బుచ్చి బాబు డబుల్ గేమ్ ఆడిస్తున్నాడా?
ప్రస్తుతం షూటింగ్ అంతా నైట్ జరుగుతోంది. క్రికెట్ ఆట నేపథ్యంలో వచ్చే సన్నివేశాలు చిత్రీకరిస్తున్నారు.
By: Tupaki Desk | 11 Feb 2025 7:58 AM GMTమెగా పవర్ స్టార్ ఆర్సీ 16 బుచ్చిబాబు దర్శకత్వంలో తెరకెక్కుతోన్న సంగతి తెలిసిందే. భారీ అంచనాల మధ్య పాన్ ఇండియాలో రూపొందుతున్న చిత్రమిది. ఇప్పటికే స్టోరీ ఏంటన్నది రివీల్ అయింది. గ్రామీణ నేపథ్యంలో సాగే స్పోర్స్ట్ స్టోరీ ఇది. క్రికెట్ ఆటను బేస్ చేసుకుని తెరకెక్కిస్తున్నారు. ప్రస్తుతం షూటింగ్ అంతా నైట్ జరుగుతోంది. క్రికెట్ ఆట నేపథ్యంలో వచ్చే సన్నివేశాలు చిత్రీకరిస్తున్నారు.
ఇది లాంగ్ షెడ్యూల్ కొన్ని రోజుల పాటు నైట్ మాత్రమే షూటింగ్ ఉంటుందని యూనిట్ ముందే ప్రకటించింది. అందుకు తగ్గట్టు క్రికెట్ సెట్ వేసి రామ్ చరణ్ సహా ప్రధాన తారాగణంపై కీలక సన్నివేశాలు చిత్రీకరిస్తున్నారు. ఈ విషయాన్ని కెమెరా మెన్ రత్నవేలు స్వయంగా రివీల్ చేసాడు. సెట్ కి సంబంధించిన కొన్ని ఫోటోలు లీక్ చేయడంతోనే సంగతి అర్దమైంది. అప్పటి వరకూ క్రీడ పై సస్పెన్స్ కొనసాగింది. రత్నవేలు క్లారిటీతో ఆ సస్పెన్స్ కి తెర పడింది.
ఈ నేపథ్యంలో తాజాగా మరో ఆట తెరపైకి వస్తుంది. క్రికెట్ తో పాటు కుస్తీ ఆట కూడా కీలకం అనే అంశం తెరపైకి వస్తోంది. క్రికెట్ -కుస్తీ కలిపి రెండు ఆటల నేపథ్యంతో బుచ్చిబాబు కథ రాసుకున్నట్లు వినిపిస్తుంది. ఈ సినిమా పవర్ క్రికెట్ అనే వర్కింగ్ టైటిల్ తోనే తెరకెక్కుతుందని వార్తలొస్తున్నాయి. అయితే కుస్తీ ఆట సంగతి రత్నవేలు ఎక్కడా రివీల్ చేయలేదు. మరి ఇందులో నిజమెంతో తెలియాలి. క్రికెట్ నేపథ్యమైతే ఉంది.
మరి కొత్తగా వచ్చిన కుస్తీ పట్టు ఉందా? లేదా? అన్నది మేకర్స్ ధృవీకరించాల్సి ఉంది. ఒకవేళ ఉంటే రెండు ఆటల నేపథ్యంలో హీరోని హైలైట్ చేయడం అన్నది పెద్ద సవాల్ తో కూడుకున్న వ్యవహారమే. అలా చేస్తే గనుక హీరో రెండు విభిన్న పాత్రలు పోషిస్తున్నట్లే. నటుడిగా చరణ్ ఎలాంటి పాత్రలోనైనా ఒదిగిపోతాడు. అందులో ఎలాంటి డౌట్ లేదు. కానీ ఎగ్జిక్యూషన్ కూడా అంతే పక్కాగా కుదరాలి. ఆ బాధ్యత మాత్రం బుచ్చిబాబుది. ఎందుకంటే ఈ సినిమాపై మెగా అభిమానులు చాలా ఆశలు పెట్టుకున్నారు.తప్పక విజయం సాధించాల్సిన చిత్రం కూడా ఇది.