Begin typing your search above and press return to search.

RC 16: ఒకప్పటి తెలుగు హీరోయిన్ రీ ఎంట్రీ?

ఈ ప్రాజెక్టుకు సంబంధించిన అనేక రకాల లీక్స్ అయితే సోషల్ మీడియాలో వైరల్ అయ్యాయి.

By:  Tupaki Desk   |   22 July 2023 10:22 AM GMT
RC 16: ఒకప్పటి తెలుగు హీరోయిన్ రీ ఎంట్రీ?
X

మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ తేజ్ ప్రస్తుతం గేమ్ ఛేంజర్ సినిమాను ఫినిష్ చేసేందుకు గట్టిగానే ప్రయత్నాలు చేస్తున్నాడు. శంకర్ ఇండియన్ 2 కారణంగా ఈ సినిమాకు కాస్త బ్రేకులు వేశాడు. లేకపోతే ఈ సినిమా ఎప్పుడో ఫినిష్ అయ్యి ఉండేది. అలాగే సినిమాను సంక్రాంతికి కూడా విడుదల చేయాలని అనుకున్నారు. కానీ ప్రస్తుత ప్లాన్ ప్రకారం అయితే సినిమా షూటింగ్ చాలా ఆలస్యం అయ్యే అవకాశం ఉంది.

ఇక వచ్చే ఏడాది సంక్రాంతికి వచ్చే అవకాశం అయితే లేదు. 2024 సమ్మర్ కే సినిమాను ప్రేక్షకుల ముందుకు తీసుకురావచ్చు. లేదంటే అప్పుడు కుదరకపోతే అదే ఏడాది విజయదశమికి రిలీజ్ చేసే అవకాశం అయితే ఉంది. ఇక ఈ లోపు ఆలస్యం చేయకుండా రామ్ చరణ్ తేజ్ బుచ్చిబాబుతో RC16 ప్రాజెక్టును మొదలుపెట్టాలని అనుకుంటున్నాడు.

ఈ ప్రాజెక్టుకు సంబంధించిన అనేక రకాల లీక్స్ అయితే సోషల్ మీడియాలో వైరల్ అయ్యాయి. ఇప్పటివరకు అధికారికంగా సినిమాకు సంబంధించిన ఆర్టిస్టుల విషయంలో అయితే క్లారిటీ రాలేదు. అయితే దర్శకుడు బుచ్చిబాబు మాత్రం విభిన్నమైన క్యారెక్టర్స్ కోసం స్టార్ నటీనటులను సెలక్ట్ చేసుకుంటున్నట్లు తెలుస్తోంది.

అయితే వెండితెరకు చాలా గ్యాప్ ఇచ్చిన మరి కొంతమంది సీనియర్ ఆర్టిస్టులు కూడా సినిమాలో కనిపించబోతున్నారట. ముఖ్యంగా ఒక స్పెషల్ పాత్ర కోసం ఒకప్పటి తెలుగు హీరోయిన్ లయను కూడా తీసుకురాబోతున్నట్లుగా తెలుస్తోంది. ఎన్నో మర్చిపోలేని సినిమాలలో నటించిన లయ ప్రస్తుతం పెద్దగా సినిమాలు అయితే చేయడం లేదు.

పెళ్లయిన అనంతరం అమెరికాలో స్థిరపడిన ఆమె చివరగా అమర్ అక్బర్ ఆంటోనీ సినిమాలో నటించింది. ఆ తర్వాత అవకాశాలు వచ్చినప్పటికీ కూడా క్యారెక్టర్స్ నచ్చకపోవడంతో ఆమె చేయలేదు. ఇక ఇప్పుడు బుచ్చిబాబు రామ్ చరణ్ 16వ సినిమా కోసం ఆమెతో సంప్రదింపులు జరుపుతున్నట్లుగా తెలుస్తోంది. ఇంకా ఫైనల్ కాలేదు కానీ దర్శకుడు ఆమెతో మాత్రం మాట్లాడుతున్నారట.

టెస్ట్ సూట్ లో కూడా పాల్గొనే అవకాశం ఉన్నట్లుగా తెలుస్తోంది. పక్క ప్రణాళికతో స్క్రిప్ట్ కు తగ్గట్టుగా ఆర్టిస్టులు ఫైనల్ అయిన తర్వాతనే రెగ్యులర్ షూటింగ్ మొదలు పెట్టాలని అనుకుంటున్నారు. ఇక సినిమాకు సంబంధించిన ప్రీ ప్రొడక్షన్ పనులన్నీ కూడా మరో మూడు నెలల్లో ఫినిష్ చేసుకొని ఈ ఏడాది నవంబర్లో రెగ్యులర్ షూటింగ్ మొదలు పెట్టాలని అనుకుంటున్నారు.