టైగర్ పై డౌట్స్.. తేల్చేసిన మాస్ రాజా
అయితే తాజాగా రవితేజ.. తాను నిర్మించిన ఛాంగురే బాంగారురాజా ప్రీ రిలీజ్ ఈవెంట్ కు హాజరై సందడి చేశారు.
By: Tupaki Desk | 11 Sep 2023 6:03 AM GMTమాస్ మహారాజా రవితేజ హీరోగా రూపొందిన పాన్ ఇండియా సినిమా 'టైగర్ నాగేశ్వరరావు'. వంశీ దర్శకత్వం వహించారు. తేజ్ నారాయణ్ అగర్వాల్ సమర్పణలో అభిషేక్ అగర్వాల్ ఆర్ట్స్ బ్యానర్ పై అభిషేక్ అగర్వాల్ నిర్మించారు. అయితే గత కొద్ది రోజులుగా ఈ సినిమా రిలీజ్ డైట్ పై సందిగ్ధత నెలకొన్న విషయం తెలిసిందే. సలార్ ఫస్ట్ అనుకున్న డేట్ సెప్టెంబర్ 28న టైగర్ నాగేశ్వరరావు వస్తుందని అంతా అన్నారు. అయితే ఆ విషయంపై రవితేజ తాజాగా క్లారిటీ ఇచ్చారు.
సలార్ సెప్టెంబర్ 28 నుంచి వాయిదా పడడంతో ఆ డేట్ పై చాలా సినిమాలు కన్నేశాయి. లాంగ్ వీకెండ్ రిలీజ్ డేట్ కావడం వల్ల చాలా చిత్రాలు సెప్టెంబర్ 28 లేదా 29న వచ్చేందుకు రెడీ అయ్యాయి. ఈ క్రమంలోనే అక్టోబర్ 20 విడుదల తేదీ ఫిక్స్ చేసుకున్న టైగర్ నాగేశ్వరరావు కూడా సెప్టెంబర్ సలార్ ఫస్ట్ రిలీజ్ డేట్ కు ప్రీ పోన్ అయిందని జోరుగా ప్రచారం సాగింది. కానీ దీనిపై అఫీషియల్ అనౌన్స్ మెంట్ రాలేదు.
అయితే తాజాగా రవితేజ.. తాను నిర్మించిన ఛాంగురే బాంగారురాజా ప్రీ రిలీజ్ ఈవెంట్ కు హాజరై సందడి చేశారు. అక్కడ టైగర్ నాగేశ్వరరావు రిలీజ్ డేట్ పై క్లారిటీ ఇచ్చారు. ముందుగా అనుకున్నట్టే అక్టోబర్ 20న ప్రేక్షకుల ముందుకు రానున్నట్లు తెలిపారు. అంటే ఈ చిత్రం దసరా బరికే రెడీ అయింది. అదే సమయంలో బాలకృష్ణ భగవంత్ కేసరి, దళపతి విజయ్ లియో కూడా ఒక రోజు అటు ఇటుగా ఆడియెన్స్ ముందుకు రాబోతున్నాయి.
కాబట్టి టాలీవుడ్ లో ఈ దసరా బాక్సాఫీస్ రవితేజ వర్సెస్ బాలయ్యగా ఉండనుంది. విజయ్ లియో కూడా గట్టి హిట్ అయితే మాత్రం మూడు చిత్రాల మధ్యలో గట్టి బాక్సాఫీస్ వార్ ఉంటుంది. చూడాలి మరి ఏ సినిమా మంచి టాక్ తెచ్చుకుని ఎక్కువ వసూళ్లను అందుకుంటుందో.
ఇక 'టైగర్ నాగేశ్వరరావు'లో రవితేజ సరసన బాలీవుడ్ భామ నుపుర్ సనన్, గాయత్రి భరద్వాజ్ నటించారు. 1970లో దక్షిణ భారతంలో జరిగిన వాస్తవ సంఘటనల ఆధారంగా సినిమాను తెరకెక్కించారు. స్టువర్టుపురం గజదొంగ నాగేశ్వరరావు బయోపిక్ ఇది. ఈ చిత్రానికి కెమెరా వర్క్.. ఆర్. మది, సంగీతం.. జీవీ ప్రకాష్ కుమార్, ప్రొడక్షన్ డిజైనర్.. అవినాష్ కొల్లా, డైలాగ్ రైటర్.. శ్రీకాంత్ విస్సా అందించారు.