Begin typing your search above and press return to search.

రవితేజ.. డెడికేషన్ అంటే ఇది!

హరీష్ శంకర్ దర్శకత్వంలో తెరకెక్కుతున్న ఈ చిత్రాన్ని పీపుల్ మీడియా ఫ్యాక్టరీ బ్యానర్ పై టీజీ విశ్వప్రసాద్ గ్రాండ్ గా నిర్మిస్తున్నారు

By:  Tupaki Desk   |   14 Jun 2024 4:38 PM GMT
రవితేజ.. డెడికేషన్ అంటే ఇది!
X

టాలీవుడ్ మాస్ మహారాజా రవితేజకు ఎలాంటి ఫ్యాన్ బేస్ ఉందో అందరికీ తెలిసిందే. ఎటువంటి సినీ బ్యాక్ గ్రౌండ్ లేకుండా ఇండస్ర్టీలోకి వచ్చి స్టార్ హీరోగా ఎదిగారు. 2024లో ఇప్పటికే ఈగల్ సినిమాతో వచ్చినా.. అనుకున్న స్థాయిలో హిట్ కొట్టలేకపోయారు. ప్రస్తుతం మిస్టర్ బచ్చన్ మూవీ చేస్తున్నారు. హరీష్ శంకర్ దర్శకత్వంలో తెరకెక్కుతున్న ఈ చిత్రాన్ని పీపుల్ మీడియా ఫ్యాక్టరీ బ్యానర్ పై టీజీ విశ్వప్రసాద్ గ్రాండ్ గా నిర్మిస్తున్నారు.

ధమాకా, ఈగల్ తర్వాత పీపుల్ మీడియా ఫ్యాక్టరీ బ్యానర్ పై మరోసారి రవితేజ మిస్టర్ బచ్చన్ చేస్తున్నారు. బాలీవుడ్ హిట్ మూవీ రైడ్ కు రీమేక్ గా వస్తున్న ఈ సినిమాకు వివేక్ కూచిబొట్ల సహా నిర్మాతగా వ్యవహరిస్తున్నారు. భాగ్య శ్రీ బోర్సే హీరోయిన్ గా నటిస్తున్నారు. ఈ సినిమా షూటింగ్ శరవేగంగా జరుగుతోంది. ప్రస్తుతం జరుగుతున్న షెడ్యూల్ లో రవితేజ పాల్గొంటున్నారు. అదే సమయంలో హరీష్ శంకర్ పెట్టిన సోషల్ మీడియా పోస్ట్ వైరల్ గా మారింది

హరీష్ శంకర్.. లేటెస్ట్ గా రవితేజ ఫోటోను షేర్ చేశారు. అందులో రవితేజ మెడకు బ్యాండ్ తగిలించుకుని కనిపించారు. హరీష్ శంకర్ ఆ నెక్ బ్యాండ్ ను పట్టుకొని పక్కనే ఉన్నారు. ఆ పిక్ షేర్ చేస్తూ.. "మాస్ మహారాజా రవితేజ డెడికేషన్ కు హ్యాట్సాఫ్. తీవ్రమైన మెడ నొప్పి ఉన్నా షూటింగ్ లో పాల్గొంటున్నారు. థ్యాంక్యూ అన్నయ్య.. రోజూ మమ్మల్ని ఇన్‌స్పైర్ చేస్తారు" అంటూ హరీష్ శంకర్ రాసుకొచ్ఛారు

ఇక హరీష్ శంకర్ పోస్ట్ పెట్టిన తర్వాత.. రవితేజకు ఏమైందంటూ ప్రశ్నల వర్షం కురిపిస్తున్నారు నెటిజన్లు. మెడ నొప్పికి కారణమేంటి అని ఫ్యాన్స్ అడుగుతున్నారు. డెడికేషన్‌ కు హ్యాట్సాప్ అంటూ కామెంట్స్ పెడుతున్నారు. షూటింగ్ ఆపేస్తే మేకర్స్ కు భారీ నష్టం వస్తుందని భావించి.. మెడ నొప్పి ఉన్నా షూటింగ్ లో పాల్గొంటున్నట్లు తెలుస్తోందని చెబుతున్నారు. టేక్ కేర్ అన్న అని పోస్ట్లు పెడుతున్నారు

అయితే సినిమాల కోసం రవితేజ ఎంతగా కష్టపడతారో అందరికీ తెలిసిందే. టైగర్ నాగేశ్వరరావు మూవీ షూటింగ్ జరుగుతున్న సమయంలో ఆయన గాయపడగా.. 10 కుట్లు పడ్డాయి. ఆ సమయంలో డాక్టర్లు రెస్ట్ తీసుకోమని చెప్పినా వినలేదు. మేకర్స్ ఇబ్బంది పడతారని షూటింగ్ లో పాల్గొన్నారు. ఇప్పుడు మిస్టర్ బచ్చన్ మూవీని కూడా అదే డెడికేషన్ తో పూర్తి చేస్తున్నారు. మరి ఈ సినిమా ఎప్పుడు రిలీజ్ అవుతుందో? మాస్ మహారాజా ఎలాంటి హిట్ అందుకుంటారో చూడాలి.