Begin typing your search above and press return to search.

RC 16 ప్లానింగ్ చేంజ్..?

శంకర్ తో గేమ్ చేంజర్ సినిమా పూర్తి చేసిన తర్వాత తన నెక్స్ట్ సినిమాను ఉప్పెన దర్శకుడు బుచ్చి బాబుతో ఫిక్స్ చేసుకున్నాడు రాం చరణ్.

By:  Tupaki Desk   |   17 Jun 2024 11:26 AM GMT
RC 16 ప్లానింగ్ చేంజ్..?
X

శంకర్ తో గేమ్ చేంజర్ సినిమా పూర్తి చేసిన తర్వాత తన నెక్స్ట్ సినిమాను ఉప్పెన దర్శకుడు బుచ్చి బాబుతో ఫిక్స్ చేసుకున్నాడు రాం చరణ్. ఆర్సీ 16వ సినిమాగా రాబోతున్న ఈ సినిమాను మైత్రి మూవీ మేకర్స్ భారీ స్కేల్ లో నిర్మించబోతున్నారని తెలుస్తుంది. ఈ సినిమాను పాన్ వరల్డ్ ప్రాజెక్ట్ గా ప్లాన్ చేస్తున్నారట. ఈ సినిమాకు మ్యూజిక్ డైరెక్టర్ గా రెహమాన్ ను లాక్ చేయగా హీరోయిన్ గా జాన్వి కపూర్ ని ఫిక్స్ చేశారు. సినిమా అసలైతే ఈ ఇయర్ దసరా తర్వాత సెట్స్ మీదకు తీసుకెళ్లాలని అనుకున్నారు.

కానీ బుచ్చి బాబు ప్లాన్ మార్చేసినట్టు తెలుస్తుంది. ఈమధ్యనే తండ్రిని కోల్పోయిన బుచ్చి బాబు తన నెక్స్ట్ సినిమా కోసం ఒక ఆరు నెలలు టైం తీసుకోవాలని అనుకుంటున్నాడట. చరణ్ కూడా అందుకు ఓకే చెప్పడంతో 2025 ఫస్ట్ హాఫ్ లోనే సినిమా సెట్స్ మీదకు వెళ్తుందని అంటున్నారు. అయితే ఈలోగా సినిమాకు సంబంధించిన అన్ని మిగతా వర్క్ పూర్తి చేసేలా బుచ్చి బాబు ప్లాన్ చేస్తున్నారట.

స్పోర్ట్స్ బ్యాక్ డ్రాప్ లో వస్తున్న ఈ సినిమాను బుచ్చి బాబు కథ కథనాలు నెక్స్ట్ లెవెల్ లో రాసుకున్నారని తెలుస్తుంది. సినిమా తప్పకుండా ఇంటర్నేషనల్ లెవెల్ లో మరోసారి తెలుగు సినిమా గురించి మాట్లాడుకునేలా చేస్తుందని అంటున్నారు. ఈ సినిమా కోసం చరణ్ కొత్త లుక్ తో కనిపిస్తారని తెలుస్తుంది. RRR తర్వాత చరణ్ ని మళ్లీ ఇంటర్నేషనల్ లెవెల్ లో సత్తా చాటేలా బుచ్చి బాబు సినిమా ఉంటుందని అంటున్నారు.

ట్రిపుల్ ఆర్ లో చరణ్ చేసిన రామరాజు పాత్ర వరల్డ్ సినీ లవర్స్ ని బాగా నచ్చేలా చేసింది. సినిమా కోసం తను పడిన కష్టం తెర మీద కనిపించడంతో పాటుగా చరణ్ కమిట్మెంట్ ఏంటన్నది RRR తో ప్రూవ్ అయ్యింది. అందుకే చరణ్ కోసం బుచ్చి బాబు అదిరిపోయే స్టోరీ లాక్ చేశాడట. ఈ సినిమా మొదలైనప్పుడే సినిమా నుంచి ఒక సర్ ప్రైజ్ అప్డేట్ ఇస్తాడని అంటున్నారు. బుచ్చి బాబు చరణ్ కాంబో సినిమా నెవర్ బిఫోర్ రికార్డులు టార్గెట్ గా వారు సినిమాను సిద్ధం చేసేందుకు రెడీ అవుతున్నారు.