Begin typing your search above and press return to search.

మాస్‌రాజా 75 కోసం విజ్జీ పాప బుక్‌..!

నందమూరి బాలకృష్ణ సినిమా భగవంత్‌ కేసరిలో విజ్జీ పాప పాత్రలో కనిపించి నటిగా తనను తాను నిరూపించుకున్న ముద్దుగుమ్మ శ్రీలీల

By:  Tupaki Desk   |   27 May 2024 5:29 AM GMT
మాస్‌రాజా 75 కోసం విజ్జీ పాప బుక్‌..!
X

నందమూరి బాలకృష్ణ సినిమా భగవంత్‌ కేసరిలో విజ్జీ పాప పాత్రలో కనిపించి నటిగా తనను తాను నిరూపించుకున్న ముద్దుగుమ్మ శ్రీలీల. అంతకు ముందు వరకు కేవలం డాన్స్ లు చేస్తూ అందాల ప్రదర్శన చేస్తూ ఆఫర్లు దక్కించుకున్న శ్రీలీల విజ్జీ పాప గా మాత్రం తెగ సందడి చేసింది.

ఆ మధ్య బ్యాక్ టు బ్యాక్ ఫ్లాప్స్ తో కాస్త స్లో అయిన శ్రీలీల మళ్లీ పుంజుకుంది. ప్రస్తుతం ఈ అమ్మడి చేతిలో మూడు నాలుగు సినిమాలు ఉన్నాయి. అంతే కాకుండా తాజాగా మాస్ మహారాజా రవితేజ హీరోగా రూపొందబోతున్న సినిమాలో కూడా శ్రీలీల నటించబోతున్నట్లు ఇండస్ట్రీ వర్గాల ద్వారా సమాచారం అందుతోంది.

రవితేజ 75వ సినిమాగా రూపొందబోతున్న ఈ సినిమాకు భాను భోగవరపు దర్శకత్వం వహించబోతున్నాడు. ఈ సినిమాలో రవితేజకు జోడీగా శ్రీలీలను నటింపజేసేందుకు చర్చలు పూర్తి అయ్యాయి. ఒకటి రెండు రోజుల్లో అగ్రిమెంట్ కూడా పూర్తి అవ్వబోతున్నట్లుగా టాక్ వినిపిస్తుంది.

సితార ఎంటర్‌టైన్మెంట్స్ బ్యానర్‌ లో ఈ సినిమా రూపొందబోతుంది. త్రివిక్రమ్‌ భార్య కూడా ఒక నిర్మాతగా వ్యవహరించనున్నట్లుగా సమాచారం అందుతోంది. భీమ్స్ సంగీతం అందించనున్నాడు. రవితేజ మరియు శ్రీలీల గతంలోనే ధమాకా సినిమాలో నటించారు.

ధమాకా ఎంతటి విజయాన్ని సొంతం చేసుకుందో ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు. హీరోగా ప్రస్తుతం రవితేజ మిస్టర్ బచ్చన్‌ సినిమాను చేస్తున్నాడు. ఇక తన 75వ సినిమాను ఇదే ఏడాది లో ప్రారంభించి వచ్చే ఏడాది సమ్మర్ కానుకగా ప్రేక్షకుల ముందుకు తీసుకు వచ్చేలా ప్లాన్‌ చేస్తున్నారు.