రవితేజను చూసి నేర్చుకోవాల్సిందే..
మాస్ మహారాజ్ రవితేజ హిట్, ఫ్లాప్ లతో సంబంధం లేకుండా ఏడాదికి రెండు, మూడు సినిమాలని ప్రేక్షకుల ముందుకి తీసుకొస్తున్నారు
By: Tupaki Desk | 21 July 2024 5:22 AM GMTమాస్ మహారాజ్ రవితేజ హిట్, ఫ్లాప్ లతో సంబంధం లేకుండా ఏడాదికి రెండు, మూడు సినిమాలని ప్రేక్షకుల ముందుకి తీసుకొస్తున్నారు. ఒక సినిమా సెట్స్ మీద ఉండగానే ఇంకో సినిమాని లైన్ లో పెడుతున్నారు. మూవీ షూటింగ్ కంప్లీట్ కాగానే కొద్ది రోజులు గ్యాప్ తీసుకొని నెక్స్ట్ కమిట్ అయిన సినిమాకి రెడీ అయిపోతున్నాడు. అందుకే అతని నుంచి ఏడాదికి ఈజీగా 2 సినిమాల వరకు వస్తున్నాయి. ఈ ఏడాదిలో ఇప్పటికే ఈగల్ సినిమాతో ప్రేక్షకుల ముందుకొచ్చిన రవితేజ మిస్టర్ బచ్చన్ చిత్రాన్ని ఆగష్టు 15న థియేటర్స్ లోకి తీసుకొస్తున్నాడు.
అలాగే నెక్స్ట్ సినిమా షూటింగ్ కి ఏర్పాట్లు చేసుకుంటున్నట్లు తెలుస్తోంది. టైర్ 2 హీరోగా ఉన్న రవితేజ వీలైనన్ని ఎక్కువ సినిమాలని ప్రేక్షకులకి అందించడానికి ప్రయత్నం చేస్తున్నారు. ఇక టైర్ 1 హీరోలలో డార్లింగ్ ప్రభాస్ కూడా పెర్ఫెక్ట్ ప్లానింగ్ తో మూవీస్ చేస్తూ ఏడాదికి 2 సినిమాలు కచ్చితంగా రిలీజ్ అయ్యేలా చూసుకుంటున్నారు. రవితేజ బాటలోనే నేచురల్ స్టార్ నాని కూడా నడుస్తున్నారు.
కచ్చితంగా ఏడాదికి రెండు సినిమాలని ప్రేక్షకులకి అందించాలని టార్గెట్ గా పెట్టుకున్నారు. గత ఏడాది దసరా, హాయ్ నాన్న సినిమాలతో నాని ప్రేక్షకుల ముందుకొచ్చి సక్సెస్ అందుకున్నారు. ఈ ఏడాది సరిపోదా శనివారం రిలీజ్ కి రెడీ అవుతోంది. అలాగే మరో కొత్త సినిమాని సెట్స్ పైకి తీసుకొని వెళ్తున్నాడు. ఇక విశ్వక్ సేన్ కూడా గ్యాంగ్స్ ఆఫ్ గోదావరి చిత్రాన్ని ఇప్పటికే ప్రేక్షకుల ముందుకి తీసుకొచ్చారు. మెకానిక్ రాకీ కూడా అక్టోబర్ లో రాబోతోంది.
అయితే చాలా మంది యంగ్ హీరోలు సరైన ప్లానింగ్ లేకపోవడంతో ఏడాదికి ఒక సినిమాని కూడా రిలీజ్ చేయడం గగనం అయిపోతుంది. అక్కినేని హీరో అఖిల్ చివరిగా ఏజెంట్ మూవీతో థియేటర్స్ లోకి వచ్చాడు. ఇప్పటి వరకు కొత్త సినిమా స్టార్ట్ చేయలేదు. నాగ చైతన్య కూడా ఈ ఏడాది తండేల్ మూవీ మాత్రమే ప్రేక్షకుల ముందుకి తీసుకొస్తున్నాడు. నితిన్ రాబిన్ హుడ్ ఈ ఏడాది ఆఖరులో రిలీజ్ అవుతోంది. రామ్ డబుల్ ఇస్మార్ట్ రిలీజ్ అవుతోంది. నెక్స్ట్ సినిమా ఏంటనేది క్లారిటీ లేదు.
సాయి ధరమ్ తేజ్, వైష్ణవ్ తేజ్, వరుణ్ తేజ్ కూడా ఏడాదికి ఒక సినిమా మాత్రమే చేయగలుగుతున్నారు. ఇక టైర్ 1 హీరోలు అయితే రెండేళ్లకి ఒక సినిమా చేయడం కూడా కష్టం అయిపోతోంది. ఆర్ఆర్ఆర్ తర్వాత ఎన్టీఆర్ దేవరతో రావడానికి రెండేళ్లు పట్టింది. అల్లు అర్జున్ అయితే మూడేళ్ల తర్వాత పుష్ప ది రూల్ తో రానున్నాడు. యంగ్ హీరోల నుంచి స్టార్ హీరోల వరకు సినిమాల ప్లానింగ్ పరంగా రవితేజని స్ఫూర్తిగా తీసుకోవాల్సిన అవసరం ఉందనే మాట టాలీవుడ్ సర్కిల్ లో వినిపిస్తోంది.