Begin typing your search above and press return to search.

'మిస్టర్ బచ్చన్' షో రీల్.. ఇది మాస్ కిక్

ఇప్పటి వరకు సినిమా నుంచి పోస్టర్లను రిలీజ్ చేసిన మిస్టర్ బచ్చన్ మేకర్స్.. తాజాగా షో రీల్ పేరుతో ఫ‌స్ట్ గ్లింప్స్ ను విడుదల చేశారు. ఎలాంటి డైలాగ్స్ లేకుండా ఫుల్ మాస్ ఎంటర్టైనర్ గా సాగుతుంది షో రీల్.

By:  Tupaki Desk   |   17 Jun 2024 12:39 PM GMT
మిస్టర్ బచ్చన్ షో రీల్.. ఇది మాస్ కిక్
X

టాలీవుడ్ మాస్ మహారాజా రవితేజ ప్రస్తుతం మిస్టర్ బచ్చన్ మూవీలో నటిస్తున్న విషయం తెలిసిందే. నామ్‌ తో సునా హోగా ట్యాగ్ లైన్ తో తెరకెక్కుతున్న ఈ సినిమాకు స్టార్ డైరెక్టర్ హరీష్ శంకర్ దర్శకత్వం వహిస్తున్నారు. ఇప్పటికే రవితేజ, హరీష్ శంకర్ కాంబోలో వచ్చిన షాక్, మిరపకాయ్ సినిమాలు మంచి హిట్ అయ్యాయి. దీంతో మిస్టర్ బచ్చన్ మూవీపై సినీ ప్రియులతో పాటు రవితేజ ఫ్యాన్స్ లో భారీ అంచనాలు నెలకొన్నాయి.

పీపుల్ మీడియా ఫ్యాక్టరీ బ్యానర్ పై టీజీ విశ్వప్రసాద్ గ్రాండ్ గా నిర్మిస్తున్న ఈ సినిమా.. బాలీవుడ్ హిట్ మూవీ రైడ్ కు రీమేక్ గా తెరకెక్కుతోంది. సినిమాలో రవితేజ బిగ్ బి అమితాబ్ బచ్చన్ ఫ్యాన్ గా కనిపించనున్నారు. ఇప్పటికే మేకర్స్ రిలీజ్ చేసిన పోస్టర్ లో అమితాబ్ పోజులో కనిపించి ఆకట్టుకున్నారు రవితేజ. భాగ్యశ్రీ బొర్సే హీరోయిన్ గా యాక్ట్ చేస్తోంది. ఈ సినిమాతో టాలీవుడ్ లోకి ఎంట్రీ ఇస్తోంది. ప్రస్తుతం మూవీ షూటింగ్ స్పీడ్ గా జరుగుతోంది.

ఇప్పటి వరకు సినిమా నుంచి పోస్టర్లను రిలీజ్ చేసిన మిస్టర్ బచ్చన్ మేకర్స్.. తాజాగా షో రీల్ పేరుతో ఫ‌స్ట్ గ్లింప్స్ ను విడుదల చేశారు. ఎలాంటి డైలాగ్స్ లేకుండా ఫుల్ మాస్ ఎంటర్టైనర్ గా సాగుతుంది షో రీల్. వీడియో అంతా రవితేజ తన మాస్ యాక్షన్ తో వేరే లెవల్ లో అలరించారు. చెప్పాలంటే.. తనదైన మాస్ స్వాగ్ తో ఆయన అదరగొట్టేశారు. అయితే డైలాగ్స్ లేకపోయినా.. యాక్షన్ లో క్లియర్ గా హరీష్ శంకర్ మార్క్ కనిపించింది.

మిస్టర్ బచ్చన్ లో రవితేజ ఇన్ కమ్ టాక్స్ ఆఫీసర్ గా కనిపించనున్నట్లు లేటెస్ట్ గ్లింప్స్ చూస్తుంటే ఈజీగా తెలుస్తుంది. ఇన్ క‌మ్ ట్యాక్స్ ఆఫీస‌ర్ గా రవితేజ.. పెద్ద రాజకీయ నాయకుడి ఇంటికి రైడ్ కు వెళ్లాక ఏం జరిగిందనే అంశంతో మూవీని తెరకెక్కిస్తున్నట్లు అర్థమవుతుంది. 1990 బ్యాక్ డ్రాప్ లో ఈ సినిమా రూపొందుతున్నట్లు కనిపిస్తోంది. మూవీలో యాక్షన్ తో పాటు లవ్ ఎలిమెంట్ కూడా ఉండబోతున్నట్లు క్లియర్ గా తెలుస్తోంది.

రాజకీయ నాయకుడి పాత్రలో జగపతిబాబు నటిస్తున్నట్లు చూపించారు మేకర్స్. ఆ తర్వాత భాగ్య శ్రీ బొర్సేని కూడా పరిచయం చేశారు. కాసేపే ఆమె ఉన్నా ఆకట్టుకుంటోంది. మిక్కీ జే మేయర్ అందించిన బ్యాక్ గ్రౌండ్ మ్యూజిక్ బాగుంది. మొత్తానికి ప్రమోషన్స్ లో భాగంగా రిలీజ్ చేసిన మిస్టర్ బచ్చన్ గ్లింప్స్.. అదిరిపోయిందని నెటిజన్లు చెబుతున్నారు. ఫ్యాన్స్ అయితే పండుగ చేసుకుంటున్నారు. మరి ఈ మూవీ ఎప్పుడు రిలీజ్ అవుతుందో చూడాలి.