Begin typing your search above and press return to search.

రవితేజ 75.. ఇది మరో మాస్ కాంబో!

సితార ఎంటర్టైన్మెంట్స్ మరియు ఫార్చ్యూన్ ఫోర్ సినిమాస్ సంస్థలు సంయుక్తంగా ఈ ప్రొడక్షన్ నెంబర్ 28 పేరుతో రవితేజ చిత్రాన్ని నిర్మిస్తున్నారు.

By:  Tupaki Desk   |   11 Jun 2024 4:50 AM GMT
రవితేజ 75.. ఇది మరో మాస్ కాంబో!
X

మాస్ మహారాజా రవితేజ మరోసారి స్పీడ్ పెంచాడు. సక్సెస్ ఫెయిల్యూర్స్ తో సంబంధం లేకుండా కొనసాగుతున్న ఆయన కెరీర్ లో ధమాకా బిగ్గెస్ట్ హిట్ గా నిలిచిన విషయం తెలిసిందే. ఇక ఇప్పుడు మళ్ళీ అదే రేంజ్ లో హిట్ కొట్టేలా కాంబినేషన్స్ సెట్ చేస్తున్నాడు. తన 75వ సినిమాతో మరొక మైలురాయిని చేరుకోబోతున్నారు. సితార ఎంటర్టైన్మెంట్స్ మరియు ఫార్చ్యూన్ ఫోర్ సినిమాస్ సంస్థలు సంయుక్తంగా ఈ ప్రొడక్షన్ నెంబర్ 28 పేరుతో రవితేజ చిత్రాన్ని నిర్మిస్తున్నారు.

ఈ సినిమాకు యువ దర్శకుడు భాను భోగవరపు దర్శకత్వం వహిస్తున్నారు. రవితేజ గతంలో ఎన్నో బ్లాక్‌బస్టర్ హిట్లు అందించినా, ఈ సినిమా చాలా డిఫరెంట్ యాంగిల్ లో ఉండనున్నట్లు తెలుస్తోంది. ఫ్యాన్స్ చాలా కాలంగా రవితేజను పూర్తిస్థాయి మాస్ రోల్‌లో చూడాలని ఆశిస్తున్నారు. ఈ సినిమా ఆ అంచనాలను మించిన రీతిలో ఉండబోతుందని నిర్మాతలు తెలిపారు.

భాను భోగవరపు, వాల్తేరు వీరయ్య చిత్రానికి డైలాగ్ రైటర్ గా, సమజవరగమన చిత్రానికి కథ మరియు స్క్రీన్‌ప్లే రైటర్ గా పనిచేసి, తన ప్రతిభను నిరూపించుకున్నారు. ఈ నేపథ్యంతో, ఈ ప్రాజెక్ట్ పై అంచనాలు మరింత పెరిగాయి. ఈ సినిమాలో గ్లామరస్ బ్యూటీ శ్రీలీల రవితేజకు జంటగా నటిస్తున్నారు. ఈ జంట గతంలో 'ధమాకా' చిత్రంతో పెద్ద హిట్ అందుకున్నారు.

డ్యాన్స్ తో ఎనర్జిటిక్ పెర్ఫెమెన్స్ తో మంచి క్రేజ్ అందుకున్న ఈ జంట మరోసారి హిట్ కొట్టేందుకు రెడీ అయ్యారు. ఈ సినిమాకు సంగీత దర్శకుడు భీమ్స్ సిసిరోలియో. 'ధమాకా' చిత్రానికి కూడా భీమ్స్ సంగీతం అందించి సెన్సేషన్ క్రియేట్ చేశారు. ఇక సినిమాటోగ్రఫర్ గా విధు అయ్యానా, ప్రొడక్షన్ డిజైనర్ గా శ్రీ నాగేంద్ర టంగాల, ఎడిటర్ గా నేషనల్ అవార్డు విజేత నవీన్ నూలి బాధ్యతలు వహిస్తున్నారు.

భాను భోగవరపు రచించిన కథకు నందు సావిరిగన డైలాగ్స్ అందిస్తున్నారు. ఈ చిత్రం జూన్ 11న ఉదయం 7:29 గంటలకు పూజా కార్యక్రమంతో ప్రారంభమైంది. సూర్యదేవర నాగ వంశీ మరియు సాయి సౌజన్య నిర్మాణ బాధ్యతలు చేపట్టారు. శ్రీకర స్టూడియోస్ ఈ చిత్రాన్ని ప్రెజెంట్ చేస్తోంది. పూజా కార్యక్రమం తర్వాత శ్రీలీల క్లాప్ తో మొదటి షాట్ ను భాను భోగవరపు డైరెక్ట్ చేశారు. ఇప్పటికే ప్రేక్షకుల్లో ఆసక్తిని రేకెత్తించిన ఈ ప్రాజెక్ట్ పై మరిన్ని అప్‌డేట్స్ త్వరలోనే తెలియజేస్తామని చిత్ర యూనిట్ తెలిపారు. సినిమాకు సంబంధించిన రెగ్యులర్ షూట్ జూన్ 11న ప్రారంభం కానుంది.