Begin typing your search above and press return to search.

టైర్ 2 ట్రాజెడి.. నువ్వైనా హిట్ కొట్టు రాజా

మాస్ మహారాజ్ రవితేజ హీరోగా వంశీకృష్ణ ఆకెళ్ళ దర్శకత్వంలో తెరకెక్కుతోన్న చిత్రం టైగర్ నాగేశ్వరరావు.

By:  Tupaki Desk   |   1 Oct 2023 4:30 PM GMT
టైర్ 2 ట్రాజెడి.. నువ్వైనా హిట్ కొట్టు రాజా
X

మాస్ మహారాజ్ రవితేజ హీరోగా వంశీకృష్ణ ఆకెళ్ళ దర్శకత్వంలో తెరకెక్కుతోన్న చిత్రం టైగర్ నాగేశ్వరరావు. భారీ బడ్జెట్ తో పాన్ ఇండియా ప్రాజెక్ట్ గా సిద్ధమవుతోన్న ఈ చిత్రాన్ని అభిషేక్ అగర్వాల్ పిక్చర్స్ బ్యానర్ నిర్మిస్తోంది. రవితేజ కెరియర్ లోనే హైయెస్ట్ బడ్జెట్ తో మూవీ సిద్ధమవుతోంది. అలాగే హైయెస్ట్ బిజినెస్ డీల్స్ కూడా ఈ చిత్రంపై జరిగాయి. ఏకంగా ఐదు ఇండియన్ భాషలలో మూవీని రిలీజ్ చేయనున్నారు.

దసరాకి రిలీజ్ కానున్న సినిమా ప్రమోషన్స్ లో భాగంగా ఇప్పటికే సాంగ్స్ ని ప్రేక్షకుల ముందుకి తీసుకొచ్చారు. అయితే ఇవి ఆశించిన స్థాయిలో బజ్ క్రియేట్ చేయలేదు. టీజర్ మాత్రం మంచి ఇంటెన్షన్ క్రియేట్ చేసింది. ఇప్పుడు ట్రైలర్,. ప్రీరిలీజ్ ఈవెంట్ కి ముహూర్తం కన్ఫర్మ్ చేశారు. అక్టోబర్ 3న టైగర్ నాగేశ్వరరావు ట్రైలర్ ని అన్ని భాషలలో రిలీజ్ చేయనున్నారు. అలాగే అక్టోబర్ 15న హైదరాబాద్ లో ప్రీ రిలీజ్ ఈవెంట్ గ్రాండ్ గా ప్లాన్ చేస్తున్నారు.

ట్రైలర్ రిలీజ్ తర్వాత సినిమాకి కచ్చితంగా మంచి బజ్ క్రియేట్ అయ్యే ఛాన్స్ ఉందని అంచనా వేస్తున్నారు. ఈ ఏడాది రవితేజ వాల్తేర్ వీరయ్య, రావణాసుర చిత్రాలతో ప్రేక్షకుల ముందుకి వచ్చారు.మల్టీ స్టారర్ గా వచ్చిన వాల్తేర్ వీరయ్య సూపర్ హిట్ అయ్యింది. రావణాసుర డిజాస్టర్ గా నిలిచింది. ఇప్పుడు టైగర్ నాగేశ్వరరావుని ఇండియా మొత్తం స్ట్రాంగ్ గా రీచ్ చేయాలని భావిస్తున్నారు.

ఇప్పటి వరకు టైర్ 2 హీరోలలో పాన్ ఇండియన్ మూవీ అనే బ్రాండ్ తగిలిస్తున్నారు తప్ప సినిమాని నార్త్ ఇండియాతో పాటు ఇతర భాషలలో పెద్దగా ప్రమోట్ చేయడం లేదు. కేవలం ఓటీటీలో మాత్రం ఐదు భాషలలో రిలీజ్ అవుతున్నాయి. థియేటర్ రిలీజ్ మాత్రం తెలుగులో గ్రాండ్ గా ఉంటే మిగిలిన రాష్ట్రాలలో డబుల్ డిజిట్ థియేటర్స్ లో మాత్రమే రిలీజ్ అవుతున్నాయి.

అయితే టైగర్ నాగేశ్వరరావు విషయంలో రవితేజ రూట్ మార్చే అవకాశం ఉందని టాక్. నార్త్ ఇండియాలో కూడా సినిమాని గట్టిగా ప్రమోట్ చేయడానికి ప్లాన్ చేస్తున్నారనే ప్రచారం నడుస్తోంది. మరి ఇందులో వాస్తవం ఎంత అనేది తెలియాల్సి ఉంది.