Begin typing your search above and press return to search.

RC16 : బుచ్చిబాబుపై మెగా ఫ్యాన్స్‌ ఒత్తిడి!

రామ్‌ చరణ్‌, బుచ్చిబాబు కాంబోలో రూపొందుతున్న RC16 సినిమా షూటింగ్‌ చకచక జరుగుతోంది.

By:  Tupaki Desk   |   23 March 2025 11:43 PM IST
RC16 Upadate In Ram Charan Birthday
X

రామ్‌ చరణ్‌, బుచ్చిబాబు కాంబోలో రూపొందుతున్న RC16 సినిమా షూటింగ్‌ చకచక జరుగుతోంది. ఈ ఏడాదిలోనే సినిమాని ప్రేక్షకుల ముందుకు తీసుకు రావాలని మేకర్స్ గట్టి ప్రయత్నాలు చేస్తున్నారు. ఈ ఏడాది చివరి వరకు సినిమాను విడుదల చేయాలని భావిస్తున్నారు. అందుకు తగ్గట్లుగా షూటింగ్‌ బ్రేక్‌ లేకుండా చేస్తున్నారు. గేమ్‌ ఛేంజర్ విడుదల అయినప్పటి నుంచి రామ్ చరణ్ రెగ్యులర్‌గా RC16 షూటింగ్‌కి హాజరు అవుతున్నాడు. మార్చి 27న రామ్‌ చరణ్ బర్త్‌డే సందర్భంగా టీజర్‌ను విడుదల చేయడంతో పాటు టైటిల్‌ను రివీల్‌ చేసే ఉద్దేశంతో మేకర్స్ ఉన్నారనే వార్తలు వచ్చాయి. కానీ బర్త్‌డే దగ్గరకు వస్తున్నా ఇప్పటి వరకు ఎలాంటి హడావిడి లేదు.

సాధారణంగా రామ్‌ చరణ్ బర్త్‌డే అంటే కనీసం రెండు వారాల నుంచి హడావుడి ఉంటుంది. ఆయన సినిమాకు సంబంధించిన అప్డేట్‌ను రెడీ చేస్తూ ఉంటారు. కానీ RC16 టీజర్‌కి సంబంధించి ఎలాంటి వార్తలు రావడం లేదు. దాంతో రామ్‌ చరణ్ బర్త్‌డే సందర్భంగా ఎలాంటి స్పెషల్‌ ఉండక పోవచ్చు అంటూ ఫ్యాన్స్‌లో చర్చ మొదలైంది. దాంతో మెగా ఫ్యాన్స్‌లో పలువురు దర్శకుడు బుచ్చిబాబును RC16 అప్డేట్‌ గురించి ప్రశ్నిస్తున్నారు. రామ్‌ చరణ్ బర్త్‌డే సందర్భంగా టీజర్ విడుదల చేయబోతున్నారా, కనీసం టైటిల్‌ను అయినా కన్ఫర్మ్‌ చేస్తారా అంటూ బుచ్చిబాబును సోషల్‌ మీడియా ద్వారా ఫ్యాన్స్‌ ట్యాగ్‌ చేస్తూ కామెంట్‌ చేస్తున్నారు. బుచ్చిబాబు మాత్రం ఇప్పటి వరకు ఎలాంటి క్లారిటీ ఇవ్వడం లేదు.

రామ్‌ చరణ్‌ బర్త్‌డే వేడుకల విషయంలోనూ ఫ్యాన్స్‌కి ఎలాంటి దిశా నిర్థేశం చేయడం లేదు. సాధారణంగా మెగా ఫ్యాన్స్‌ అసోషియేషన్‌ మీటింగ్స్ జరుగుతూ బర్త్‌డే ఏర్పాట్లు, కార్యక్రమాల నిర్వహణ గురించి మాట్లాడుతూ ఉంటారు. కానీ ఇప్పటి వరకు ఆ విషయంలోనూ ఎలాంటి అప్డేట్‌ లేదు. దాంతో రామ్‌ చరణ్ బర్త్‌డే సందర్భంగా ఎలాంటి కార్యక్రమాలు జరగడం లేదనే టాక్‌ వినిపిస్తుంది. మెగా ఫ్యామిలీలో ప్రస్తుతం ఉన్న ఎమర్జెన్సీ కారణంగా వేడుకలు అన్నింటిని రద్దు చేశారంటూ గుసగుసలు వినిపిస్తున్నాయి. ఇప్పటివరకు మెగా ఫ్యామిలీ నుంచి ఎలాంటి స్పందన ఈ విషయమై లేదు. కానీ మెగా ఫ్యామిలీలో ఏదో జరుగుతుంది అనే పుకార్లు మాత్రం మీడియా సర్కిల్‌లో షికార్లు చేస్తున్నాయి.

మెగా ఫ్యామిలీ మెంబర్స్‌కి సంబంధించిన సినిమాల హడావుడి ఏమీ లేదు. ఉగాది సందర్భంగా ఇతర మెగా హీరోలకు సంబంధించిన సినిమాల అప్డేట్స్ వస్తాయని ఆశించిన వారికి నిరాశే మిగిలే అవకాశాలు ఉన్నాయి. ఇప్పటి వరకు ఆయా సినిమాల నుంచి ఎలాంటి అప్డేట్‌ లేదు. దాంతో మెగా ఫ్యామిలీ హీరోల సినిమాల నుంచి ఈ నెలలో ఎలాంటి అప్డేట్‌ వచ్చే పరిస్థితి లేదని తెలుస్తోంది. సోషల్‌ మీడియాలో వస్తున్న ఒత్తిడి కారణంగా బుచ్చిబాబు కచ్చితంగా RC16 సినిమా గురించి చరణ్ బర్త్‌డే సందర్భంగా ప్రకటన చేస్తాడా అనేది చూడాలి. బుచ్చిబాబు దర్శకత్వంలో రూపొందుతున్న RC16 లో చరణ్ కు జోడీగా జాన్వీ కపూర్‌ నటిస్తూ ఉండగా, ఏఆర్‌ రెహమాన్ సంగీతాన్ని అందిస్తున్న విషయం తెల్సిందే. ఈ సినిమాలో కన్నడ సూపర్‌ స్టార్‌ శివ రాజ్ కుమార్‌ నటిస్తున్నాడు.