Begin typing your search above and press return to search.

రవితేజ.. అన్ని ఫ్లాప్స్ వచ్చినా లెక్క తగ్గలేదు!

ఇదిలా ఉంటే ఈ సినిమా బిజినెస్ డీల్స్ ఆల్ మోస్ట్ క్లోజ్ అయ్యాయంట. నైజాం రైట్స్ ఏకంగా 15 కోట్లకి అమ్ముడయ్యానని తెలుస్తోంది.

By:  Tupaki Desk   |   1 Aug 2024 4:33 AM GMT
రవితేజ.. అన్ని ఫ్లాప్స్ వచ్చినా లెక్క తగ్గలేదు!
X

మాస్ మహారాజ్ రవితేజ టాలీవుడ్ లో అందరికంటే వేగంగా సినిమాలు చేస్తున్నాడు. ఏడాదికి రెండు, మూడు సినిమాలు రవితేజ నుంచి వస్తున్నాయి. సక్సెస్, ఫెయిల్యూర్ తో సంబంధం లేకుండా రవితేజ మూవీస్ చేసుకుంటూ వెళ్లిపోతున్నారు. గత ఏడాది వాల్తేరు వీరయ్యతో మెగాస్టార్ చిరంజీవితో కలిసి రవితేజ హిట్ అందుకున్నారు. తరువాత రవితేజ నుంచి వచ్చిన రావణాసుర, టైగర్ నాగేశ్వరరావు సినిమాలతో రెండు ఫ్లాప్ అయ్యాయి.

ఈ ఏడాది వచ్చిన ఈగల్ మూవీ కూడా డిజాస్టర్ అయ్యింది. దీంతో హ్యాట్రిక్ ఫ్లాప్స్ ఖాతాలో చేరాయి. అయిన కూడా రవితేజ చేతినిండా సినిమాలు ఉన్నాయి. స్ట్రాంగ్ లైనప్ తోనే వెళుతున్నాడు. మిస్టర్ బచ్చన్ సినిమాతో ఆగష్టు 15న రవితేజ ప్రేక్షకుల ముందుకి రాబోతున్నాడు. హరీష్ శంకర్ దర్శకత్వంలో ఈ మూవీ తెరకెక్కింది. కమర్షియల్ యాక్షన్ ఎంటర్టైనర్ గా మిస్టర్ బచ్చన్ మూవీ రెడీ అవుతోంది. పీపుల్స్ మీడియా ఫ్యాక్టరీ ఈ చిత్రాన్ని నిర్మించింది.

ఇదిలా ఉంటే ఇప్పటికే మిస్టర్ బచ్చన్ నుంచి ప్రేక్షకుల ముందుకొచ్చిన సాంగ్స్, టీజర్ కి మంచి రెస్పాన్స్ వచ్చింది. దీంతో సినిమాపై పాజిటివ్ వైబ్ క్రియేట్ అయ్యింది. హరీష్ శంకర్ నుంచి ఐదేళ్ల తర్వాత వస్తోన్న సినిమా కావడంతో కొంత క్రేజ్ ఉంది. మిరపకాయ్ లాంటి బ్లాక్ బస్టర్ తర్వాత లాంగ్ గ్యాప్ తీసుకొని రవితేజ, హరీష్ శంకర్ మిస్టర్ బచ్చన్ చేశారు. రీమేక్ మూవీ అయిన కూడా సినిమాపై స్ట్రాంగ్ బజ్ గా నడుస్తోంది.

ఇదిలా ఉంటే ఈ సినిమా బిజినెస్ డీల్స్ ఆల్ మోస్ట్ క్లోజ్ అయ్యాయంట. నైజాం రైట్స్ ఏకంగా 15 కోట్లకి అమ్ముడయ్యానని తెలుస్తోంది. వరుసగా మూడు డిజాస్టర్ ల తర్వాత కూడా 15 కోట్లకి మిస్టర్ బచ్చన్ రైట్స్ కొన్నారంటే కేవలం కాంబినేషన్ మీద నమ్మకంతోనే అని చెప్పొచ్చు. ఈ సినిమా 2.5 కోట్ల రిఫండబుల్ రేషియోలో రైట్స్ ని ప్రముఖ డిస్టిబ్యూటర్ తీసుకున్నారంట. ఒక వేళ మూవీ ఫ్లాప్ అయితే నిర్మాత 2.5 కోట్లు తిరిగి చెల్లిస్తారు.

నైజంలోనే 15 కోట్ల బిజినెస్ అంటే ఆంధ్రా, సీడెడ్ కలుపుకుంటే భారీ బిజినెస్ లెక్కలు తేలే అవకాశం ఉంది. ఈ సినిమా సాంగ్స్, టీజర్ కి పాజిటివ్ రెస్పాన్స్ రావడంతో డిస్టిబ్యూటర్స్ మిస్టర్ బచ్చన్ రైట్స్ కోసం పోటీ పడుతున్నారు. డిజిటల్ రైట్స్ కూడా ఫ్యాన్సీ ధరకి అమ్ముడైనట్లు తెలుస్తోంది. మిస్టర్ బచ్చన్ సినిమాతో భాగ్యశ్రీ బోర్సే హీరోయిన్ గా టాలీవుడ్ లోకి అడుగుపెడుతోంది. ఈ మూవీ రిలీజ్ కాకుండానే మరో రెండు సినిమా ఛాన్స్ లు ఈ అమ్మడు అందుకోవడం విశేషం.