Begin typing your search above and press return to search.

#RC16 పిక్ టాక్‌ : ఏంటో అంత సీరియస్‌ చర్చ

రామ్‌ చరణ్ హీరోగా ఉప్పెన దర్శకుడు బుచ్చిబాబు దర్శకత్వంలో RC16 మూవీ షూటింగ్ ఇటీవల ప్రారంభం అయిన విషయం తెల్సిందే

By:  Tupaki Desk   |   21 March 2024 7:15 AM GMT
#RC16 పిక్ టాక్‌ : ఏంటో అంత సీరియస్‌ చర్చ
X

రామ్‌ చరణ్ హీరోగా ఉప్పెన దర్శకుడు బుచ్చిబాబు దర్శకత్వంలో RC16 మూవీ షూటింగ్ ఇటీవల ప్రారంభం అయిన విషయం తెల్సిందే. చిరంజీవి, శంకర్‌, అల్లు అరవింద్ తో పాటు ఇంకా ఎంతో మంది సినీ ప్రముఖులు హాజరు అయిన ఈ కార్యక్రమం వైభవంగా జరిగింది. అందుకు సంబంధించిన ఫోటోలు సోషల్ మీడియాలో వైరల్ అయ్యాయి.

ఆ ఫోటోలు ఒక వైపు సోషల్‌ మీడియాలో వైరల్‌ అవుతున్న సమయంలోనే తాజాగా ఈ ఫోటోలు నెట్టింట ప్రత్యక్ష్యం అయ్యాయి. రామ్‌ చరణ్ మరియు జాన్వీ కపూర్ తో బుచ్చిబాబు చర్చలు జరుపుతున్నట్లుగా ఉన్న ఈ ఫోటోలను మెగా ఫ్యాన్స్‌ తెగ షేర్‌ చేస్తున్నారు.

RC16 వర్కింగ్ స్టిల్స్ అంటూ ఈ ఫోటోలను సోషల్ మీడియాలో సర్క్యులేట్‌ చేస్తున్నారు. ఇందులో రామ్‌ చరణ్ ఏదో విషయాన్ని చెబుతూ ఉండగా బుచ్చి బాబు మరియు జాన్వీ కపూర్ చాలా సీరియస్ గా వింటున్నట్లు చూడవచ్చు. ఇందులో జాన్వీ కపూర్‌ చాలా ముద్దుగా క్యూట్‌ గా ఉందంటూ నెటిజన్స్‌ కామెంట్స్ చేస్తున్నారు.

మరో ఫోటోలో చరణ్ మరియు జాన్వీ కపూర్ లు నవ్వుకుంటూ మాట్లాడుకుంటూ ఉన్నారు. ఈ రెండు ఫోటోలు కూడా తెగ వైరల్‌ అవుతున్నాయి. సినిమా రెగ్యులర్‌ షూటింగ్‌ ప్రారంభం కావాల్సి ఉంది. ప్రస్తుతం స్క్రిప్ట్‌ చర్చలు జరుగుతున్నట్లుగా తెలుస్తోంది. అందులో భాగంగానే ఇలా ఈ ముగ్గురు చర్చల్లో బిజీగా ఉన్నారు.

రామ్‌ చరణ్‌ మరియు జాన్వీ కపూర్ ల జోడీ కోసం ప్రేక్షకులు ముఖ్యంగా మెగా ఫ్యాన్స్ చాలా ఆసక్తిగా ఎదురు చూస్తున్నారు. షూటింగ్‌ ప్రారంభంకు ముందే ఇలాంటి వర్కింగ్‌ పిక్స్ నెట్టింట షేర్ కావడంతో సినిమాపై మరింత ఆసక్తి అంచనాలు పెరిగే అవకాశాలు ఉన్నాయి.