మాస్ రాజాకి సూపర్ సీనియర్ల సరసన స్థానం!
ప్రస్తుతం రవితేజ ఏజ్ 56 ఏళ్లు. ఆ కింద తరం హీరోలంతా 45-48 మధ్య ఉన్నవారే. దీంతో రవితేజని 60 ఏళ్లు దాటిన సీనియర్ల సరసన చేరుతున్నాడు.
By: Tupaki Desk | 11 April 2024 7:34 AM GMTమెగాస్టార్ చిరంజివి స్పూర్తితో సినిమాల్లోకి వచ్చాడు రవితేజ. అన్నయ్య కష్టాన్ని ఆదర్శంగా తీసుకుని ఎదిగిన నటుడు. ఎలాంటి బ్యాక్ గ్రౌండ్ లేకుండా ఇండస్ట్రీ కొచ్చి నటుడిగా తనకంటూ ప్రత్యేకమైన ఇమేజ్ ని సొంతం చేసుకున్నాడు. అసిస్టెంట్ గా ప్రయాణం మొదలు పెట్టి హీరోగా ఎదిగి కొత్త తరానికి ఆదర్శంగా నిలిచాడు. రవితేజ స్పూర్తిగా సినిమాల్లోకి వచ్చిన వారెంతో మంది ఉన్నారు. నేటి జనరేష్ యువతనికి రవితేజ రోల్ మోడల్ గా నిలుస్తున్నాడు. నేచురల్ స్టార్ నానికి రవితేజనే స్పూర్తి అని ఓ సందర్భంలో చెప్పాడు. అది టాలీవుడ్ లో రవితేజ స్థానం.
మరిప్పుడు రవితేజని చిరంజీవి తరం హీరోల సరసన కూర్చోబెట్టొచ్చా? నాగార్జున..వెంకటేష్...బాలకృష్ణ పక్కన మాస్ రాజాకి కూడా ఓ కుర్చీ వేయోచ్చా? అంటే అందుకు రవితేజ అన్ని రకాలుగా అర్హుడే.
ముఖ్యంగా వయసు రీత్యా చూసుకుంటే రవితేజకి ఆ అర్హతం ఉంది. చిరంజీవి వయసు 68...బాలయ్య వయసు 63...నాగార్జున వయసు 64... వెంకటేష్ వయసు 63.. సీనియర్ హీరోల్లో ఈ నలుగురు ఒక జనరేషన్ కి చెందినవారు. ఆ తర్వాత తరం గురించి తెలిసిందే.
అయితే వారి వయసుతో రవితేజ వయసు మధ్య చాలా వ్యత్యాసం ఉంది. కాబట్టి వాళ్ల సరసన రవితేజని చేర్చలేని పరిస్థితి. ప్రస్తుతం రవితేజ ఏజ్ 56 ఏళ్లు. ఆ కింద తరం హీరోలంతా 45-48 మధ్య ఉన్నవారే. దీంతో రవితేజని 60 ఏళ్లు దాటిన సీనియర్ల సరసన చేరుతున్నాడు. వాళ్లిద్దరి మధ్య వ్యత్యాసం కేవలం నాలుగేళ్లే కనిపిస్తుంది. నటుడిగా కూడా చిరంజీవి జనరేషన్ తర్వాత ఎవరు? అంటే రవితేజ...బ్రహ్మాజీ..జగపతిబాబు లాంటి వారే కనిపిస్తారు.
ఆ మధ్య ఓ సినిమాలో రవితేజ సరసన శ్రీలీల హీరోయిన్ గా నటించడంతో ఎలాంటి విమర్శలు తెరపైకి వచ్చాయో తెలిసిందే. దీంతో మాస్ రాజా తదుపరి సినిమాల హీరోయిన్ల విషయంలో అలెర్ట్ అయ్యాడు. 30 ప్లస్ వయసున్న హీరోయిన్లే తనకు సమ జోడీగా భావిస్తున్నాడు. ప్రస్తుతం రవితేజ పుల్ బిజీగా ఉన్న సంగతి తెలిసిందే. జయాపజయాలతో సంబంధం లేకుండా దూసుకుపోతున్నాడు.