చరణ్-జాన్వీ సీన్ లోకి వచ్చేదెప్పుడంటే?
ఇటీవలే మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ నటించిన `గేమ్ ఛేంజర్` భారీ అంచనాల మధ్య ప్రేక్షకుల ముందుకొచ్చిన సంగతి తెలిసిందే.
By: Tupaki Desk | 21 Jan 2025 5:01 AM GMTఇటీవలే మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ నటించిన `గేమ్ ఛేంజర్` భారీ అంచనాల మధ్య ప్రేక్షకుల ముందుకొచ్చిన సంగతి తెలిసిందే. ఫలితం రామ్ చరణ్‌ని తీవ్ర నిరుత్సాహానికి గురి చేసింది. హిట్ తో సంచలనం అవుతుంద నుకుంటే? రివర్స్ లో ప్లాప్ తో పెను సంచలనమైంది. ఈ విషయం చరణ్ ని కాస్త డిస్టబెన్స్ కి గురి చేసింది. ఇప్పుడిప్పుడే ఆ జ్ఞాపకాల నుంచి బయటకు వస్తున్నాడు. ఈ నేపథ్యంలో ఆర్సీ 16ని పట్టాలెక్కించాలని చూస్తున్నాడు.
ఇప్పటికే ఈసినిమా షూటింగ్ ప్రారంభమైన సంగతి తెలిసిందే. తొలి షెడ్యూల్ కూడా పూర్తయింది. రామ్ చరణ్, జాన్వీ కపూర్ సహా ప్రధాన పాత్ర దారులపై కీలక సన్నివేశాలు చిత్రీకరించారు. `గేమ్ ఛేంజర్` రిలీజ్ నేపథ్యంలో చరణ్ ఆ సినిమా షూట్ నుంచి రిలీవ్ అయ్యాడు. అప్పటి నుంచి మళ్లీ ఆర్సీ 16 షూట్ కి వె ళ్లలేదు. ఈ నేపథ్యంలో కొత్త షెడ్యూల్ జనవరి 27 నుంచి మొదలు పెట్టడానికి దర్శకుడు బుచ్చిబాబు రెడీ అవుతున్నారు.
హైదరాబాద్ లో ని భూత్ బంగ్లాలో ఈ షెడ్యూల్ ప్రారంభమవుతుంది. త్వరలోనే ఈ షెడ్యూల్‌కు సంబంధించి అధికారిక ప్రకటన వెలువడే అవకాశం ఉంది. ఇందులో రామ్ చరణ్ తో పాటు జాన్వీ కూడా జాయిన్ అవుతుంది. ఇద్దరిపై కొన్ని కీ సీన్స్ తెరకెక్కించనున్నారుట. అక్కడ కేవలం వారం రోజులు మాత్రమే షూటింగ్ ఉంటుందిట. అటుపై షూట్ రామోజీ ఫిలిం సిటీకి షిప్ట్ అవుతుందని సమాచారం. ఇక్కడ షూట్ లో మాత్రం కీలక పాత్ర ధారు లంతా యాడ్ అవుతారని సన్నిహిత వర్గాల సమాచారం. అయితే ఈ సినిమా రామ్ చరణ్, జాన్వీ కపూర్ చాలా ఆశలు పెట్టుకున్నారు.
ఈ సినిమాతో చరణ్ ఎలాగైన హిట్అందుకోవాలి. అలాగే జాన్వీ కి కూడా కీలకమే. జాన్వీ డెడ్యూ `దేవర` డివైడ్ టాక్ తో నడించింది. జాన్వీ పాత్ర పరంగా తీవ్ర విమర్శలు కూడా ఎదుర్కుంది. నటిగా ప్రేక్షకుల్ని అలరించలేదనే విమర్శ వ్యక్తమైంది. ప్లాస్టిక్ ఎక్స్ ప్రెషన్స్ తప్ప సహజ నటన ఎక్కడా కనిపించలేదని ట్రోలింగ్ ఫేస్ చేసింది. ఈ నేపథ్యంలో ఆర్సీ 16తో ఆ విమర్శల్ని ఎలాగైనా బధులివ్వాలని చూస్తోంది.