా లాంగ్ రన్ లో 45.06 కోట్ల షేర్ వసూళ్లు చేసింది. దీని తర్వాత సెకండ్ హైయెస్ట్ కలెక్షన్స్ టైగర్ నాగేశ్వరరావు కలెక్ట్ సొంతం చేసుకుంది.. ఈ మూవీ 25.50 కోట్ల షేర్ రాబట్టింది.
మూడో స్థానంలో ఈగల్ 16.89 కోట్ల కలెక్షన్స్ తో నిలిచింది. నాలుగో స్థానంలో ఉన్న రావణాసుర 12.02 కోట్ల షేర్ వరల్డ్ వైడ్ గా వసూళ్లు చేసింది. రామారావు ఆన్ డ్యూటీ మూవీ అయితే కేవలం 5.20 కోట్ల షేర్ మాత్రమే కలెక్ట్ చేసి బిగ్గెస్ట్ డిజాస్టర్ గా మారింది. ఈ సినిమాలు అన్ని కలిపి 104.67 కోట్లు మాత్రమే వసూళ్లు చేశాయి. ఒక్కో సినిమా ఏవరేజ్ కలెక్షన్ చూసుకుంటే 20.93 కోట్లలో ఉంది.
ఈ ఐదు చిత్రాలలో ధమాకా ఒక్కటే కమర్షియల్ గా నిర్మాతలకి మంచి లాభాలు తెచ్చిపెట్టింది. ప్రస్తుతం రవితేజ హరీష్ శంకర్ దర్శకత్వంలో మిస్టర్ బచ్చన్ మూవీ చేస్తున్నాడు. ఈ సినిమాపై ఎక్స్ పెక్టేషన్స్ హై ఎండ్ లోనే ఉన్నాయి. కచ్చితంగా ఈ సినిమాతో రవితేజ తన మార్కెట్ ని మళ్ళీ సొంతం చేసుకుంటాడని భావిస్తున్నారు.