Begin typing your search above and press return to search.

రామ్ చరణ్ రంగస్థలం.. అల్లరి నరేష్ బచ్చలమల్లి..!

ఈ సందర్భంగా సినిమా గురించి మరిన్ని విశేషాలను పంచుకునేందుకు మీడియాతో ముచ్చటించారు రాజేష్ దండా ఆ విషయాలు ఏంటో ఇప్పుడు చూద్దాం.

By:  Tupaki Desk   |   13 Dec 2024 1:21 PM GMT
రామ్ చరణ్ రంగస్థలం.. అల్లరి నరేష్ బచ్చలమల్లి..!
X

అల్లరి నరేష్ హీరోగా సోలో బ్రతుకే సో బెటర్ దర్శకుడు సుబ్బు మంగాదేవి డైరెక్షన్ లో తెరకెక్కుతున్న సినిమా బచ్చల మల్లి. అమృత అయ్యర్ హీరోయిన్ గా నటించిన ఈ సినిమాను సామజవరగమన, ఊరు పేరు భైరవకోన సినిమాలతో సూపర్ హిట్ అందుకున్న రాజేష్ దండా, బాలాజీ గుత్తా కలిసి నిర్మించారు. హాస్య మూవీస్ బ్యానర్ లో తెరకెక్కిన ఈ సినిమా నుంచి రిలీజైన ప్రచార చిత్రాలు అన్నీ మంచి రెస్పాన్స్ తెచ్చుకున్నాయి. బచ్చల మల్లి క్రిస్ మస్ కానుకగా డిసెంబర్ 20న రిలీజ్ అవుతుంది. ఈ సందర్భంగా సినిమా గురించి మరిన్ని విశేషాలను పంచుకునేందుకు మీడియాతో ముచ్చటించారు రాజేష్ దండా ఆ విషయాలు ఏంటో ఇప్పుడు చూద్దాం.

బచ్చల మల్లి కథ ఎప్పుడు విన్నారు? ఈ జర్నీ ఎలా స్టార్ట్ అయింది?

ఇట్లు మారేడుమిల్లి సినిమా షూటింగ్ జరుగుతున్నప్పుడు బచ్చలమల్లి కథ విన్నాను. కథ వినగానే బాడీలో ఒక ఎనర్జీ క్రియేట్ అయింది. మంచి ఎమోషనల్ ఫ్యామిలీ యాక్షన్ డ్రామా. నా మైండ్ లో ఈ కథ ఉండిపోయింది. ఎక్కడికి వెళ్లినా ఈ కథే గుర్తుకొచ్చేది. నరేష్ గారికి కథ చాలా నచ్చింది. అయితే అప్పటికి నరేష్ గారు వేరే సినిమాలు కమిట్ అవ్వడం వల్ల ఆయన కోసం రెండేళ్లు వెయిట్ చేసి ఈ సినిమా చేశాం. బచ్చలమల్లి క్యారెక్టర్ డ్రివెన్ సినిమా. 1980లో జరిగే కథ.

ఇది రియల్ లైఫ్ స్టొరీనా..?

మా డైరెక్టర్ గారిది తుని. అదే ఊర్లో బచ్చలపల్లి అనే ఒక వ్యక్తి ఉన్నారు. కేవలం ఆయన పేరుని మాత్రమే ఈ సినిమా కోసం తీసుకున్నాం. ఇది ఫిక్షనల్ స్టోరీ.

రామ్ చరణ్ గారికి రంగస్థలం ఎలానో నరేష్ గారికి బచ్చలపల్లి అలాంటి సినిమా అవుతుంది. మంచి మంచి కథలు నన్ను వెతుక్కుంటూ వచ్చాయి. అది నా అదృష్టంగా భావిస్తున్నాను. సినిమా అద్భుతంగా వచ్చింది. సినిమా చూసి ఇది నరేష్ 2.0 అని ఫీల్ అవుతారు.

బచ్చలపల్లి ఎలాంటి కథ?

లైఫ్ లో తప్పులు చేయొచ్చు. కానీ సరిదిద్దుకోలేని తప్పులు చేస్తే ఎలా ఉంటుందో బచ్చలపల్లి చూపించాం. మూర్ఖత్వం బోర్డర్ దాటేసిన క్యారెక్టర్ ఇది. సినిమాలో ఎమోషన్స్ చాలా అద్భుతంగా ఉంటాయి. డైరెక్టర్ సుబ్బు చాలా కసితో సినిమా చేశాడు. చాలా హార్డ్ వర్క్ చేశారు. మళ్ళీ మళ్ళీ తనతో వర్క్ చేయాలని వుంది. మా బ్యానర్ లో తను వన్ అఫ్ ది బెస్ట్ డైరెక్టర్.

మీ సినిమాలన్నిటికీ చాలా మంచి పేరు వచ్చింది. కథల విషయంలో ఎలాంటి జాగ్రత్తలు తీసుకుంటారు..?

నేనొక ఆడియన్ గానే కథ వింటాను. ఫస్ట్ అఫ్ ఎక్సయిట్ చేస్తేనే సెకండ్ హాఫ్ వింటాను. ఒకే తరహాలో కాకుండా డిఫరెంట్ డిఫరెంట్ సబ్జెక్టులు చేయాలని భావిస్తాను. నా సినిమాలు మీరు గమనిస్తే ఒక దానికి ఒకటి పోలిక లేకుండా అన్ని డిఫరెంట్ జోనర్స్ లో ఉంటాయి.

విశాల్ చంద్రశేఖర్ మ్యూజిక్ గురించి?

ఈ సినిమాలో విశాల్ చంద్రశేఖర్ మ్యూజిక్ వన్ అఫ్ ది హైలెట్. పాటలు ఇప్పటికే జనాల్లోకి వెళ్ళాయి. సినిమా చూసిన తర్వాత ఇంకా బాగా కనెక్ట్ అవుతారు. బ్యాగ్రౌండ్ స్కోర్ అద్భుతంగా చేశారు. ఆర్ఆర్ తో నెక్స్ట్ లెవల్ కి తీసుకెళ్ళారు.

డిఓపి రిచర్డ్ ఎం నాథన్ కూడా చాలా అద్భుతమైన సినిమాటోగ్రఫీ అందించారు. ఆర్ట్ డైరెక్టర్ బ్రహ్మకడలి నా మొదటి నుంచి వర్క్ చేస్తున్నారు. ఇందులో బ్రిలియంట్ వర్క్ ఇచ్చారు. ఫైట్ మాస్టర్ ప్రుద్వి గూస్ బంప్స్ ఫైట్స్ అందించారు. ఇందులో నరేష్ గారి ఫైట్స్ చూసి ఆడియన్స్ సర్ ప్రైజ్ అవుతారు.

ఈ కథలో మీరు పర్సనల్ గా కనెక్ట్ అయినా పాయింట్ ఏంటి?

నేను విలేజ్ నుంచి వచ్చాను. విలేజ్ లో ఇలాంటి క్యారెక్టర్స్ ఉంటాయి. అలాగే హీరో క్యారెక్టర్ డ్రివెన్ సినిమాలు ఎప్పుడు కూడా ప్రేక్షకుల్ని ఆకట్టుకుంటాయి. ప్రేక్షకులకి ఎమోషనల్ గా కనెక్ట్ అవుతాయి. ఇందులో మంచి క్యారెక్టరైజేషన్, లవ్ స్టోరీ, ఎమోషన్స్.. ఇవన్నీ కూడా నన్ను ఎక్సయిట్ చేశాయి. కథ విన్నప్పుడు ఎంత ఎమోషన్ అయితే ఉందో సినిమా చూసిన తర్వాత కూడా అంతే ఎమోషనల్ గా అనిపించింది. అందుకే సినిమా పై చాలా నమ్మకంగా ఉన్నాను.

హీరోయిన్ అమృత అయ్యర్ గురించి..?

హనుమాన్ సినిమా టీజర్ చూసి ఆమెను సంప్రదించడం జరిగింది. ఇందులో అమృతది మంచి పర్ఫామెన్స్ ఓరియంటెడ్ క్యారెక్టర్. మెమొరబుల్ గా ఉంటుంది. తనకి చాలా మంచి పేరు వస్తుంది.

నరేష్ గారితో ఇట్లు మారేడుమిల్లి, ఇప్పుడు బచ్చల మల్లి రెండు కూడా సీరియస్ ఫిలిమ్స్ చేశారు. కామెడీ సినిమా చేసే ఆలోచన ఉందా?

నెక్స్ట్ ఇయర్ చేయాలని ఆలోచన ఉంది. సామజవరగమన లాంటి ఫ్యామిలీ ఎంటర్ టైనర్ అనుకుంటున్నాను. అదే రైటర్స్ కథ రాస్తున్నారు. కథ రెడీ అవ్వగానే అనౌన్స్ చేస్తాం.

రావు రమేష్ గారి క్యారెక్టర్ గురించి..?

రావు రమేష్ గారి క్యారెక్టర్ చాలా ఇంపాక్ట్ ఫుల్ గా ఉంటుంది. ఈ కథ విన్నప్పుడే ఆ క్యారెక్టర్ ని ఆయనే చేయాలని భావించాం. చాలా అద్భుతంగా వచ్చింది.

బచ్చలమల్లి విషయంలో ఎలాంటి చాలెంజెస్ ఎదుర్కొన్నారు..?

ఛాలెంజ్ ఏం లేదండి. షూట్ అంత అవుట్ డోర్ చేసాం. అది కొంచెం డిఫికల్ట్ గా అనిపించింది.

ఊరు పేరు భైరవకోనకి సీక్వెల్ ఉందా..?

అది మా డైరెక్టర్ వి ఐ ఆనంద్ గారు చెప్పాలి.

మీకు ఇష్టమైన జోనర్..?

నాకు కమర్షియల్ సినిమాలు ఇష్టం.

కొత్త ప్రాజెక్ట్స్ గురించి..?

సందీప్ కిషన్ గారితో చేస్తున్న 'మజాకా' నాకు చాలా ఇష్టమైన సినిమా. అలాగే కిరణ్ అబ్బవరం గారి సినిమా ఫిబ్రవరి నుంచి స్టార్ట్ అవుతుంది. ఒక పాన్ ఇండియా సబ్జెక్ట్ కుదిరింది. త్వరలో ఆ వివరాలు చెప్తానని అన్నారు నిర్మాత రాజేష్ దండా.