Begin typing your search above and press return to search.

రామ్ చరణ్ మూవీలో లక్కీ ఛాన్స్ మీకే..

ఇక ఈ సినిమాలో వీలైనంతవరకు కొత్త తరహా నటీనటులను తీసుకోవాలని దర్శకుడు ప్రయత్నిస్తున్నట్లుగా తెలుస్తోంది.

By:  Tupaki Desk   |   8 Dec 2023 9:04 AM GMT
రామ్ చరణ్ మూవీలో లక్కీ ఛాన్స్ మీకే..
X

రామ్ చరణ్ తేజ్ ప్రస్తుతం గేమ్ ఛేంజర్ సినిమాను పూర్తి చేసే పనిలో చాలా బిజీగా ఉన్నాడు. శంకర్ దర్శకత్వంలో దిల్ రాజు నిర్మిస్తున్న ఈ సినిమా ఇప్పటివరకు సరైన అప్డేట్స్ ఇవ్వకపోవడంతో సరైన బజ్ అయితే క్రియేట్ అవ్వడం లేదు. ఇక నిర్మాత దిల్ రాజు మాత్రం సినిమాపై చాలా కాన్ఫిడెంట్ గా ఉన్నాడు. షూటింగ్ పనులు ఆలస్యంగా కొనసాగుతున్నప్పటికీ శంకర్ గారి చేతుల్లోనే ఈ సినిమా అప్డేట్స్ ఉన్నాయి అనేలా ఆయన వివరణ అయితే ఇచ్చాడు.


ఇక మరోవైపు రామ్ చరణ్ బుచ్చిబాబు దర్శకత్వంలో తన 16వ సినిమాను త్వరలోనే స్టార్ట్ చేయబోతున్నాడు. ఇప్పటికే ఈ సినిమా ప్రీ ప్రొడక్షన్ పనులు కూడా మొదలైపోయాయి. నిర్మాణ సంస్థ మైత్రి మూవీ మేకర్స్ ప్రత్యేకంగా ఒక ఆఫీస్ కూడా నిర్మించింది. ఇక ఈ సినిమాలో వీలైనంతవరకు కొత్త తరహా నటీనటులను తీసుకోవాలని దర్శకుడు ప్రయత్నిస్తున్నట్లుగా తెలుస్తోంది.

మైత్రి మూవీ మేకర్స్ ప్రత్యేకంగా సినిమాకు సంబంధించిన ఆడిషన్స్ కూడా నిర్వహించేందుకు సిద్ధమయింది. ఇక కాస్టింగ్ కాల్ అప్డేట్ కూడా ఇచ్చేశారు. ప్రత్యేకంగా ఈరోజు విడుదల చేసిన ఒక పోస్టర్లో ఈ సినిమాలో ఉత్తరాంధ్ర యాస లో మాట్లాడే కొత్త తరహా నటీనటులు కావాలి అని ఒక అప్డేట్ అయితే ఇచ్చారు. దీంతో సినిమాలలో నటించాలని అనుకునే వారికి ఇది మంచి అవకాశం అని చెప్పవచ్చు.

ఇందులో నటించాలి అంటే ముందుగా ఒక వీడియో అలాగే మూడు ఫోటోగ్రాఫ్స్ ఇమెయిల్ లేదా వాట్సప్ ద్వారా అందించాలి అని డీటెయిల్స్ కూడా ఇచ్చారు. ఇక ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలి అని చాలామంది ప్రయత్నాలు మొదలు పెడుతున్నారు. లక్షల్లో కొత్త తరహా నటీనటులు ఈ ఆడిషన్స్ లో పాల్గొనే అవకాశం ఉన్నట్లుగా తెలుస్తోంది. మరి అందులో ఎవరు లక్కీ ఛాన్స్ అందుకుంటారో చూడాలి.

ఇక ఈ ప్రాజెక్టుకు సంబంధించిన షూటింగ్ ను అసలైతే ఈ నెలలోనే స్టార్ట్ చేయాలని అనుకున్నారు. ఇక రామ్ చరణ్ గేమ్ ఛేంజర్ సినిమాతో కాస్త బిజీగా ఉండడంతో మళ్ళీ వచ్చే ఏడాది షూటింగ్ స్టార్ట్ చేయాలి అని కొత్త ప్రణాళిక రచించారు. ఇక వీలైనంత త్వరగా సినిమా షూటింగ్ పూర్తిచేసే సినిమాను 2025లోగా ఫ్యాన్ ఇండియా రేంజ్ లో విడుదల చేయాలి అని బుచ్చిబాబు అనుకుంటున్నాడు.